Mr Bachchan: ఇట్స్ అఫీషియల్.. OTTలోకి రవితేజ మిస్టర్ బచ్చన్ మూవీ..

మాస్ మహారాజ రవితేజ- హరీశ్ శంకర్ కాంబినేషన్‌లో ముచ్చటగా తెరకెక్కిన మూడో సినిమా మిస్టర్ బచ్చన్. స్వాతంత్ర్య దినోత్సవం కానుకగా ఆగస్టు 15న విడుదలైన మిస్టర్ బచ్చన్ అంచనాలను మాత్రం అందుకోలేకపోయింది. ఫస్ట్ షో నుంచే మిక్స్ డ్ టాక్ తెచ్చుకుంది. దీనికి తోడు పోటీగా ఇస్మార్ట్ శంకర్, ఆయ్ వంటి సినిమాలు బరిలో ఉండడంతో పెద్దగా వసూళ్లు సాధించలేకపోయింది. బాక్సాఫీస్ దగ్గర కూడా వసూళ్లో వెనకపడిపోయింది.

Mr Bachchan: ఇట్స్ అఫీషియల్.. OTTలోకి రవితేజ మిస్టర్ బచ్చన్ మూవీ..

|

Updated on: Sep 08, 2024 | 4:28 PM

మాస్ మహారాజ రవితేజ- హరీశ్ శంకర్ కాంబినేషన్‌లో ముచ్చటగా తెరకెక్కిన మూడో సినిమా మిస్టర్ బచ్చన్. స్వాతంత్ర్య దినోత్సవం కానుకగా ఆగస్టు 15న విడుదలైన మిస్టర్ బచ్చన్ అంచనాలను మాత్రం అందుకోలేకపోయింది. ఫస్ట్ షో నుంచే మిక్స్ డ్ టాక్ తెచ్చుకుంది. దీనికి తోడు పోటీగా ఇస్మార్ట్ శంకర్, ఆయ్ వంటి సినిమాలు బరిలో ఉండడంతో పెద్దగా వసూళ్లు సాధించలేకపోయింది. బాక్సాఫీస్ దగ్గర కూడా వసూళ్లో వెనకపడిపోయింది. అయినా కానీ ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్‌ కోసం రవితేజ ఫ్యాన్స్‌ తో పాటు.. ఫిల్మ్ లవర్స్‌ కూడా ఎదురుచూస్తున్నారు. ఇక వారి కోసమే అన్నట్టు ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్‌ పై అఫీషియల్ న్యూస్ బయటికి వచ్చింది. ఇక మిస్టర్ బచ్చన్ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. అయితే ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ గురించి తాజాగా అఫీషియల్ అనౌన్స్ మెంట్ చేసింది నెట్‌ ఫ్లిక్స్‌ టీం. సెప్టెంబర్ 12 నుంచే రవితేజ సినిమాను స్ట్రీమింగ్ కు తీసుకొస్తున్నట్లు తమ సోషల్ మీడియా ప్లాట్ ఫాం ఎక్స్‌లో అఫీషియల్‌గా ఓ పోస్ట్ పెట్టింది.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

డెలివరీ డేట్‌కు ముందు.. వినాయకుడి దీవెనలందుకున్న స్టార్ కపుల్

Fish Venkat: ఫిష్ వెంకట్‌ ఆరోగ్యానికి చిరు భరోసా..

Raj Tarun: మాల్వీ ఫ్లాట్‌లో రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిన రాజ్‌తరుణ్..

TOP 9 ET News: మిస్టర్ బచ్చన్ ఎఫెక్ట్.. ఉస్తాద్‌లో కీలక మార్పులు

Follow us