ఇండస్ట్రీలో ఎవరూ బయటపెట్టని సీక్రెట్స్ చాలా ఉన్నాయి.. సుమలత షాకింగ్ కామెంట్స్

మలయాళ చిత్ర పరిశ్రమలో హేమ కమిటీ రిపోర్ట్ కుదిపేస్తోంది. మలయాళ ఇండస్ట్రీలో పని చేస్తోన్న చాలా మంది మహిళలకు చేదు అనుభవం ఎదురైనట్లు హేమ కమిటీ రిపోర్ట్ బయటపెట్టింది. దాంతో చాలా మంది నటీమణులు బయటకు వస్తున్నారు. తమకు జరిగిన లైంగిక వేధింపుల గురించి ధైర్యంగా మాట్లాడుతున్నారు.

ఇండస్ట్రీలో ఎవరూ బయటపెట్టని సీక్రెట్స్ చాలా ఉన్నాయి.. సుమలత షాకింగ్ కామెంట్స్

|

Updated on: Sep 08, 2024 | 4:30 PM

మలయాళ చిత్ర పరిశ్రమలో హేమ కమిటీ రిపోర్ట్ కుదిపేస్తోంది. మలయాళ ఇండస్ట్రీలో పని చేస్తోన్న చాలా మంది మహిళలకు చేదు అనుభవం ఎదురైనట్లు హేమ కమిటీ రిపోర్ట్ బయటపెట్టింది. దాంతో చాలా మంది నటీమణులు బయటకు వస్తున్నారు. తమకు జరిగిన లైంగిక వేధింపుల గురించి ధైర్యంగా మాట్లాడుతున్నారు. మరికొంతమంది ఇతర భాషల్లోనూ హేమ తరహా కమిటీని ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. ఈ క్రమంలోనే నటి, మాజీ ఎంపీ సుమలత ఇండస్ట్రీలో జరుగుతోన్న లైంగిక వేధింపుల గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు. సినీ ఇండస్ట్రీలో మహిళల భద్రతకు సంబంధించిన చట్టాలను అమలు చేసేందుకు.. రాజ్యాంగబద్ధమైన వ్యవస్థ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తానని చెప్పారు. ఇక రీసెంట్ గా హేమ కమిటీ రిపోర్ట్ గురించి మాట్లాడిన సుమలత… సినిమా ఇండస్ట్రీలో ఎవరూ బయటపెట్టని సీక్రెట్స్ చాలా ఉన్నాయంటూ చెప్పి అందర్నీ షాక్ అయ్యేలా చేశారు. ఇదొక చారిత్రక ఘట్టమని.. ఈ విషయాలను ధైర్యంగా బయటపెట్టిన మహిళలకు, అందుకు బాటలు వేసిన WCCకి ధన్యవాదాలు చెప్పారు. అంతేకాదు ధైర్యంగా ముందుకు వచ్చి తమకు జరిగిన చేదు అనుభవాలను బయట పెడుతోన్న మహిళలకు భద్రత కల్పించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Mr Bachchan: ఇట్స్ అఫీషియల్.. OTTలోకి రవితేజ మిస్టర్ బచ్చన్ మూవీ..

డెలివరీ డేట్‌కు ముందు.. వినాయకుడి దీవెనలందుకున్న స్టార్ కపుల్

Fish Venkat: ఫిష్ వెంకట్‌ ఆరోగ్యానికి చిరు భరోసా..

Raj Tarun: మాల్వీ ఫ్లాట్‌లో రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిన రాజ్‌తరుణ్..

TOP 9 ET News: మిస్టర్ బచ్చన్ ఎఫెక్ట్.. ఉస్తాద్‌లో కీలక మార్పులు

Follow us