Watch: గోడౌన్‌లో కూలీలపై అకస్మాత్తుగా కూలిన బస్తాలు.. సీసీ కెమెరాలో రికార్డైన షాకింగ్‌ దృశ్యాలు..

గోడౌన్‌లో ఐదుగురు కూలీలు బస్తాలు దింపుతుండగా ప్రమాదం జరిగిందని తెలిసింది. పొడవాటి గోధుమ బస్తాలు అకస్మాత్తుగా పడిపోయాయి. కార్మికులు తప్పించుకోవడానికి సమయం లేకుండా పోయింది. ఈ ఘటన అంతా సీసీటీవీలో రికార్డయ్యింది. వీడియోలో అనూహ్యంగా కూలీలపైకి బస్తాలు ఒక్కసారిగా పడుతున్నాయి.

Watch: గోడౌన్‌లో కూలీలపై అకస్మాత్తుగా కూలిన బస్తాలు.. సీసీ కెమెరాలో రికార్డైన షాకింగ్‌ దృశ్యాలు..
Wheat Sacks Fall
Follow us
Jyothi Gadda

|

Updated on: Sep 09, 2024 | 8:38 PM

గుజరాత్‌లోని అమ్రేలిలో విషాద ఘటన చోటు చేసుకుంది. స్థానిక గోడౌన్‌లో కొందరు కూలీలు గోధుమల బస్తాలను అన్‌లోడింగ్ చేస్తుండగా ప్రమాదం జరిగింది. అకస్మాత్తుగా కూలీలపై బస్తాలు దొర్లిపడ్డాయి. బస్తాలు కూలిపోవడంతో ఒక కార్మికుడు ప్రాణాలు కోల్పోగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడిన విషాద సంఘటన చోటుచేసుకుంది. బస్తాల కింద చిక్కున్న కూలీలను తోటి కూలీలు వెలికి తీశారు. హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

గోడౌన్‌లో ఐదుగురు కూలీలు బస్తాలు దింపుతుండగా ప్రమాదం జరిగిందని తెలిసింది. పొడవాటి గోధుమ బస్తాలు అకస్మాత్తుగా పడిపోయాయి. కార్మికులు తప్పించుకోవడానికి సమయం లేకుండా పోయింది. ఈ ఘటన అంతా సీసీటీవీలో రికార్డయ్యింది. వీడియోలో అనూహ్యంగా కూలీలపైకి బస్తాలు ఒక్కసారిగా పడుతున్నాయి.

గాయపడిన కూలీలను చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించగా, ప్రస్తుతం వారికి వైద్యసేవలు అందిస్తున్నారు. స్థానిక అధికారులు ప్రమాదానికి గల కారణాలను పరిశీలిస్తున్నారు. విషాదం వెలుగులోకి రావడంతో గోడౌన్ వద్ద భద్రతా చర్యలను సమీక్షించాలని భావిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..