తల్లి కళ్లెదుటే కానరాని లోకాలకు.. చెరువులో పడి ఇద్దరు చిన్నారులు మృతి

ఇన్నేళ్ల తర్వాత స్వగ్రామానికి వస్తే చేదు జ్ణాపకాలు మిగిల్చింది. ఓ వైపు సొదరుడి మరణవార్త నుంచి తేరుకోక ముందే ఆ కన్నతల్లి ఇద్దరు పిల్లల మృత్యువాతతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మరోవైపు చెరువులో మునిగిపోతుండగా రక్షింపబడిన మరో ఇద్దరు చిన్నారులు అస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. తండ్రి ఓంకార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

తల్లి కళ్లెదుటే కానరాని లోకాలకు.. చెరువులో పడి ఇద్దరు చిన్నారులు మృతి
Died
Follow us

| Edited By: Jyothi Gadda

Updated on: Sep 09, 2024 | 8:08 PM

నారాయణపేట జిల్లా నారాయణపేట మండలంలోని తిర్మలాపూర్ గ్రామానికి చెందిన బాలప్ప మృతి చెందాడు. దీంతో కర్ణాటక రాష్ట్రంలో ఉంటున్న రజిష్ట తన సొదరుడి దశదిన కర్మకు కుటుంబంతో సహా వచ్చింది. కార్యక్రమం ముగిసిన అనంతరం రజిష్ట, మేనత్త పద్మ, మరో బంధువు సత్తెమ్మ పిల్లలను తీసుకొని ఆటవిడుపుకోసం తిర్మలదేవునిపల్లి శివారులోని ఆసిరెడ్డి చెరువుకు వెళ్లారు. మేనత్త పద్మ, పిల్లలతో సహా చెరువులో స్నానం చేసి ఒడ్డున చేరారు. అనంతరం ముగ్గురు మహిళలు బట్టలు ఉతికేందుకు కొద్దిగా పక్కకు వెళ్లారు. ఇంతలోనే రజిష్ట కుమారుడు రోహిత్, కూతురు ప్రీతి మరోసారి చెరువులోకి దిగారు. అయితే వారు దిగిన ప్రాంతంలో చెరువు లోతు ఎక్కువగా ఉండడంతో నీటిలో మునిగిపోయారు. వెంటనే గమనించి వారిని కాపాడేందుకు రజిష్ట మరో ఇద్దరు పిల్లలు సైతం చెరువులోకి దిగారు. దీంతో వారు కూడా మునిగిపోతుండడంతో కేకలు వేయగా అవి విన్న మహిళలు నలుగురు పిల్లలను కాపాడే ప్రయత్నం చేశారు.

అయితే వారు కూడా నీటిలో మునిగిపోతుండగా గమనించిన స్థానికులు కాపాడే ప్రయత్నం చేశారు. అయితే నీటిలో మునిగిపోతున్న ఇద్దరు మహిళలను, మరో ఇద్దరు చిన్నారులను కాపాడారు. అప్పటికే ముందుగా దిగిన పిల్లలు రోహిత్, ప్రీతి మరణించారు. కళ్లేదుటే తన పిల్లలు కానరాని లోకాలకు వెళ్లడంతో ఆతల్లి గుండెతల్లడింది. ఇద్దరు పిల్లల మరణవార్త విని అపస్మారక స్థితిలోకి వెళ్లింది.

రాక రాక సోదరుడి ఇంటికి వస్తే ఆ కుటుంబంలో ఘటన తీవ్ర విషాదం నింపింది. తిర్మలాపూర్ గ్రామానికి చెందిన చెంచు తిమ్మమ్మ, కిష్టప్ప దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. కుమారుల్లో ఒకరు వికారాబాద్ లో స్థిరపడగా మరోకరు స్వగ్రామంలోనే నివసిస్తున్నారు. ఇక కుమార్తె రజిష్ట సుమారు 18ఏళ్ల క్రితమే ప్రేమవివాహం చేసుకొని కర్ణాటక రాష్ట్రంలోని బీజాపూర్ లో స్థిరపడింది. అయితే ఇటీవలె సొదరుడి మరణ వార్త విని స్వగ్రామానికి వచ్చింది.

ఇవి కూడా చదవండి

ఇన్నేళ్ల తర్వాత స్వగ్రామానికి వస్తే చేదు జ్ణాపకాలు మిగిల్చింది. ఓ వైపు సొదరుడి మరణవార్త నుంచి తేరుకోక ముందే ఆ కన్నతల్లి ఇద్దరు పిల్లల మృత్యువాతతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మరోవైపు చెరువులో మునిగిపోతుండగా రక్షింపబడిన మరో ఇద్దరు చిన్నారులు అస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. తండ్రి ఓంకార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి…