Vande Bharat: తెలంగాణకు మరో వందే భారత్‌.. ఏడున్నర గంటల్లో 578 కి.మీల జర్నీ

తాజాగా తెలంగాణలో మరో కొత్త వందే భారత్‌ రైలు అందుబాటులోకి వస్తోంది. ప్రస్తుతం సికింద్రాబాద్-తిరుపతి, సికింద్రాబాద్- విశాఖ పట్నం, సికింద్రాబాద్‌- బెంగళూరుల మధ్య వందే భారత్‌ రైలు దూసుకెళ్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా తెలంగాణలో మరో మార్గంలో వందే భారత్ రైలును ప్రారంభించనున్నారు...

Vande Bharat: తెలంగాణకు మరో వందే భారత్‌.. ఏడున్నర గంటల్లో 578 కి.మీల జర్నీ
Follow us
Narender Vaitla

|

Updated on: Sep 09, 2024 | 6:57 PM

భారతీయ రైల్వే ముఖచిత్రాన్ని మారుస్తూ అందుబాటులోకి వచ్చిన వందే భారత్‌కు ప్రయాణికుల నుంచి మంచి ఆదరణ లభిస్తోన్న విషయం తెలిసిందే. అధునాతన సౌకర్యాలు, అత్యంత వేగంతో గమ్యాన్ని చేరుకునే అవకాశం లభించడంతో ప్రయాణికులు పెద్ద ఎత్తున వందే భారత్ సేవలను వినియోగించుకుంటున్నారు. డిమాండ్‌కు అనుగుణంగానే దేశవ్యాప్తంగా వందే భారత్‌ సేలు విస్తరిస్తున్నాయి.

తాజాగా తెలంగాణలో మరో కొత్త వందే భారత్‌ రైలు అందుబాటులోకి వస్తోంది. ప్రస్తుతం సికింద్రాబాద్-తిరుపతి, సికింద్రాబాద్- విశాఖ పట్నం, సికింద్రాబాద్‌- బెంగళూరుల మధ్య వందే భారత్‌ రైలు దూసుకెళ్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా తెలంగాణలో మరో మార్గంలో వందే భారత్ రైలును ప్రారంభించనున్నారు. సికింద్రాబాద్‌, నాగ్‌పూర్‌ల మధ్య వందే భారత్‌ సేవలు అందుబాటులోకి వస్తున్నాయి. సెప్టెంబర్‌ 15వ తేదీ నుంచి ఈ రైలు ప్రారంభం కానుంది. ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్‌గా ఈ రైలును ప్రారంభించనున్నారు.

సికింద్రబాద్‌ నాగ్‌పూర్‌ల మధ్య 578 కి.మీల దూరం ఉంది. వందే భారత్‌ అందుబాటులోకి రావడం ద్వారా కేవలం 7 గంటల 20 నిమిషాల్లోనే గమ్య స్థానాన్ని చేరుకోవచ్చు. ఈ రైలు ఉదయం 5 గంటలకు నాగ్ పూర్ నుంచి బయలు దేరి.. అదే రోజు మధ్యాహ్నం 12.15 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. తిరిగి మధ్యాహ్నం ఒంటి గంటకు సికింద్రాబాద్‌లో బయలు దేరి రాత్రి 8.20 గంటలకు గమ్యస్థానానికి చేరుకుంటుంది.

ఇక ఈ రైలు కాజీపేట, రామగుండం, చంద్రాపూర్, సేవాగ్రామ్‌లో ఆగుతుందన అధికారులు తెలిపారు. ఇక నాగ్‌పూర్‌ నుంచి ప్రస్తుతం రెండు వందేభారత్‌ రైళ్లు నడుస్తుండగా.. ఇప్పుడు నాగ్‌పూర్‌- సికింద్రాబాద్‌ రైలుతోపాటు నాగ్‌పూర్‌- పుణె రైలు కూడా సెప్టెంబర్‌ 15న ప్రారంభం కానుంది. ప్రస్తుతం అందుబాటులోకి వస్తున్న ఈ రైలు ద్వారా తెలంగాణ ప్రజలకు అందుబాటులోకి రానున్న వందే భారత్ రైళ్ల సంఖ్య నాలుగుకి చేరనుంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..