Watch: అదుపు తప్పి పాల ట్యాంకర్ బోల్తా.. బక్కెట్లు, బాటిళ్లతో నింపుకెళ్తున్న స్థానికులు..
అతి వేగంతో వస్తున్న పాల ట్యాంకర్ ఒక్కసారిగా పక్కకు తిప్పడంతో అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో చాసిస్ నుంచి ట్యాంకర్ ఊడిపోయి పాలన్నీ రోడ్డుపాలయ్యాయి. ఇది గమనించిన స్థానికులు బిందేలు, బక్కెట్లు, బాటిళ్లతో పాలు నింపుకుని తీసుకెళ్లారు. సంఘటన స్థంలో రోడ్డుపై పాలన్నీ వరదలా ప్రవహించాయి.
మిర్యాలగూడ నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న పాల ట్యాంకర్ అదుపు తప్పి బోల్తా పడింది. ఆదివారం రాత్రి పెద్దవూర మండల కేంద్రంలో జడ్చర్ల–కోదాడ జాతీయ రహదారిపై ట్యాంకర్ బోల్తా పడింది. పెద్దవూర మండల కేంద్రలో రోడ్డు విస్తరణ పనులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ప్రధాన రహదారికి ఏర్పాటు చేసిన డైవర్షన్ గమనించకపోవడంతో, అతి వేగంతో వస్తున్న పాల ట్యాంకర్ ఒక్కసారిగా పక్కకు తిప్పడంతో అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో చాసిస్ నుంచి ట్యాంకర్ ఊడిపోయి పాలన్నీ రోడ్డుపాలయ్యాయి. ఇది గమనించిన స్థానికులు బిందేలు, బక్కెట్లు, బాటిళ్లతో పాలు నింపుకుని తీసుకెళ్లారు. సంఘటన స్థంలో రోడ్డుపై పాలన్నీ వరదలా ప్రవహించాయి.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి…
వైరల్ వీడియోలు
Latest Videos