Tuesday Puja Tips: రుణ విముక్తి పొందడానికి.. మంగళవారం హనుమంతుడిని ఇలా పూజించి చూడండి

హనుమంతుని ఆశీర్వాదం కోసం మంగళవారం నాడు పూర్తి ఆచారాలతో పూజిస్తారు. అంతేకాదు అప్పుల్లో ఉన్నట్లయితే.. దాని నుండి బయటపడాలంటే.. ప్రతి మంగళవారం హనుమంతుడిని పూజించడంతో పాటు కొన్ని ప్రత్యేక చర్యలు పాటించాలి. ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ రోజు మంగళవారం .. ఈ నేపధ్యంలో ఆర్ధిక ఇబ్బందులు తీరడం కోసం హనుమంతుడికి చేయాల్సిన పరిహారాల గురించి తెలుసుకుందాం..

Tuesday Puja Tips: రుణ విముక్తి పొందడానికి.. మంగళవారం హనుమంతుడిని ఇలా పూజించి చూడండి
Lord Hanuman Puja
Follow us

|

Updated on: Sep 10, 2024 | 6:23 AM

హిందూ మతంలో మంగళవారం హనుమంతుడికి అంకితం చేయబడింది. హనుమంతుడిని హిందూమతంలో సంకట మోచనుడు అని కూడా అంటారు. హనుమంతుడిని ప్రసన్నం చేసుకుంటే తన భక్తుల అన్ని కష్టాలను తొలగిస్తాడని నమ్ముతారు. జీవితంలో ఆనందం సుఖ సంతోషాలు నెలకొంటాయి. హనుమంతుని ఆశీర్వాదం కోసం మంగళవారం నాడు పూర్తి ఆచారాలతో పూజిస్తారు. అంతేకాదు అప్పుల్లో ఉన్నట్లయితే.. దాని నుండి బయటపడాలంటే.. ప్రతి మంగళవారం హనుమంతుడిని పూజించడంతో పాటు కొన్ని ప్రత్యేక చర్యలు పాటించాలి. ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ రోజు మంగళవారం .. ఈ నేపధ్యంలో ఆర్ధిక ఇబ్బందులు తీరడం కోసం హనుమంతుడికి చేయాల్సిన పరిహారాల గురించి తెలుసుకుందాం..

మంగళవారం రోజున చేయాల్సిన పరిహారాలు

  1. రుణ విముక్తి కోసం మంగళవారం రోజున హనుమంతుని ఆలయాన్ని సందర్శించి మల్లెపూల నూనెతో దీపం వెలిగించండి. తర్వాత ఆలయంలో కూర్చుని హనుమాన్ చాలీసా పఠించండి. అంతే కాకుండా హనుమాష్టకం పఠించడం వల్ల మరింత మేలు జరుగుతుంది.
  2. ఇలా చేయడం వలన హనుమంతుడు తన భక్తుడిని సన్మార్గంలో నడిపిస్తాడని.. అతనికి వచ్చే కష్టాలన్నింటినీ తొలగిస్తాడని నమ్ముతారు.
  3. పనిలో విజయం సాధించాలనుకునే వారు తమకు నచ్చిన పని దొరకలనుకునే వారు మంగళవారం చేసే పరిహారం కూడా చాలా ఫలవంతంగా ఉంటుంది. ప్రతి మంగళవారం హనుమంతునికి దద్దోజనం నైవేద్యంగా పెట్టాలి. ఆ తర్వాత ఆ నైవేద్యాన్ని ప్రసాదంగా పంచి మీరు తీసుకోవాలి. ఇలా చేయడం వలన కోరికలు నెరవేరతాయి.
  4. మంగళవారం రోజున హనుమంతుడిని పూజించి, ‘ఓం హనుమంతే నమః’ అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. అంతేకాదు మంగళవారం రోజున ఉపవాసం ఉండటం వల్ల హనుమంతుని ప్రత్యేక ఆశీర్వాదాలు భక్తులకు లభిస్తాయి.
  5. ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: ఈ కథనంలో అందించిన సమాచారం పూర్తిగా నిజం, ఖచ్చితమైనది అని మేము ధృవీకరించడం లేదు. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోండి