AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Wetland virus: కరోనా తర్వాత చైనాలో వెలుగులోకి కొత్త వైరస్.. మెదడుపై తీవ్ర ప్రభావం చూపే వెట్‌ల్యాండ్ వైరస్ లక్షణాలు ఏమిటంటే

చైనాలో మరో కొత్త రకం వైరస్‌ మళ్ళీ వ్యాపిస్తున్నట్లు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. జంతువులలోని రక్తాన్ని పీల్చే కీటకాల ద్వారా మనుషులకు వ్యాపించే వైట్‌ల్యాండ్ (WLEV) అనే వైరస్‌ను పరిశోధకులు గుర్తించారు. ఈ వైరస్ మెదడు, నరాల సంబంధిత వ్యాధులకు కారణమవుతుందని చెప్పారు. చైనాలోని జింజౌ ప్రావిన్స్‌లో 2019లోనే బయటపడిన ఈ వైరస్‌ను వెట్‌ల్యాండ్‌ వైరస్‌ (వెల్వ్‌)గా పేర్కొంటున్నారు. 2019లో 61 ఏళ్ల జిన్‌జియాంగ్‌ అనే వృద్ధిలో తొలిసారిగా ఈ వైరస్‌ను గుర్తించారు.

Wetland virus: కరోనా తర్వాత చైనాలో వెలుగులోకి కొత్త వైరస్.. మెదడుపై తీవ్ర ప్రభావం చూపే వెట్‌ల్యాండ్ వైరస్ లక్షణాలు ఏమిటంటే
Wetland Virus
Surya Kala
|

Updated on: Sep 10, 2024 | 8:16 AM

Share

గత నాలుగేళ్ల క్రితం చైనా నుంచి వెలుగులోకి వచ్చిన కరోనా వైరస్ ప్రభావం నుంచి పూర్తిగా ఇప్పటికీ ప్రపంచం కోలుకోలేదు. ఇంకా చెప్పాలంటే చైనాలో పుట్టి యావత్ ప్రపంచాన్ని భయబ్రాంతులకు గురి చేసిన కరోనా మహమ్మారిని పూర్తిగా మరచిపోకముందే.. మళ్ళీ డ్రాగన్ కంట్రీలో కొత్త వైరస్ వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. తాజాగా ఈ కొత్త వైరస్ మెదడుపై దాడి చేస్తుందని సమాచారం. చైనాలో వెట్‌ల్యాండ్ వైరస్ (WELV) అనే కొత్త వైరస్ కనుగొనబడింది.

చైనాలో మరో కొత్త రకం వైరస్‌ మళ్ళీ వ్యాపిస్తున్నట్లు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. జంతువులలోని రక్తాన్ని పీల్చే కీటకాల ద్వారా మనుషులకు వ్యాపించే వైట్‌ల్యాండ్ (WLEV) అనే వైరస్‌ను పరిశోధకులు గుర్తించారు. ఈ వైరస్ మెదడు, నరాల సంబంధిత వ్యాధులకు కారణమవుతుందని చెప్పారు. చైనాలోని జింజౌ ప్రావిన్స్‌లో 2019లోనే బయటపడిన ఈ వైరస్‌ను వెట్‌ల్యాండ్‌ వైరస్‌ (వెల్వ్‌)గా పేర్కొంటున్నారు. 2019లో 61 ఏళ్ల జిన్‌జియాంగ్‌ అనే వృద్ధిలో తొలిసారిగా ఈ వైరస్‌ను గుర్తించారు. మంగోలియాలోని వరి పొలంలో అతను పరాన్నజీవుల కాటుతో అనారోగ్యం బారిన పడ్డాడు. అప్పుడు జిన్‌జియాంగ్‌ వెట్‌ల్యాండ్ వైరస్ సోకినట్లు గుర్తించారు. ఐదు రోజుల పాటు, అతను జ్వరం, తలనొప్పి ,వాంతులు వంటి లక్షణాలతో తీవ్ర ఇబ్బంది పడ్డాడు. శాస్త్రవేత్తలు ఈ ప్రాంతంలో మరిన్ని జీవులను పరీక్షించారు. 2 శాతం పరాన్నజీవులు WLV జన్యు పదార్ధాలను కలిగి ఉన్నాయని కనుగొన్నారు.

ఈ ప్రాంతంలోని 640 మంది అటవీ అధికారుల రక్త నమూనాలను సేకరించి విశ్లేషించగా 12 మందికి వైరస్ సోకినట్లు గుర్తించారు. చికిత్స పొందిన తర్వాత రోగులందరూ కోలుకోవడం సంతోషకరం. తల తిరగడం, తలనొప్పి, కీళ్ల నొప్పులు, అలసట వంటి లక్షణాలు సర్వసాధారణం.

ఇవి కూడా చదవండి

సుమారు 20 మంది వివిధ రకాల కీటకాలు కరవడంతో వెట్‌ల్యాండ్ వైరస్ పరీక్ష చేయగా వీరికి పాజిటివ్ గా నిర్ధారించబడిందని పరిశోధకులు తెలిపారు. WELV అనేది కొత్త వైరస్ కాదు, మళ్ళీ ఇప్పుడు వెలుగులోకి వస్తుంది.. అయినప్పటికీ, మానవులకు, జంతువులకు సోకే సామర్థ్యం కారణంగా ఈ వెట్‌ల్యాండ్ వైరస్ ఆరోగ్యానికి హానికరం. పరిశోధకుల అభిప్రాయం ప్రకారం జంతువులలో రక్త నాళాలలో నిర్మాణాత్మక మార్పులు ఈ ప్రాణాంతక సంక్రమణకు కారణమవుతాయి.

వెట్‌ల్యాండ్ వైరస్ కు చికిత్స ఉన్నప్పటికీ వైరస్ నాడీ వ్యవస్థను ప్రభావితం చేస్తుందని కనుగొనబడింది. WELV వైరస్ ఉత్తర చైనాలోని జంతువులు, మానవులలో కూడా కనుగొనబడింది. ఈ వైరస్ ప్రమాదకరమైన ఇన్ఫెక్షన్లకు కారణమవుతుందని ఎలుకలపై చేసిన ప్రయోగాల ద్వారా శాస్త్రవేత్తలు కనుగొన్నారు.

ఈ వైరస్ క్రిమియన్-కాంగో హెమరేజిక్ ఫీవర్ గ్రూపుకు చెందినది. ఇది మానవులలో తీవ్రమైన ఆరోగ్య సమస్యను కలిగిస్తుంది. ఇది కొన్ని రకాల పరాన్నజీవులలో వ్యాపిస్తుంది. ఇప్పటికే గుర్రాలు, పందులు, గొర్రెల్లో వైరస్‌ ఉన్నట్లు గుర్తించారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి