AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: కూతురి త‌ల‌పై సీసీ కెమెరా అమ‌ర్చిన తండ్రి.. ఎందుకో తెలిసా..?

ఆడపిల్లల తల్లిదండ్రులు.. తమ పిల్లల రక్షణ విషయంలో కాస్త భయం భయంగా ఉంటారు. అందుకే పిల్లలు బయట ఉంటే.. పదే, పదే ఫోన్ చేసి యోగక్షేమాలు తెలుసుకుంటూ ఉంటారు. అయితే ఇక్కడ. ఓ తండ్రి తన కూతురు తలపై ఏకంగా సీసీ కెమెరాను ఫిక్స్ చేశాడు.

Viral Video: కూతురి త‌ల‌పై సీసీ కెమెరా అమ‌ర్చిన తండ్రి.. ఎందుకో తెలిసా..?
CC Camera On Head
Ram Naramaneni
|

Updated on: Sep 09, 2024 | 11:57 AM

Share

ఇటీవల మహిళలు, చిన్నారులపై అత్యాచారాలు, లైంగిక వేధింపులు ఎక్కువైపోయాయి. వయసుతో సంబంధం లేకుడా మృగాళ్లు విరుచుకుపడుతున్నారు. ఈ క్రమంలో ఓ తండ్రి తన కుమార్తెను కంటికి రెప్పలా కాదు.. నిఘాకళ్లతో రక్షణ కల్పించాలనుకున్నాడు. ఏదైనా అనుకోని సంఘటన జరిగితే తక్షణ ఆధారాలు లభించేలా ఏర్పాటు చేశాడు. ఇంతకీ ఆ తండ్రి ఏం చేశాడో తెలుసా? తన కుమార్తె తలపై సీసీ కెమెరా అమర్చాడు. దానికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

పాకిస్థాన్‌కు చెందిన వలీద్ సాహబ్ అనే వ్యక్తి ఇలా త‌న కూతురి త‌ల‌పై సీసీ కెమెరా అమ‌ర్చి వార్తల్లో నిలిచారు. ఈ క్రమంలో సెక్యూరిటీ కెమెరా త‌ల‌పై పెట్టుకుని తిరుగుతున్న ఆ యువ‌తిని ప‌ల‌కరించ‌డంతో ఆసక్తికర విష‌యాలు వెల్లడించింది. తండ్రి తీసుకున్న నిర్ణయానికి మీరు అభ్యంతరం చెప్పలేదా? అని ఆమెను అడిగినప్పుడు.. తన తండ్రి తన కోసం ఏ నిర్ణయం తీసుకున్నా తాను అంగీకరిస్తానని చెప్పింది.తన తండ్రి తనను ఆ సెక్యూరిటీ కెమెరా ద్వారా 24 గంటలూ పర్యవేక్షిస్తున్నట్లు తెలిపింది. ఇదంతా త‌న భ‌ద్రత కోసమేన‌ని చెప్పుకొచ్చింది. తండ్రి నిర్ణయానికి గల కారణం కూడా వివరించింది. ఇటీవ‌ల క‌రాచీలో సంచ‌ల‌నం సృష్టించిన హిట్ అండ్ ర‌న్ కేసు కార‌ణంగానే త‌న తండ్రి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ యువ‌తి పేర్కొంది. ఎవ‌రైనా త‌నను యాక్సిడెంట్‌లో చంపినా క‌నీసం సాక్ష్యం ఉంటుంద‌ని చెప్పుకొచ్చింది. అందుకే ఇలా త‌ల‌పై సీసీ కెమెరాతో తిరుగుతున్నట్లు తెలిపింది. కాగా, క‌రాచీలో సంపన్న కుటుంబానికి చెందిన ఓ మహిళ తన ఎస్‌యూవీ కారుతో తండ్రి, కూతురు వెళ్తున్న ఓ వాహ‌నాన్ని ఢీకొట్టింది. దాంతో వారిద్దరూ అక్కడిక‌క్కడే చ‌నిపోయారు. గ‌త సోమవారం కరాచీలోని కర్సాజ్ రోడ్డులో ఈ ఘ‌ట‌న జ‌రిగింది.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Follow Us
ఇరాన్‌పై బాంబు దాడులు నిలిపివేత.. ట్రంప్ నిర్ణయం వెనుక అసలు కారణం
ఇరాన్‌పై బాంబు దాడులు నిలిపివేత.. ట్రంప్ నిర్ణయం వెనుక అసలు కారణం
జన్మ నక్షత్రం వల్లే పిల్లలు టాపర్లవుతారా? అసలు నిజం తెలుసుకోండి!
జన్మ నక్షత్రం వల్లే పిల్లలు టాపర్లవుతారా? అసలు నిజం తెలుసుకోండి!
వజ్రం మీకు అదృష్టమా? దురదృష్టమా? ఏ రాశుల వారికి శుభం, ఎవరు దూరంగా
వజ్రం మీకు అదృష్టమా? దురదృష్టమా? ఏ రాశుల వారికి శుభం, ఎవరు దూరంగా
ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ
ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ
ఐఆర్‌సీటీసీ కొత్త వెబ్‌సైట్ ప్రారంభం.. ముహూర్తం ఫిక్స్
ఐఆర్‌సీటీసీ కొత్త వెబ్‌సైట్ ప్రారంభం.. ముహూర్తం ఫిక్స్
ఎరుపెక్కిన మిడిలీస్ట్.. సామాన్యుడిపై మళ్లీ యుద్ధ పంజా!
ఎరుపెక్కిన మిడిలీస్ట్.. సామాన్యుడిపై మళ్లీ యుద్ధ పంజా!
రేపే శుక్ర ప్రదోష వ్రతం.. ఈ 6 పొరపాట్లు చేస్తే శివుని అనుగ్రహం..
రేపే శుక్ర ప్రదోష వ్రతం.. ఈ 6 పొరపాట్లు చేస్తే శివుని అనుగ్రహం..
పట్టీలు,గొలుసులు నల్లగా మారాయా? ఇలా క్షణాల్లో కత్తగా మార్చండి
పట్టీలు,గొలుసులు నల్లగా మారాయా? ఇలా క్షణాల్లో కత్తగా మార్చండి
జూన్ నుంచి అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనలు ఇవే..
జూన్ నుంచి అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనలు ఇవే..
నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు