Pakisthan: ఇలాంటి చిత్ర విచిత్రాలను పాక్‌లోనే చూస్తాం.. ఆ దేశ ఆర్మీకి వ్యతిరేకంగా పోలీసులు నిరసన.. సైనికులపై దాడి..

నిరసన ప్రదర్శనలో పోలీసులు సైన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమ ప్రాంతం నుంచి సైన్యాన్ని తొలగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జిల్లాలో పెరుగుతున్న ఉగ్రవాద ఘటనలకు సైన్యమే కారణమని పోలీసులు చెబుతున్నారు. ఇక్కడి నుంచి సైన్యాన్ని వెనక్కి రప్పించి.. ఉగ్రవాదంపై ఆపరేషన్‌ పూర్తి బాధ్యత తమకు అప్పగిస్తే మూడు నెలల్లో ఉగ్రవాదులను అంతమొందిస్తామని పోలీసులు చెబుతున్నారు.

Pakisthan: ఇలాంటి చిత్ర విచిత్రాలను పాక్‌లోనే చూస్తాం.. ఆ దేశ ఆర్మీకి వ్యతిరేకంగా పోలీసులు నిరసన.. సైనికులపై దాడి..
Pakistan Police Protest
Follow us

|

Updated on: Sep 10, 2024 | 1:05 PM

పాకిస్తాన్‌లోని ఖైబర్ పఖ్తున్‌ఖ్వా ప్రావిన్స్‌లో పెరుగుతున్న ఉగ్రవాద సంఘటనలు, పోలీసు అధికారులను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు సృష్టిస్తోన్న మరణ హోమాన్ని నిరసిస్తూ లక్కీ మార్వాట్ జిల్లా పోలీసులు నిరసన తెలిపారు. ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే.. లక్కీ మార్వాట్ జిల్లాలో నెలకొన్న అభద్రతాభావానికి పాకిస్థాన్ సైన్యమే కారణమంటూ పాక్ సైన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పాకిస్థాన్ ఆర్మీకి వ్యతిరేకంగా పోలీసులు ప్రదర్శన చేయడం.. తమ ప్రాంతంలో అశాంతికి కారణమని ఆరోపించడం ఇదే తొలిసారి.

వాస్తవానికి లక్కీ మార్వాట్ జిల్లాలో గత నెల నుండి తీవ్రవాద సంఘటనలు పెరిగాయి. గత వారం ఐదుగురు పోలీసు అధికారులు ఉగ్రవాదుల కాల్పుల్లో మరణించారు. దీంతో పోలీసుల్లో ఆగ్రహం పెల్లుబికింది. ప్రభుత్వం నుంచి తమకు భద్రత కావాలని కోరుతున్నారు.

ఇవి కూడా చదవండి

సైన్యం ఉపసంహరించుకున్న మూడు నెలల్లోనే ఉగ్రవాదాన్ని అంతం చేస్తామన్న పోలీసులు

ఈ నిరసన ప్రదర్శనలో పోలీసులు సైన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమ ప్రాంతం నుంచి సైన్యాన్ని తొలగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జిల్లాలో పెరుగుతున్న ఉగ్రవాద ఘటనలకు సైన్యమే కారణమని పోలీసులు చెబుతున్నారు. ఇక్కడి నుంచి సైన్యాన్ని వెనక్కి రప్పించి.. ఉగ్రవాదంపై ఆపరేషన్‌ పూర్తి బాధ్యత తమకు అప్పగిస్తే మూడు నెలల్లో ఉగ్రవాదులను అంతమొందిస్తామని పోలీసులు చెబుతున్నారు.

పోలీసులు నిరసన తెలుపుతూ పెషావర్-కరాచీ సింధు రహదారిని అడ్డుకున్నారు. అధికారులకు వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు. అంతేకాదు పోలీసులు తమ విధుల్లోకి తిరిగి వెళ్ళడానికి నిరాకరించారు. ఈ నేపధ్యంలో అధికారులతో మాట్లాడటానికి 6 మంది సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేశారు.

ఖైబర్ పఖ్తున్ఖ్వాలో అధ్వాన్నమైన పరిస్థితులు

గత కొన్ని నెలలుగా ఖైబర్ పఖ్తుంఖ్వాలో పోలీసులపై దాడులు పెరిగాయి. ఇటీవల కాలంలో కొందరు ఉగ్రవాదులు మెరుపుదాడి చేసి కాల్పులు జరిపి ఐదుగురు పోలీసు అధికారులను హతమార్చారు. ఆ తర్వాత ఆఫ్ఘనిస్థాన్ నుంచి చొరబడిన ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు పోలీసులు మరణించారు. సరిహద్దులో భద్రతను నిర్ధారించాలని.. పాకిస్తాన్‌పై ఉగ్రవాద చర్యలకు ఆఫ్ఘన్ మట్టిని ఉపయోగించడాన్ని నిలిపివేయాలని పాకిస్తాన్ నిరంతరం తాలిబాన్ ప్రభుత్వాన్ని కోరుతోంది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..