AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టైఫూన్ యాగీ విధ్వంసం! అకస్మాత్తుగా విరిగిన వంతెన.. నదిలో పడిన ట్రక్కులతో సహా అనేక వాహనాలు.. వీడియో వైరల్

ఫు థో ప్రావిన్స్‌లోని ఎర్ర నదిపై నిర్మించిన ఈ ఉక్కు వంతెన సోమవారం ఉదయం కూలిపోయింది. ఈ ఘటనలో 10 కార్లు, రెండు ద్విచక్రవాహనాలు, ఒక ట్రక్కు నదిలో పడిపోయాయి. ఈ విపత్తు కారణంగా ఇప్పటివరకు 60 మందికి పైగా మరణించారు. 13 మంది తప్పిపోయినట్లు అధికారులు చెప్పారు.

టైఫూన్ యాగీ విధ్వంసం! అకస్మాత్తుగా విరిగిన వంతెన.. నదిలో పడిన ట్రక్కులతో సహా అనేక వాహనాలు.. వీడియో వైరల్
Typhoon Yagi
Surya Kala
|

Updated on: Sep 10, 2024 | 1:19 PM

Share

సూపర్ టైఫూన్ యాగీ వియత్నాంలో భారీ విధ్వంసం సృష్టించింది. ముఖ్యంగా దాని ప్రభావం దేశంలోని ఉత్తర ప్రాంతాల్లో కనిపించింది. తుఫాను కారణంగా ఫు థో ప్రావిన్స్, ఫోంగ్ చౌలో ఒక ముఖ్యమైన వంతెన కూలిపోయింది. ఈ సమయంలో ముందుకు వెళ్తున్న పలు వాహనాలు నదిలో పడిపోవడంతో పాటు ఓ ట్రక్కు కూడా అందులో ఇరుక్కుపోయింది. వంతెన కూలిన వీడియో కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో కారు డాష్‌క్యామ్‌లో రికార్డ్ చేయబడింది.

మీడియా నివేదికల ప్రకారం ఫు థో ప్రావిన్స్‌లోని ఎర్ర నదిపై నిర్మించిన ఈ ఉక్కు వంతెన సోమవారం ఉదయం కూలిపోయింది. ఈ ఘటనలో 10 కార్లు, రెండు ద్విచక్రవాహనాలు, ఒక ట్రక్కు నదిలో పడిపోయాయి. ఈ విపత్తు కారణంగా ఇప్పటివరకు 60 మందికి పైగా మరణించారు. 13 మంది తప్పిపోయినట్లు అధికారులు చెప్పారు.

ఇవి కూడా చదవండి

వంతెన కూలి నదిలో పడిపోయిన ట్రక్కు

తుఫాను వియత్నాంలోని వివిధ ప్రాంతాల్లో భారీ నష్టాన్ని కలిగించింది. 1.5 మిలియన్ల మంది ప్రజల జన జీవనం అస్తవ్యస్తంగా మారింది. అనేక ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అదే సమయంలో వేలాది హెక్టార్లలో పంటలు నాశనమయింది. భారీ సంఖ్యలో పక్షులు నేలకొరిగాయి. చెట్లు కూడా దెబ్బతిన్నాయి. అంతేకాదు వంతెన కూలిపోవడం, కొండచరియలు విరిగిపడటం వంటి వేర్వేరు సంఘటనలలో 247 మంది గాయపడ్డారు.

చైనా సముద్రంలో ఉద్భవించింది టైఫూన్ యాగీ. 30 ఏళ్లలో వియత్నాంను తాకిన అత్యంత శక్తివంతమైన తుఫాను ఇదేనని భావిస్తున్నారు. జపాన్ వాతావరణ శాఖ ఈ తుఫానుకు ‘యాగీ’ అని పేరు పెట్టింది. జపనీస్ భాషలో యాగీ అంటే మేక లేదా మొసలి.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..