AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏ పనినైనా ప్రారంభించే ముందు గణేశుడిని ఎందుకు పూజిస్తారు? పురాణాల కథ ఏమిటంటే

పురాణాల ప్రకారం గణేశుడికి మొదట పూజ చేస్తారు. అయితే ఇలా మొదటి పూజ ఎవరికీ చేయాలనీ అనే విషయంలో దేవతలు అందరూ తమలో తాము పోట్లాడుకున్నారు. దేవతలు ఇలా తమలో తాము పోట్లాడుకోవడం చూసి నారదుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు. ఈ ప్రశ్నకు పరిష్కారం కోసం దేవతలందరూ కలిసి శివుని వద్దకు వెళ్లమని సలహా ఇచ్చాడు. దీని తరువాత దేవతలందరూ శివుని వద్దకు వెళ్లి అతని ముందు తమ సమస్యని వెల్లడించారు.

ఏ పనినైనా ప్రారంభించే ముందు గణేశుడిని ఎందుకు పూజిస్తారు? పురాణాల కథ ఏమిటంటే
Lord Ganesha Puja
Surya Kala
|

Updated on: Sep 10, 2024 | 12:15 PM

Share

హిందూ మతంలో గణేశుడికి మొదటి పూజను చేస్తారు. ఆయనను ఆరాధించడం వల్ల అన్ని కష్టాలు తొలగిపోతాయి. గణేశుడు జన్మ దినోత్సవాన్ని గణేష్ చతుర్థి గా జరుపుకుంటారు. దేశవ్యాప్తంగా గణేశుడిని పూజిస్తారు. పది రోజుల పాటు ఈ పండుగను గొప్ప వైభవంగా జరుపుకుంటారు. అయితే గణేశుడు హిందూ మతంలో పూజలు, ఫంక్షన్లు, పండగలలో మొదటి పూజను అందుకునే దేవుడు. ఏదైనా పని ప్రారంభించే ముందు గణపతి పూజను చేసి అనంతరం ఆ కార్యక్రమాలును జరుపుకుంటారు. హిందూ మతంలో గణపతి అదృష్టానికి చిహ్నం. హిందువులు మొదటి పూజను గణపటికే ఎందుకు చేస్తారో తెలుసా..

వినాయకుడిని ముందుగా ఎందుకు పూజిస్తారు?

పురాణాల ప్రకారం గణేశుడికి మొదట పూజ చేస్తారు. అయితే ఇలా మొదటి పూజ ఎవరికీ చేయాలనీ అనే విషయంలో దేవతలు అందరూ తమలో తాము పోట్లాడుకున్నారు. దేవతలు ఇలా తమలో తాము పోట్లాడుకోవడం చూసి నారదుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు. ఈ ప్రశ్నకు పరిష్కారం కోసం దేవతలందరూ కలిసి శివుని వద్దకు వెళ్లమని సలహా ఇచ్చాడు. దీని తరువాత దేవతలందరూ శివుని వద్దకు వెళ్లి అతని ముందు తమ సమస్యని వెల్లడించారు. చాలా ఆలోచించిన తర్వాత శివుడు అందరికి కలిపి ఒక పోటీ పెట్టాడు. ఈ పోటీలో ఎవరు గెలిస్తే వారు మొదటి పూజలను అందుకుంటారని శివయ్య చెప్పాడు.

ఇవి కూడా చదవండి

పోటీ ఏమిటి ? ఎవరు గెలిచారు?

దేవతామూర్తులందరూ తమ తమ వాహనాల్లో విశ్వమంతా ప్రదక్షిణలు చేయాల్సి ఉంటుందని శివుడు చెప్పాడు. విశ్వమంతా ప్రదక్షిణ చేసిన తర్వాత ఎవరు ముందుగా తిరిగి వస్తారో వారు ముందుగా పూజించబడతారు. దీని తర్వాత దేవతామూర్తులందరూ తమ తమ వాహనాలను తీసుకుని విశ్వ యాత్రకు బయలుదేరారు. అయితే ఈ సమయంలో అక్కడ ఉన్న గణపతి మాత్రం ఆలోచనలో పడ్డాడు. ఎందుకంటే గణేశుడి వాహనం ఎలుక. ఎలుక చాలా చిన్నది. అంతే కాదు గణపతి కూడా నెమ్మదిగా నడుస్తాడు. అటువంటి పరిస్థితిలో గణపతి తన ఎలుక వాహనం మీద విశ్వమంతా ఎలా ప్రదక్షిణ చేయాలని అనుకున్నాడు. ఇది దాదాపు అసాధ్యమని భావించాడు కూడా..

హిందూ మతంలో మొదటి పూజ్యుడు ఎవరంటే

ఇలా ఆలోచిస్తున్న గణేశుడి మదిలో ఒక ఉపాయం తోచింది. అతను తన తల్లిదండ్రులైన శివ పార్వతులకు 7 సార్లు ప్రదక్షిణలు చేసి.. వచ్చి వారి ముందు నిలబడ్డాడు. తరువాత కార్తికేయుడు సహా దేవతలు అందరూ విశ్వానికి ప్రదక్షిణ చేసి తిరిగి వచ్చేసరికి, అప్పటికే అక్కడ గణేశుడు ఉన్నాడు. అక్కడ గణేష్‌ని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. గణేశుడు ఎలుకపై ఎక్కి ఇంత త్వరగా విశ్వమంతా ఎలా ప్రయాణించగలిగాడు అని అందరూ ఆశ్చర్యపోయారు. అప్పుడు శివుడు గణేశుడిని విజేతగా ప్రకటించాడు. ఏ పిల్లలకైనా తల్లిదండ్రులను ఈ ప్రపంచంలో మొదటి పుజ్యనీయులని.. ఎవరి హోదా అయినా సరే తల్లిదండ్రుల తర్వాతే అని చెప్పాడు. అటువంటి పరిస్థితిలో తల్లిదండ్రుల చుట్టూ తిరగడం అంటే వాస్తవానికి విశ్వం చుట్టూ తిరుగుతున్నట్లే కనుక గణపతి ఈ పోటీలో విజేత. మొదటి పూజను అందుకునే అర్హత గజాననుడికే ఉంది అని చెప్పాడు. అప్పటి నుండి గణపతి పేరు పూజ ఏదైనా దేవుడి పూజ లోనైనా ముందు వస్తుంది. ఆది పూజ్యుడు, విఘ్నాలకధిపతి గణపతిని పుజించడం మొదలు పెట్టారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: ఈ కథనంలో అందించిన సమాచారం పూర్తిగా నిజం, ఖచ్చితమైనది అని మేము ధృవీకరించడం లేదు. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోండి