Tirumala: తిరుమలలో తిరిగి మొదలైన తిలక ధారణ కార్యక్రమం.. భక్తులకు శ్రీవారి సేవకులు తిరునామ సేవ
శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం గుడ్‌న్యూస్ చెప్పింది. కరోనా కారణంగా గత నాలుగు సంవత్సరాలుగా నిలిచిపోయిన తిలక ధారణ కార్యక్రమాన్ని టీటీడీ పునఃప్రారంభించింది. టీటీడీ ఈవో శ్యామలరావు శ్రీవారి భక్తులకు తిలక ధారణను ప్రారంభించారు. కరోనా కారణంగా గతంలో తిలక ధారణ కార్యక్రమాన్ని నిలిపేసిన టీటీడీ.. నాలుగేళ్ల తర్వాత తిరిగి ప్రారంభించింది. తిరుమలలోని సుపథం, వరహస్వామి ఆలయం, కళ్యాణకట్ట, ఏటీసీ, విక్యూసీ 1, 2 వద్ద శ్రీవారి సేవకులు.. భక్తులకు నిరంతరాయంగా తిలక ధారణ చేస్తారని టీటీడీ ఈవో తెలిపారు.