- Telugu News Photo Gallery Spiritual photos Sun and ketu graha yuti in kanya rashi these zodiac signs earnings to improve details in telugu
Astrology: కన్యా రాశిలో రెండు కీలక గ్రహాల యుతి.. ఆ రాశుల వారికి ఆదాయం, ఆస్తులు పెరిగే ఛాన్స్..!
ఈ నెల 16 నుంచి నెల రోజులు పాటు రవి కేతువులు కన్యా రాశిలో కలిసి ఉండడం జరుగు తుంది. సాధారణంగా ఈ రెండు గ్రహాలు కలిసినప్పుడు, తాపత్రయాలు, ఆరాటాలు వృద్ధి చెందుతాయి. అనుకున్నది సాధించే వరకూ నిద్ర పట్టదు. ఈ రెండు గ్రహాల యుతి కన్యా రాశిలో జరుగుతున్నందువల్ల ప్రయత్నాలు, పట్టుదలలు మరీ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.
Updated on: Sep 09, 2024 | 7:32 PM

ఈ నెల 16 నుంచి నెల రోజులు పాటు రవి కేతువులు కన్యా రాశిలో కలిసి ఉండడం జరుగు తుంది. సాధారణంగా ఈ రెండు గ్రహాలు కలిసినప్పుడు, తాపత్రయాలు, ఆరాటాలు వృద్ధి చెందుతాయి. అనుకున్నది సాధించే వరకూ నిద్ర పట్టదు. ఈ రెండు గ్రహాల యుతి కన్యా రాశిలో జరుగుతున్నందువల్ల ప్రయత్నాలు, పట్టుదలలు మరీ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా సంపాదన మీద, ఆదాయాన్ని పెంచుకోవడం మీద, ఆస్తిపాస్తుల్ని కూడగట్టుకోవడం మీద శ్రద్ద బాగా పెరుగుతుంది. మేషం, వృషభం, కర్కాటకం, వృశ్చికం, ధనుస్సు, మకర రాశివారిలో ఈ పట్టుదల, తాపత్రయం స్పష్టంగా కనిపిస్తాయి. ఈ రెండు గ్రహాలకు కన్యారాశి మిత్రక్షేత్రమే అయినందువల్ల ఈ రాశుల వారు అనుకున్నది సాధిస్తారు.

మేషం: ఈ రాశికి ఆరవ స్థానంలో రవి, కేతువులు కలుసుకోవడం వల్ల సరికొత్త జీవితం కోసం వీరిలో ఆరాటం పెరుగుతుంది. ఉద్యోగంలో జీతాలు పెరిగే అవకాశాలున్నప్పటికీ, అదనపు ఆదాయం మీద కూడా శ్రద్ద పెడతారు. ఆస్తిపాస్తులకు సంబంధించిన వ్యవహారాలను, వివాదాలను త్వరగా పరిష్కరించుకునేందుకు గట్టి ప్రయత్నం చేస్తారు. వృత్తి, వ్యాపారాలను కొన్ని మార్పులతో నష్టాల నుంచి బయటపడేయడం జరుగుతుంది. రావలసిన సొమ్మును, బాకీలను పట్టుదలగా రాబట్టుకుంటారు.

వృషభం: ఈ రాశికి పంచమ స్థానంలో రవి, కేతులు కలవడం వల్ల ప్రతి విషయంలోనూ మొండి పట్టుదలతో వ్యవహరించే అవకాశం ఉంటుంది. ఉద్యోగంలో జీతభత్యాలు బాగా పెరిగే అవకాశం ఉంది. ప్రతి ఆదాయ ప్రయత్నాన్నీ పట్టుదలగా సాధించుకోవడం జరుగుతుంది. విదేశీ ప్రయాణాలకు అవ కాశం ఉంది. ప్రయాణాల వల్ల ఆశించిన లాభాలు పొందుతారు. సొంత ఇంటి కలను, వాహనం కోరి కను నెరవేర్చుకుంటారు. ఆశించిన కంపెనీలో కోరుకున్న ఉద్యోగం సంపాదించుకునే అవకాశం ఉంది.

కర్కాటకం: ఈ రాశివారికి ‘వృద్ధి’ స్థానమైన తృతీయంలో రవి కేతువులు యుతి చెందడం వల్ల ఏ ప్రయత్నం తలపెట్టినా విజయం సాదించే అవకాశం ఉంది. ఆస్తి వ్యవహారాల్లో రాజీలేని ధోరణిని అనుసరి స్తారు. కొద్ది ప్రయత్నంతో ఊహించని ఆర్థిక లాభాలు పొందుతారు. ఉద్యోగులకు పదోన్నతులు, ఇంక్రిమెంట్లు లభించే అవకాశం ఉంది. ఉద్యోగంలో సహోద్యోగులను దాటిపోయే అవకాశం కూడా ఉంది. వృత్తి, వ్యాపారాల్లో శ్రమాధిక్యత ఉన్నప్పటికీ, అపారమైన ప్రయోజనాలు పొందడం జరుగుతుంది.

వృశ్చికం: ఈ రాశివారికి విపరీతంగా అదృష్టం పడుతుంది. పెండింగ్ పనులను, వ్యవహారాలను పట్టుదలగా పూర్తి చేసి, ఆర్థికంగా కూడా లాభాలు పొందుతారు. అనేక విధాలుగా ఆర్థికంగా పురోగతి సాధి స్తారు. ప్రణాళిక ప్రకారం ఆర్థిక సమస్యల నుంచి చాలావరకు బయటపడతారు. వృత్తి, వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతాయి. నిరుద్యోగులు ఆశించిన ఉద్యోగాన్ని సంపాదించుకుంటారు. అవివా హితులు తమకు నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకునే అవకాశం ఉంది. ఆరోగ్యం బాగా కుదుటపడుతుంది.

ధనుస్సు: పట్టుదలకు మారుపేరైన ఈ రాశివారికి దశమ స్థానంలో సూర్య కేతువుల కలుస్తున్నందువల్ల వీరు ఏ ఆదాయ అవకాశాన్నీ వదిలిపెట్టడం జరగదు. ఏ ప్రయత్నం తలపెట్టినా లాభం పొందు తారు. ప్రయాణాల ద్వారా కూడా లాభాలు సంపాదిస్తారు. ఎటువంటి ఇబ్బందులు, ఆటంకాలనైనా అధిగమిస్తారు. ఉద్యోగంలో వేతనాలతో పాటు అదనపు సంపాదన కూడా పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు నష్టాల నుంచి బయటపడి లాభాల బాటపడతాయి. ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది.

మకరం: ఈ రాశివారికి భాగ్య స్థానంలో రవి కేతువుల యుతి చోటు చేసుకుంటున్నందువల్ల ఆర్థికంగా అదృష్టాలు పట్టే అవకాశం ఉంది. అప్రయత్న ధన లాభం కూడా ఉంటుంది. ఏ ప్రయత్నం చేపట్టినా కలిసి వస్తుంది. విదేశీ సొమ్మును అనుభవించే యోగం ఉంది. ఉద్యోగులు, నిరుద్యోగులు కొద్ది ప్రయత్నంతో విదేశాల్లో ఉద్యోగాలు సంపాదించుకుంటారు. ఆస్తి వ్యవహారాల్ని రాజీ మార్గంలో పరిష్కరించుకుంటారు. ఉద్యోగంలో వేతనాలు, వృత్తి, వ్యాపారాల్లో లాభాలు పెరిగే సూచనలున్నాయి.



