- Telugu News Photo Gallery Spiritual photos Vinayaka Chavithi 2024: 121 KG Silver Ganesh Pratishthapana in Hubballi, karnataka
Vinayaka Chavithi: హుబ్లీలో కొలువు దీరిన వెండి విగ్రహాలు.. ఆకట్టుకున్న121 కేజీల వెండి గణపతి విగ్రహం..
దేశవ్యాప్తంగా వినాయక ఉత్సవాల సందడి నెలకొంది. డిల్లీ నుంచి గల్లీ వరకూ వీధి వీధిన గణపతి మండపాలు.. అందులో కొలువుదీరిన బొజ్జ గణపయ్యలు భక్తులతో విశేష పూజలందుకుంటున్నారు. మట్టి వినాయక విగ్రహాలతో పాటు రకరకాలుగా అలంకరించుకున్న అందమైన, విభిన్న రూపాల్లో గణపతి విగ్రహాలు కొలువుదీరారు. ఈ మండపాలను అందులో కొలువుదీరిన వినాయకుడి దర్శించుకునేందుకు భారీగా భక్తులు చూసేందుకు ప్రజలు కూడా భారీగా తరలివస్తున్నారు.
Updated on: Sep 11, 2024 | 10:14 AM

వినాయక చవితి వచ్చిందంటే చాలు చాలా మంది ఇంట్లో వెండి వినాయక విగ్రహాలను తీసి పూజలో పెడతారు. వినాయక చవితి ఉత్సవాలకు పూజ చేసిన తర్వాత తిరిగి ఆ వినాయక విగ్రహాలను జాగ్రత్త చేస్తారు. అయితే మండపాలలో ఏర్పాటు చేసే విగ్రహం పూర్తిగా వెండి తో తయారు చేసి మండపంలో ప్రతిష్టించి పూజ చేస్తున్నారు.

ఉత్తర కర్ణాటకలో కూడా వినాయక చవితి ఉత్సవాలకు చాలా ప్రసిద్ధి చెందాయి. ఇక్కడ కొలువై ఉన్న వినాయకుడిని చూసేందుకు ఇతర ప్రాంతాల నుంచి కూడా ప్రజలు వస్తుంటారు. ఇక్కడ మండపాలలో గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మండపాలలో ప్రదర్శించే పౌరాణిక, సాంఘిక నాటకాలను చూసేందుకు భారీగా ప్రజలు వస్తుంటారు.

హుబ్లీలో గణేశోత్సవాల సందర్భంగా మూడు చోట్ల వెండి గణేశుడిని ప్రత్యేకంగా ప్రతిష్ఠించారు. హుబ్లీ నడిబొడ్డున ఉన్న సరఫగట్టి, శీలవంతర ఓణి, షింపిగల్లిలో వెండి గణేశ విగ్రహాలను ప్రతిష్టించారు.

హుబ్లీలో సరఫగట్టిలో గణేష్ ఉత్సవాల సందర్భంగా గత 65 ఏళ్లుగా వినాయకుడిని ప్రతిష్ఠిస్తున్నారు. గత 14 సంవత్సరాలుగా ఇక్కడ వెండి వినాయకుడిని ప్రతిష్టిస్తున్నారు. మూషిక సహిత 121 కిలోల వెండి గణపతిని ప్రతిష్టించారు. ఇక్కడ నటీనటులు చేసిన నాటకం ప్రేక్షకాధరణ సొంతం చేసుకుంది.

శ్రీ వరసిద్ది వినాయక మందిరంలో గత 44 సంవత్సరాలుగా శీలవంతర ఓణిలో వినాయకుడు కొలువై ఉన్నాడు. ఇక్కడ గత 24 ఏళ్లుగా వెండి వినాయకుడిని ప్రతిష్ఠిస్తున్నారు. ప్రభావలితో సహా మొత్తం 50 కిలోల వినాయకుడిని ప్రతిష్ఠించారు. వినాయకుడిని 1.25 కిలోల బంగారు ఆభరణాలతో అలంకరించారు. శ్రీ వరసిద్ది వినాయక మండపాన్ని ఏర్పాటు చేశారు.

షింపిగల్లిలో గత 60 ఏళ్లుగా శ్రీ మారుతి యువక సేవా సంఘం ఆధ్వర్యంలో వెండి వినాయకుడు కొలువై ఉన్నాడు. ఇక్కడ గత 18 ఏళ్లుగా 51 కిలోల వెండి వినాయకుడిని ప్రతిష్ఠిస్తున్నారు. ఈసారి శబరిమల అయ్యప్ప స్వామి ప్రదర్శన ఉంటుంది.




