Bank Rules Change: వినియోగదారులకు అలర్ట్.. అక్టోబర్ 1 నుంచి ఈ స్కీమ్స్‌లో నిబంధనలు మార్పు!
అక్టోబర్ 1 నుండి పోస్ట్ ఆఫీస్ సేవింగ్ స్కీమ్ కొత్త నియమాలు మారబోతున్నాయి. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్)లో భారీ మార్పులు జరగనున్నాయి. అక్టోబర్ 1 నుంచి పీపీఎఫ్‌కు సంబంధించిన మూడు ప్రధాన నిబంధనలు మారనున్నాయి. ఈ మేరకు ఆర్థిక మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. పోస్టాఫీసుల ద్వారా తెరిచే పబ్లిక్ ప్రావిడెంట్ ఖాతాలకు..
అక్టోబర్ 1 నుండి పోస్ట్ ఆఫీస్ సేవింగ్ స్కీమ్ కొత్త నియమాలు మారబోతున్నాయి. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్)లో భారీ మార్పులు జరగనున్నాయి. అక్టోబర్ 1 నుంచి పీపీఎఫ్‌కు సంబంధించిన మూడు ప్రధాన నిబంధనలు మారనున్నాయి. ఈ మేరకు ఆర్థిక మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. పోస్టాఫీసుల ద్వారా తెరిచే పబ్లిక్ ప్రావిడెంట్ ఖాతాలకు సంబంధించి ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆర్థిక వ్యవహారాల విభాగం ఉత్తర్వులు జారీ చేసింది. పీపీఎఫ్ అనేది ఒక ప్రసిద్ధ పొదుపు పథకం. ఇది దీర్ఘకాలంలో మంచి రాబడిని ఇస్తుంది. దీని మెచ్యూరిటీ 15 సంవత్సరాలతో వస్తుంది.
అక్టోబర్ 1 నుండి ఏం మార్పు జరగనుంది?
పీపీఎఫ్ కొత్త నిబంధనల ప్రకారం, మూడు మార్పులు జరగనున్నాయి. ఇందులో మైనర్‌ల పేరిట తెరిచిన పీపీఎఫ్ ఖాతాలు, ఒకటి కంటే ఎక్కువ పీపీఎఫ్ ఖాతాలు, పోస్టాఫీసుల ద్వారా జాతీయ పొదుపు పథకాల కింద ఏఆర్‌ఐ, పీపీఎఫ్ ఖాతాల పొడిగింపు నియమాలు మారుతాయి. కొత్త నిబంధన ప్రకారం, మైనర్లకు 18 ఏళ్లు నిండే వరకు మైనర్‌ల పేరిట తెరిచిన పీపీఎఫ్ ఖాతాలపై వడ్డీ చెల్లిస్తూనే ఉంటుంది. అంటే పీపీఎఫ్ వడ్డీ రేటు 18 సంవత్సరాలు నిండిన తర్వాత చెల్లిస్తుంది. మైనర్ పెద్దవాడైన తేదీ నుండి మెచ్యూరిటీ వ్యవధి లెక్కిస్తారు.
ఇది కూడా చదవండి: Richest Village: ఇది ఆసియాలోనే అత్యంత సంపన్న గ్రామం.. ఇక్కడ 17 బ్యాంకులు, రూ.7 వేల కోట్ల డిపాజిట్లు.. మన దేశంలోనే..
ఒకటి కంటే ఎక్కువ పీపీఎఫ్ అకౌంట్లు
ఒకటి కంటే ఎక్కువ పీపీఎఫ్ ఖాతాలను కలిగి ఉన్న సందర్భంలో కూడా పెట్టుబడిదారుడు అతని ప్రాథమిక ఖాతాలో పథకం రేటు ప్రకారం వడ్డీని పొందుతారు. అయితే డిపాజిట్ మొత్తం వార్షిక సీలింగ్ పరిమితిని మించకూడదు. రెండవ ఖాతాలో బ్యాలెన్స్ ఉంటే, అది ప్రాథమిక ఖాతాతో లింక్ చేయబడుతుంది. అయితే, రెండు ఖాతాల మొత్తం వార్షిక పెట్టుబడి పరిమితిలోపు ఉండాలనే షరతు కూడా ఉంటుంది. రెండింటినీ లింక్ చేసిన తర్వాత ప్రస్తుత స్కీమ్ వడ్డీ రేటు ప్రాథమిక ఖాతాకు వర్తిస్తుంది. అదే సమయంలో రెండవ ఖాతాలోని ఏదైనా మిగులు నిధి సున్నా శాతం వడ్డీ రేటుతో తిరిగి చెల్లిస్తారు.
1968 పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ పథకం కింద ప్రారంభించిన NRI PPF ఖాతాలకు వర్తిస్తుంది. ఇక్కడ ఫారమ్ H ఖాతాదారుని నివాస స్థితిని ప్రత్యేకంగా అడగదు. ఈ ఖాతాలపై వడ్డీ రేటు సెప్టెంబర్ 30, 2024 వరకు POSA మార్గదర్శకాల ప్రకారం ఉంటుంది.
ఇది కూడా చదవండి: Gold Price Today: భారీగా తగ్గుతున్న బంగారం ధరలు.. తులం ధర ఎంతో తెలిస్తే..
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి