Airtel: ఎయిర్‌టెల్‌ వినియోగదారులకు Amazon Prime సబ్‌స్క్రిప్షన్ ఉచితం.. ఎలాగంటే..

మీరు భారతీ ఎయిర్‌టెల్ సిమ్‌ని ఉపయోగిస్తే మీరు అనేక OTT సేవల సభ్యత్వాన్ని పూర్తిగా ఉచితంగా పొందవచ్చు. కంపెనీ అటువంటి అనేక ప్లాన్‌లను అందిస్తోంది. వీటితో రీఛార్జ్‌పై అదనపు చెల్లించకుండా OTT కంటెంట్‌ను చూడవచ్చు. అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ అందుబాటులో ఉన్న ప్లాన్‌ల గురించి తెలుసుకుందాం. ఈ ప్లాన్‌లలో రోజువారీ డేటా కూడా చాలా..

Airtel: ఎయిర్‌టెల్‌ వినియోగదారులకు Amazon Prime సబ్‌స్క్రిప్షన్ ఉచితం.. ఎలాగంటే..
Airtel
Follow us

|

Updated on: Sep 10, 2024 | 11:32 AM

మీరు భారతీ ఎయిర్‌టెల్ సిమ్‌ని ఉపయోగిస్తే మీరు అనేక OTT సేవల సభ్యత్వాన్ని పూర్తిగా ఉచితంగా పొందవచ్చు. కంపెనీ అటువంటి అనేక ప్లాన్‌లను అందిస్తోంది. వీటితో రీఛార్జ్‌పై అదనపు చెల్లించకుండా OTT కంటెంట్‌ను చూడవచ్చు. అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ అందుబాటులో ఉన్న ప్లాన్‌ల గురించి తెలుసుకుందాం. ఈ ప్లాన్‌లలో రోజువారీ డేటా కూడా చాలా అందుకుంటారు.

కాలింగ్, డేటా వంటి అవసరాలకు మీరు రీఛార్జ్ చేసుకోవాలి. అటువంటి పరిస్థితిలో OTT సర్వీస్ సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా అందిస్తున్న ప్లాన్‌లతో మీరు రీఛార్జ్ చేసుకుంటే మంచిది. ఇది కాకుండా, అర్హులైన సబ్‌స్క్రైబర్‌లకు ఈ ప్లాన్‌లతో రీఛార్జ్ చేసుకుంటే అపరిమిత డేటా ప్రయోజనం లబిస్తుంది. దీని కోసం ఎయిర్‌టెల్ 5G సేవలు వారి ప్రాంతంలో అందుబాటులో ఉండాలి. వినియోగదారులు తప్పనిసరిగా 5G స్మార్ట్‌ఫోన్‌ను కలిగి ఉండాలి.

ఇది కూడా చదవండి: Richest Village: ఇది ఆసియాలోనే అత్యంత సంపన్న గ్రామం.. ఇక్కడ 17 బ్యాంకులు, రూ.7 వేల కోట్ల డిపాజిట్లు.. మన దేశంలోనే..

ఇవి కూడా చదవండి

ఎయిర్‌టెల్ రూ. 838 ప్లాన్:

ఎయిర్‌టెల్ సబ్‌స్క్రైబర్‌లు రూ. 838 ప్రీపెయిడ్ ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకుంటే 56 రోజుల వాలిడిటీని పొందుతారు. ఇది కాకుండా, 3GB రోజువారీ డేటాతో పాటు రోజుకు 100 SMS లు కూడా ఉంటాయి. వినియోగదారులు అన్ని నెట్‌వర్క్‌లలో అపరిమిత కాల్స్ చేయవచ్చు. అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ కాకుండా, వినియోగదారులు అపోలో 24/7 సర్కిల్, ఉచిత హలోట్యూన్‌లను పొందుతారు.

ఎయిర్‌టెల్ రూ.1,199 ప్లాన్

మీకు లాంగ్ వాలిడిటీ కావాలంటే 84 రోజుల వ్యాలిడిటీతో ఈ ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకోవచ్చు. దీనితో రీఛార్జ్ చేస్తే 2.5GB రోజువారీ డేటా, అపరిమిత కాలింగ్ ప్రయోజనం పొందుతారు. అలాగే, చందాదారులు ప్రతిరోజూ 100 SMSలను పంపవచ్చు. అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ కాకుండా ఇతర ప్రయోజనాల గురించి మాట్లాడుకుంటే, అపరిమిత 5G డేటా, రివార్డ్స్‌మినీ సబ్‌స్క్రిప్షన్, ఉచిత HelloTunes, Apollo 24/7 సర్కిల్ సబ్‌స్క్రిప్షన్ అందుబాటులో ఉన్నాయి.

రెండు ప్రీపెయిడ్ ప్లాన్‌లతో వినియోగదారులకు ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ప్లే ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ కూడా ఉంటుంది. దీనితో 22 కంటే ఎక్కువ OTT సేవల కంటెంట్‌ను చూడవచ్చు. వీటిలో SonyLIV, Lionsgate Play, Aha, Chaupal, Hoichoi, SunNxt మొదలైనవి ఉన్నాయి.

ఇది కూడా చదవండి: Gold Price Today: భారీగా తగ్గుతున్న బంగారం ధరలు.. తులం ధర ఎంతో తెలిస్తే..

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి