Budget 2024: బడ్జెట్ వేళ భారీగా పడిపోయిన సూచీలు.. దీనికి అసలు కారణం ఏంటంటే..

భారతీయ స్టాక్‌ మార్కెట్‌లో నష్టాలు రావడానికి మార్కెట్‌ నిపుణులు రెండు కారణాలు చెబుతున్నారు. ప్రబలంగా ఉన్న F&O ట్రేడింగ్‌ను నియంత్రించే లక్ష్యంతో సీతారామన్‌ STT రేటును 0.01 శాతం నుంచి 0.02 శాతానికి పెంచుతున్నట్లు ప్రకటించారు. దీంతో బడ్జెట్‌ అనంతరం ఈక్విటీ, ఇండెక్స్ వ్యాపారులు తమ ట్రేడ్‌లకు రెట్టింపు పన్ను చెల్లించాల్సి ఉంటుంది...

Budget 2024: బడ్జెట్ వేళ భారీగా పడిపోయిన సూచీలు.. దీనికి అసలు కారణం ఏంటంటే..
Budget 2024
Follow us
Narender Vaitla

| Edited By: Ravi Kiran

Updated on: Jul 23, 2024 | 4:02 PM

కేంద్ర బడ్జెట్ ప్రవేశపెడుతుండడంతో స్టాక్‌ మార్కెట్లో ఉత్కంఠ నెలకొన్న విషయం తెలిసిందే. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ పార్లమెంట్ ఇలా బడ్జెట్ ప్రవేశపెట్టారో లేదా అలా సూచీలు భారీగా పడిపోయాయి. భారతీయ స్టాక్ మార్కెట్ బెంచ్‌మార్క్‌లైన సెన్సెక్స్‌, నిఫ్టీలు పడిపోయాయి. మార్కెట్‌లో వచ్చే లాభాలపై పన్నులను పెంచాలని కేంద్ర మంత్రి ప్రతిపాదించే వెంటనే ఇంట్రాడే సెషన్‌లో సెన్సెక్స్ 1.2 శాతానికి పైగా పడిపోయింది. అలాగే నిఫ్టీ 1.3 శాతం తగ్గింది.

భారతీయ స్టాక్‌ మార్కెట్‌లో నష్టాలు రావడానికి మార్కెట్‌ నిపుణులు రెండు కారణాలు చెబుతున్నారు. ప్రబలంగా ఉన్న F&O ట్రేడింగ్‌ను నియంత్రించే లక్ష్యంతో సీతారామన్‌ STT రేటును 0.01 శాతం నుంచి 0.02 శాతానికి పెంచుతున్నట్లు ప్రకటించారు. దీంతో బడ్జెట్‌ అనంతరం ఈక్విటీ, ఇండెక్స్ వ్యాపారులు తమ ట్రేడ్‌లకు రెట్టింపు పన్ను చెల్లించాల్సి ఉంటుంది.

ఇక అన్ని ఫైనాన్షియల్, నాన్ ఫైనాన్షియల్ ఆస్తులపై దీర్ఘకాలిక మూలధన లాభాలపై 10 శాతం నుండి 12.5 శాతం పన్ను రేటును పెంచనున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు. కొన్ని ఆర్థిక ఆస్తులపై స్వల్పకాలిక లాభాలు ఇకపై 15 శాతం నుండి 20 శాతం పన్ను రేటుకు పెంచనున్నట్లు ఆమె ప్రకటించారు. దీంతో స్టాట్‌ మార్కెట్లో నష్టాలు రావడానికి ఇది కూడా ఒక కారణంగా చెబుతున్నారు.

పెట్టుబడిదారుల అంచనాలకు అనుగుణంగా బడ్జెట్ లేదనే కారణంతో అమ్మకాలు మొదలయ్యాయి. ఒకదశలో సెన్సెక్స్ 1300 పాయింట్లకు పైగా నష్టపోయింది. 80 వేల దిగువకు పడిపోయింది. ప్రస్తుతం (12:30 గంటలు) 556 పాయింట్లు కోల్పోయి 79,920 వద్ద కొనసాగుతోంది. ఇక నిఫ్టీ కూడా అదే బాటలో సాగుతోంది. 500 పాయింట్లకు పైగా కోల్పోయింది. దీంతో 24,500 మార్క్ దిగువకు చేరుకుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..