Budget 2024 Highlights: 2024 బడ్జెట్‌లో ముఖ్యాంశాలు.. ఏ రంగానికి ఎంత కేటాయింపు!

Union Budget 2024 Full Speech and Highlights: ఎన్నో ఆశలు, భారీ అంచనాల మధ్య కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ కేంద్ర బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. లోక్‌సభలో 11.04 గంటలకు బడ్జెట్ ప్రసంగం ప్రారంభమై.. దాదాపు 12.30 వరకు కొనసాగింది.. వికసిత్‌ భారత్‌ లక్ష్యమంటున్న..

Budget 2024 Highlights: 2024 బడ్జెట్‌లో ముఖ్యాంశాలు.. ఏ రంగానికి ఎంత కేటాయింపు!
Budget 2024
Follow us
Subhash Goud

|

Updated on: Jul 23, 2024 | 1:18 PM

Union Budget 2024 Full Speech and Highlights: ఎన్నో ఆశలు, భారీ అంచనాల మధ్య కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ కేంద్ర బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. లోక్‌సభలో 11.04 గంటలకు బడ్జెట్ ప్రసంగం ప్రారంభమై.. దాదాపు 12.30 వరకు కొనసాగింది.. వికసిత్‌ భారత్‌ లక్ష్యమంటున్న NDA సర్కార్‌.. యూనియన్‌ బడ్జెట్‌లో కీలక నిర్ణయాలు ప్రకటించింది.. ఆర్థికరంగానికి ఊతమిచ్చేలా బడ్జెట్ ను ప్రవేశపెట్టింది.. కేంద్ర బడ్జెట్‌ పరిమాణం రూ.48.21 లక్షల కోట్లు గా ప్రకటించింది.. మొత్తం ఆదాయం రూ.32.07 లక్షల కోట్లు, పన్ను ఆదాయం రూ.28.83 లక్షల కోట్లు, ద్రవ్యలోటు 4.9 శాతంగా ఉండవచ్చని అంచనా వేసింది.. అప్పులు, పన్నేతర ఆదాయాలు రూ.16 లక్షల కోట్లుగా అంచనా వేసింది.

  1. గ్రామీణాభివృద్ధికి రూ.2.66 లక్షల కోట్లు
  2. రూ.32.07 లక్షల కోట్లతో కేంద్ర బడ్జెట్‌
  3. మౌలిక సదుపాయాల కల్పనకు బడ్జెట్‌లో పెద్దపీట – రూ.11.11 లక్షల కోట్లు కేటాయించిన కేంద్రం
  4. మహిళాభివృద్ధికి రూ.3 లక్షల కోట్లు
  5. ఇవి కూడా చదవండి
  6. స్టాండర్డ్‌ డిడక్షన్ రూ.50వేల నుంచి రూ.75 వేలకు పెంపు కొత్త పన్ను విధానం ఎంచుకున్న వారికి ఊరట
  7. గ్రామీణాభివృద్ధికి రూ.2.66 లక్షల కోట్లు
  8. అర్బన్‌ హౌసింగ్‌ కోసం రూ.2.2 లక్షల కోట్లు
  9. వ్యవసాయం, అనుబంధ రంగాలకు రూ.1.52 లక్షల కోట్లు
  10. స్టాంప్ డ్యూటీ పెంచుకునేందుకు రాష్ట్రాలకు అనుమతి
  11. మహిళల ఆస్తుల రిజిస్ట్రేషన్‌పై స్టాంప్ డ్యూటీ తగ్గింపు
  12. ముద్రలోన్‌ పరిమితి రూ.20 లక్షలకు పెంపు
  13. యువత కోసం ఐదు పథకాలతో పీఎం ప్యాకేజ్
  14. విద్య, నైపుణ్యాభివృద్ధికి రూ.లక్షా 48 వేల కోట్లు
  15. కోటి ఇళ్లకు సోలార్ ప్యానెళ్ల ద్వారా ఉచిత విద్యుత్
  16. ఐదు వరద బాధిత రాష్ట్రాలకు ప్రత్యేక నిధులు
  17. MSMEలకు క్రెడిట్‌ గ్యారంటీ పథకాలు
  18. త్వరలో రూ.100 కోట్ల రుణాలు ఇచ్చే కొత్త పథకం
  19. తనఖాలు, గ్యారంటీలు లేకుండా.. యంత్రపరికరాల కొనుగోలుకు టెర్మ్‌ రుణాలు
  20. 100 నగరాల్లో ప్లగ్ &ప్లే తరహా పారిశ్రామిక పార్కులు
  21. దేశంలో చిన్న ఎయిర్‌పోర్టుల నిర్మాణానికి ప్రోత్సాహం
  22. వారణాసి తరహాలో గయాలో టెంపుల్ కారిడార్‌
  23. తగ్గనున్న బంగారం, వెండి ధరలు
  24. సెల్‌ఫోన్లపై 15 శాతం కస్టమ్‌ డ్యూటీ తగ్గింపు
  25. లెదర్‌ ఉత్పత్తులపై పన్ను శాతం తగ్గింపు
  26. మూడు క్యాన్సర్ మందులపై జీఎస్టీ తొలగింపు
  27. ఎక్స్‌రే మిషన్లపై జీఎస్టీ తగ్గింపు
  28. 25 రకాల కీలక ఖనిజాలపై కస్టమ్‌ డ్యూటీ తగ్గింపు
  29. సోలార్‌ ఉత్పత్తులపై కస్టమ్‌ డ్యూటీ తగ్గింపు
  30. యూఎల్‌ పిన్‌ ద్వారా ప్రతి భూకమతానికి ప్రత్యేక గుర్తింపు సంఖ్య కేటాయింపు
  31. ప్రతి భూకమతానికి యూఎల్‌ పిన్‌ నెంబర్‌ కేటాయింపు
  32. ప్రతి భూకమతాన్ని భూ ఆధార్‌ ద్వారా గుర్తింపు
  33. ఉన్నత విద్య కోసం రూ.10 లక్షల వరకు రుణాలు
  34. దేశీయ విద్యాసంస్థల్లో ఉన్నత విద్య కోసం రూ.10 లక్షల వరకు రుణాలు

ఇది కూడా చదవండి: Budget 2024: బడ్జెట్‌లో ఏపీకి వరాల జల్లు.. రాజధాని అమరావతికి రూ.15 వేల కోట్లు

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి