Agriculture Budget 2024: వ్యవసాయ రంగానికి రూ.1.52 లక్షల కోట్లు
Agriculture Budget 2024: పార్లమెంట్‌లో ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్ 2024 వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. వరుసగా ఆరోసారి బడ్జెట్ ప్రవేశపెట్టి నిర్మలమ్మ రికార్డు సృష్టించారు. అయితే అత్యధికంగా అంటే 10 సార్లు బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన మంత్రుల్లో మురార్జీ దేశాయి ఉండగా..
Agriculture Budget 2024: కేంద్ర మంత్రి నిర్మలాసీతారామన్ పార్లమెంట్‌లో వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత ఇచ్చిన కేంద్రం.. విద్య, నైపుణ్యాభివృద్ధికి రూ.లక్షా 48 వేల కోట్లు కేటాయిస్తున్నట్లు చెప్పారు. వ్యవసాయం, అనుబంధ రంగాలకు రూ. 1.52 లక్షల కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు.
అలాగే వచ్చే ఐదేళ్లలో 4 కోట్ల మందికి ఉపాధి కల్పించడం లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. స్వయం ఉపాధి పొందుతున్న చేతి వృత్తి మహిళలకు రుణ సాయం పెంచారు. మినరల్ మిషన్ ద్వారా జాతీయంగా, అంతర్జాతీయంగా కీలక ఖనిజాల గుర్తింపు, ఎగుమతులకు ప్రణాళిక, ఆఫ్‌షోర్ మైనింగ్‌కు నూతన విధానం అమలు చేయనున్నట్లు తెలిపారు. అలాగే సాగరగర్భంలో ఖనిజ నిక్షేపాల అన్వేషణ, తవ్వకాల కోసం ప్రత్యేక ప్రణాళిక చేపడుతున్నట్లు తెలిపారు.
బీహార్‌కు బడ్జెట్‌లో నిధుల వరద:
- బీహార్‌లో రూ.21,400 కోట్లతో 2400 మెగావాట్ల పవర్‌ప్లాంట్
- ఎయిర్‌పోర్టులు, మెడికల్ కాలేజీలు, స్పోర్ట్స్ సదుపాయాలు
- బీహార్‌కు నిధుల కల్పనకు బ్యాంకుల ద్వారా రుణాలు
తయారీరంగానికి కేటాయింపులు
- MSMEలకు క్రెడిట్ గ్యారంటీ పథకాలు
- త్వరలో రూ.100 కోట్ల రుణాలు ఇచ్చే కొత్త పథకం
- తనఖాలు, గ్యారంటీలు లేకుండా యంత్రపరికరాల కొనుగోలుకు టెర్మ్ రుణాలు
బడ్జెట్‌లో తొమ్మిది అంశాలు
1. వ్యవసాయంలో ఉత్పాదకత పెంచడం
2. ఉద్యోగం, నైపుణ్యాలు పెంచడం
3. మానవ వనరుల అభివృద్ధి-సామజిక న్యాయం
4. తయారీరంగం, సేవలు
5. పట్టణాల అభివృద్ధి
6. ఇంధన భద్రత
7. మౌలిక వసతుల అభివృద్ధి
8. ఆవిష్కరణలు, పరిశోధన-అభివృద్ధి
9. కొత్తతరం సంస్కరణలు
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఇది కూడా చదవండి: Indian Railways: రైలు లీటర్ డీజిల్‌కు ఎంత మైలేజీ ఇస్తుందో తెలుసా?