Budget 2024 Tax Slabs: పన్ను చెల్లింపుదారులకు ఊరట.. బడ్జెట్‌లో కీలక ప్రకటన
Budget 2024 Income Tax Slab Change: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (కేంద్ర బడ్జెట్ 2024) మంగళవారం వరుసగా ఏడవసారి బడ్జెట్‌ను సమర్పించారు. ఫిబ్రవరి 1, 2024న ఆర్థిక మంత్రి సీతారామన్ మోడీ ప్రభుత్వం రెండవసారి మధ్యంతర బడ్జెట్‌ను సమర్పించారు. బడ్జెట్‌లో మోదీ ప్రభుత్వం పన్ను చెల్లింపుదారులకు మినహాయింపును
Budget 2024 Income Tax Rates: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (కేంద్ర బడ్జెట్ 2024) మంగళవారం వరుసగా ఏడవసారి బడ్జెట్‌ను సమర్పించారు. ఫిబ్రవరి 1, 2024న ఆర్థిక మంత్రి సీతారామన్ మోడీ ప్రభుత్వం రెండవసారి మధ్యంతర బడ్జెట్‌ను సమర్పించారు. బడ్జెట్‌లో మోదీ ప్రభుత్వం పన్ను చెల్లింపుదారులకు మినహాయింపును ప్రకటించింది. కొత్త పన్ను విధానంలో రూ.0-3 లక్షల వరకు ఎలాంటి పన్ను ఉండదు. దీంతో పాటు స్టాండర్డ్ డిడక్షన్‌ను రూ.50 వేల నుంచి రూ.75 వేలకు పెంచుతున్నట్లు మంత్రి నిర్మలాసీతారామన్ ప్రకటించారు.
కొత్త పన్ను విధానంలో మార్పులు చేసిన ఆర్థిక మంత్రి:
కొత్త ట్యాక్స్ విధానంలో పన్ను స్లాబ్‌లు మార్పు
- జీరో నుంచి రూ.3 లక్షల వరకు పన్ను లేదు
- కొత్త పన్ను విధానం కింద స్టాండర్డ్ డిడక్షన్ పెంపు
- రూ.3 లక్షల నుంచి రూ.7 లక్షల వరకు 5 శాతం
- రూ.7 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు 10 శాతం
- రూ.10 లక్షల నుంచి రూ.12 లక్షల వరకు 15 శాతం
- రూ.12 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు 20 శాతం
- రూ.15 లక్షలకు మించి ఆదాయంపై 30 శాతం పన్ను
- కొత్త విధానంలో రూ.17,500 పన్ను ఆదా
- స్టాండర్డ్ డిడక్షన్ రూ.50వేల నుంచి రూ.75 వేలకు పెంపు
- కొత్త పన్ను విధానం ఎంచుకున్న వారికి ఊరట
పాతపన్ను స్లాబ్ విధానం:
- 0 నుంచి రూ.2,50,000 వరకు ఎలాంటి పన్ను లేదు.
- రూ.2,50,001 నుంచి రూ. 3,00,000 వరకు 5 శాతం
- రూ.3,00,001 నుంచి రూ.5,00,000 వరకు 5 శాతం
- రూ.5,00,001 నుంచి రూ.6,00,000 వరకు 10 శాతం
- రూ.6,00,001 నుంచి రూ.7,50,000 వరకు 10 శాతం
- రూ.7,50,001 నుంచి రూ.9,00,000 వరకు 15 శాతం
- రూ.9,00,001 నుంచి రూ.10,00,000 వరకు 15 శాతం
ప్రస్తుత ఆదాయపు పన్ను స్లాబ్ ఏమిటి?
ప్రస్తుతం పాత పన్ను విధానంలో ప్రాథమిక మినహాయింపు పరిమితి రూ.2.5 లక్షలు కాగా, కొత్త పన్ను విధానంలో రూ.3 లక్షలు. ఇప్పుడు ఈసారి రెండు పన్ను వ్యవస్థల్లో పన్ను మినహాయింపు పరిమితిని రూ.5 లక్షలకు పెంచాలని భావిస్తున్నారు.
ఇది కూడా చదవండి: Budget 2024: బడ్జెట్‌లో ఏపీకి వరాల జల్లు.. రాజధాని అమరావతికి రూ.15 వేల కోట్లు
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి