Yoga Mat: లాభాలు కురిపిస్తున్న గుర్రపుడెక్క.. వీటితో భారీ బిజినెస్.. సంపాదన మార్గంగా మారిన పనికిరాని మొక్క..

మీకు గుర్రపు డెక్క గురించి తెలుసా..? చెరువుల్లో ఇబ్బడి ముబ్బడిగా పెరిగే గుర్రపు డెక్క మొక్కలతో లాభాలు ఉన్నాయా? గుర్రపు డెక్క నీటిలో తేలియాడే తీగ మొక్క. మనకు ఇంతే తెలుసు.. కానీ ఆ గ్రామస్తులు వీటితో డబ్బు సంపాధిస్తున్నారు.. ఎలానో ఇక్కడ తెలుసుకోండి..

Yoga Mat: లాభాలు కురిపిస్తున్న గుర్రపుడెక్క.. వీటితో భారీ బిజినెస్.. సంపాదన మార్గంగా మారిన పనికిరాని మొక్క..
Yoga Mat
Follow us

|

Updated on: Aug 05, 2021 | 8:22 PM

మీకు గుర్రపు డెక్క గురించి తెలుసా..? చెరువుల్లో ఇబ్బడి ముబ్బడిగా పెరిగే గుర్రపు డెక్క మొక్కలతో లాభాలు ఉన్నాయా? గుర్రపు డెక్క నీటిలో తేలియాడే తీగ మొక్క. నీటిలో ఉన్న విషపదార్థాలను పీల్చుకుని పెరుగుతుంది. అంతే కాదు అది పెరిగేందుకు నీటిలోని ఆక్సిజన్‌ను కూడా పీల్చుకుంటుంది. ఇక ఆ నీటిలో చెపలు కూడా బతక లేవు. అంతేకాదు చెరువులోని నీటిపై కనిపించిందంటే అతి కొద్ది రోజుల్లో ఆ చెరువు మట్టి దిబ్బగా మారుతుందని అర్థం చేసుకోవాలి. ఇంతవరకు గుర్రపుడెక్క గురించి మనకు ఇంతే తెలుసు.

కానీ గుర్రపు డెక్క మొక్కలతోనూ లాభాలున్నాయని ఈ గ్రామస్థులు నిరూపించారు. ఎవరికీ పనికి రాని గుర్రపుడెక్క మొక్కతో లక్షల రూపాయలు ఆర్జిస్తున్నారు. పెద్ద వ్యాపార సామ్రాజ్యాన్ని సృష్టిస్తున్నారు. ఎవరికీ తీసిపోని రీతిలో ఉత్పత్తులను తయారు చేస్తున్నారు.

వాటర్ హైసింత్ కేవలం ఒక మొక్క నుండి మొదలై చెరువు అంతటా వ్యాపిస్తుంది. సాధారణంగా గుర్రపుడెక్కతో ఎవరికీ ఎలాంటి ఉపయోగం లేదు. ఒకప్పుడు ఈ మొక్కతో లక్షల రూపాయల నష్టాన్ని ముటగట్టుకున్న చేపల చెరువుల పెంపకం దారులు ఒప్పుడు దానిని ఆదాయ వనరుగా మార్చుకున్నారు. గుర్రపుడెక్క నుంచి యోగా మ్యాట్స్ తయారు చేస్తున్నారు. అంతే కాదు ఇతర వస్తువులను  కూడా వారు తయారు చేస్తున్నారు. దాని నుండి మంచి ఆదాయం పొందుతున్నారు.

అస్సాం రాష్ట్రంలోని దీపోర్ బీల్ గ్రామం చుట్టూ నివసిస్తున్న కొందరు బాలికలు అద్భుతాలు చేస్తున్నారు. కొంతకాలం క్రితం వరకు ఈ దీపోర్ బీల్ సరస్సు మొత్తం గుర్రపు డెక్కతో నిండిపోయి ఉండేది. చేపల వ్యాపారులకు నష్టాన్ని కలిగించేది. అయితే.. నార్త్ ఈస్ట్ టెక్నాలజీ అప్లికేషన్.. లెర్నింగ్ సెంటర్ (NECTR) కూడా ఈ అమ్మాయిలకు హైసింత్ నుంచి యోగా మ్యాట్స్ తయారు చేయడంలో సహాయపడింది.

ఈ ఆరుగురు బాలికలు అద్భుతాలు చేస్తున్నారు.. 

వాస్తవానికి ఇక్కడి స్థానిక ప్రజలు గుర్రపుడెక్క మొక్కతో కొన్ని హస్తకళలను తయారు చేసేవారు. దీనిని దృష్టిలో ఉంచుకుని NECTR ఇక్కడి గ్రామస్థులకు ట్రైనింగ్ ఇచ్చింది. దీంతో  ఇప్పుడు వీరు యోగా మ్యాట్స్ చాలా తక్కువ ఖర్చుతో తయారు చేస్తున్నారు. చెరువులు, సరస్సులలో ఎవరికి పనికి రాకుండా పెరిగే ఈ గుర్రపు డెక్క సహాయంతో యోగా మ్యాట్స్ తయారు చేయించడం నేర్పించారు. ముందుగా ఇక్కడి మత్స్యకారుల కుటుంబాల నుంచి ఆరుగురు బాలికలను ఎంపిక చేసుకున్నారు. వారికి యోగా మ్యాట్స్ తయారు చేయడం నేర్పించారు. వీరి తర్వాత మరో 40 మంది అమ్మాయిలకు వీటి తయారిపై శిక్షణ ఇచ్చారు.

Assam Girls Make Yoga Mats

Assam Girls Make Yoga Mats

ఒక యోగా మ్యాట్‌ను తయారు చేసేందుకు.. 

సాధారణంగా ఈ రకమైన పని కోసం ముందుగా గుర్రపు డెక్క్ మొక్కను సేకరిస్తారు. ఆ తర్వాత ఎండలో కనీసం 120 గంటలపాటు ఆరబెట్టాల్సి ఉంటుంది. కానీ అస్సాంలో అధిక వర్షపాతం నమోదు అవుతుంటుంది. అటువంటి పరిస్థితిలో గుర్రపు డెక్కను ఆరబెట్టడానికి సోలార్ డ్రైయర్ సహాయంతో ఆ పని చేస్తున్నారు. సోలార్ డ్రైయర్ సహాయంతో 10 కిలోల హైసింత్ ఆరబెట్టడానికి 24 గంటలు పడుతుంది. 12 కిలోల హైసింత్‌ను ఆరబెట్టినప్పుడు అది రెండు కిలోలు అవుతుంది. ఈ రెండు కిలోల ఎండిన హైసింత్ నుండి దాదాపు ఒకటిన్నర యోగా మ్యాట్స్ తయారు చేస్తారు.

వీరు తయారు చేసిన యోగా మ్యాట్స్‌కు ‘మూర్హెన్ యోగా మత్’ అని పేరు పెట్టారు. ‘మూర్హెన్ ‘ అంటే ఓ వలస పక్షి పేరు. ఈ వలస పక్షి దీపోర్ సరస్సుకు వస్తుంటుంది. యోగ చాపను తయారు చేసేందుకు కోసం నలుపు, ఎరుపు, ఆకుపచ్చ దారాలను ఉపయోగిస్తుంటారు. ఈ దారాలు పూర్తిగా సహజంగా తయారు చేయబతాయి.

ఈ యోగ చాప 100% బయోడిగ్రేడబుల్

యోగా మ్యాట్స్ మాత్రమే కాదు.. అనేక ఇతర హస్తకళలు కూడా దీని నుండి తయారు చేస్తున్నారు. గుర్రపు డెక్క అనేది నీటిలో పెరిగే ఒక రకం మొక్క. ఇది 100% బయోడిగ్రేడబుల్ కావడానికి కారణం ఇదే. ఈ విధంగా దాని నుండి తయారు చేయబడిన యోగా మ్యాట్స్ కూడా పర్యావరణ సంబంధమైనవి.

IND vs ENG 1st Test Day 2 Live: తొలి రోజు టీమిండియా పేస్ పంచ్‌.. ఇవాళ బ్యాటింగ్ బౌండరీలు చూద్దాం..