IND vs ENG 1st Test Day 2 Highlights: రెండో రోజు ఆటకు బ్రేక్.. 125/4 స్కోరుతో టీమిండియా..

Sanjay Kasula

Sanjay Kasula |

Updated on: Aug 05, 2021 | 10:02 PM

India vs England 1st Test Day 2 Live Score: నాటింగ్‌హామ్‌లో జరుగుతున్న భారత్-ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో రెండో రోజు వర్షం కారణంగా నిలిచిపోయింది. 

IND vs ENG 1st Test Day 2 Highlights: రెండో రోజు ఆటకు బ్రేక్.. 125/4 స్కోరుతో టీమిండియా..
Rain

నాటింగ్‌హామ్‌లో జరుగుతున్న భారత్-ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో రెండో రోజు వర్షం కారణంగా నిలిచిపోయింది. మూడో సెషన్‌లో ఒక్క బంతి వేయగానే వర్షం కురవడం ప్రారంభించింది. దాంతో ఆట మరోసారి ఆగిపోయింది. అంతకుముందు రెండో సెషన్‌లో టీమిండియా 46.1 ఓవర్ల వద్ద 125/4 స్కోరుతో కొనసాగుతున్న వేళ వెలుతురు లేమి కారణంగా అంపైర్లు ఆటను నిలిపివేశారు.

ఆ తర్వాత వర్షం కురవడంతో మరింత ఆలస్యమైంది. ఈ క్రమంలోనే టీమిండియా రెండో రోజు తేనీరు విరామం కూడా తీసుకుంది. అయితే, వర్షం కురవడం ఆగిపోయి వెలుతురు బాగా ఉండటంతో అంపైర్లు ఆటను కొనసాగించారు. కానీ, అండర్సన్‌ ఒక బంతి వేయగానే మళ్లీ వర్షం కురిసింది. దీంతో రెండోసారి  నిలిచిపోయింది. రాహుల్‌(57), పంత్‌(7) నాటౌట్‌గా నిలిచారు.

LIVE Cricket Score & Updates

The liveblog has ended.
  • 05 Aug 2021 09:17 PM (IST)

    ఒక్క బంతికే తిరిగి మళ్లీ వర్షం..

    ఇంగ్లాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టు రెండో రోజు ఆట వర్షం కారణంగా మళ్లీ నిలిచిపోయింది. మూడో సెషన్‌లో ఒక్క బంతి వేయగానే వర్షం కురవడం ప్రారంభించింది. దాంతో ఆట మరోసారి ఆగిపోయింది. అంతకుముందు రెండో సెషన్‌లో టీమిండియా 46.1 ఓవర్ల వద్ద 125/4 స్కోరుతో కొనసాగుతున్న వేళ వెలుతురు లేమి కారణంగా అంపైర్లు ఆటను నిలిపివేశారు.

    ఆ తర్వాత వర్షం కురవడంతో మరింత ఆలస్యమైంది. ఈ క్రమంలోనే టీమిండియా రెండో రోజు తేనీరు విరామం కూడా తీసుకుంది. అయితే, వర్షం కురవడం ఆగిపోయి వెలుతురు బాగా ఉండటంతో అంపైర్లు ఆటను కొనసాగించారు. కానీ, అండర్సన్‌ ఒక బంతి వేయగానే మళ్లీ వర్షం కురిసింది. దీంతో రెండోసారి  నిలిచిపోయింది. రాహుల్‌(57), పంత్‌(7) నాటౌట్‌గా నిలిచారు.

  • 05 Aug 2021 09:14 PM (IST)

    వాతావరణం అనుకూలించక…

    టీమిండియా రెండో సెషన్‌లో వాతావరణం అనుకూలించక అర్ధాంతరంగా నిలిచిపోయిన ఆట మరికాసేపట్లో ప్రారంభంకానుంది.

  • 05 Aug 2021 08:07 PM (IST)

    జోరు వర్షం..

    నాటింగ్‌హామ్‌ ట్రెంట్‌ బ్రిడ్జ్‌ స్టేడియంలో వర్షం జోరుగా కురుస్తోంది. దీంతో రెండో రోజు మిగిలిన ఆట ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది. ముందుగా వెలుతురు తగ్గిపోవడంతో అంపైర్లు ఆటను నిలిపివేయగా అప్పటికి టీమిండియా స్కోర్‌ 46.1 ఓవర్లలో 125/4గా నమోదైంది. కేఎల్‌ రాహుల్‌ (57) హాఫ్ సెంచరీతో కొనసాగుతుండగా పంత్‌(7) పరుగులతో ఉన్నాడు.

  • 05 Aug 2021 08:03 PM (IST)

    రెండో రోజు ఆటకు అంతరాయం...

    రెండో రోజు ఆటకు బ్రేక్ పడింది. రెండో సెషన్‌లో భారత్‌ 46.1 ఓవర్లకు 124/4తో నిలిచిన సమయంలో వెలుతురు తక్కువ ఉండటంతో అంపైర్లు ఆటను అర్ధంతరంగా నిలిపివేశారు. అంతకుముందు టీమిండింయా భోజన విరామానికి ముందు 97/1తో పటిష్టస్థితిలో నిలవగా తర్వాత ఒక్కసారిగా కుప్పకూలింది. స్వల్ప తేడాలో పుజారా(4), కెప్టెన్‌ కోహ్లీ(0), వైస్‌ కెప్టెన్‌ అజింక్య రహానె(5) ఔటవ్వడంతో భారత్‌ కష్టాల్లో పడింది. అయితే.. ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ (57; 148 బంతుల్లో 9x4) మరోవైపు  హాఫ్ సెంచరీతో కొనసాగుతున్నాడు. అతడికి తోడుగా రిషభ్‌ పంత్‌(7) క్రీజ్‌లో ఉన్నాడు. ప్రస్తుతం టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 58 పరుగుల వెనుకంజలో నిలిచింది.

  • 05 Aug 2021 06:52 PM (IST)

    నాలుగో వికెట్ కోల్పోయిన టీమిండియా..

    టీమిండియా నాలుగో వికెట్ కోల్పోయింది. విరాట్ కోహ్లీ తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన అజింక్య రహానే కూడా పెవిలియన్ దారి పట్టాడు.  రెండవ సెషన్‌లో టీమిండియా ఇన్నింగ్స్ తడబడటం ప్రారంభమైంది.  

  • 05 Aug 2021 06:34 PM (IST)

    భారత్ మూడో వికెట్ కోల్పోయింది

    భారత్ మూడో వికెట్ కోల్పోయింది, విరాట్ కోహ్లీ కూడా అవుట్ అయ్యాడు. అండర్సన్ బౌలింగ్ టీమిండియాను భారీ దెబ్బ తీసింది. రెండు వరుస బంతుల్లో రెండు పెద్ద వికెట్లు కోల్పోయింది టీమిండియా. పుజారా అవుటయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ విరాట్ కోహ్లీ మొదటి బంతికే అవుటయ్యాడు. కోహ్లీ ఆండర్సన్ బంతిని ఆపడానికి ప్రయత్నించాడు. కానీ తర్వాత స్వింగ్‌లో అవుటయ్యాడు. ప్రస్తుతం టీమిండియా మూడు వికెట్ల నష్టానికి 106 పరుగులు చేసింది. రాహుల్‌ 51, రహానే 0 క్రీజులో ఉన్నారు.

  • 05 Aug 2021 06:32 PM (IST)

    రెండో వికెట్ కోల్పోయిన టీమిండియా..

    టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. చేతేశ్వర్ పుజారా అవుట్ అయ్యాడు. బౌలింగ్‌కి తిరిగి వచ్చిన జేమ్స్ ఆండర్సన్ టీమిండియాకు మరో దెబ్బ తీశాడు. ఆండర్సన్ అవుట్ స్వింగ్‌ను కొట్టేందుకు  ప్రయత్నంచడంతో  బ్యాట్ ఎడ్జ్‌కి తగిలి కీపర్‌కు క్యాచ్ వెళ్లింది. దీంతో పుజారా తన వికెట్‌ను కోల్పోయాడు.

  • 05 Aug 2021 06:29 PM (IST)

    టీమిండియా 100 పరుగులు

    టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో ఒక వికెట్ కోల్పోయి 100 పరుగులకు చేరింది. 37.3 ఓవర్లకు 97/1తో భోజన విరామానికి వెళ్లిన భారత్‌ తర్వాత తిరిగి ఆట కొనసాగించింది. ఈ క్రమంలోనే పుజారా(2) క్రీజులోకి రాగా రాహుల్‌(48) పరుగులతో ఆడుతున్నాడు. అండర్సన్‌ వేసిన 39వ ఓవర్‌లో పుజారా సింగిల్‌ తీయడంతో జట్టు స్కోర్‌ 100కు చేరింది.

  • 05 Aug 2021 05:50 PM (IST)

    భోజన విరామం..

    టీమిండియా రెండో రోజు నిలకడగా ఆడుతూ శుభారంభం చేసింది. అయితే, భోజన విరామ సమయానికి కొద్దిగా ముందు ఓపెనర్‌ రోహిత్‌శర్మ  ఔటయ్యాడు.

  • 05 Aug 2021 05:43 PM (IST)

    టీమిండియాకు తొలి ఎదురు దెబ్బ

    టీమిండియాకు తొలి ఎదురు దెబ్బ తగిలింది. రోహిత్ శర్మ అవుట్ అయ్యాడు. భోజనానికి ముందు చివరి ఓవర్‌లో భారత్ తొలి వికెట్ కోల్పోయింది. సెషన్ అంతటా ఓపికగా బ్యాటింగ్ చేసిన  రోహిత్ శర్మ ఓ భారీ షాట్ కొట్టబోయి తన వికెట్ చేజార్చుకున్నాడు. అది కూడా తన అభిమాన పుల్ షాట్‌ కొడుతూ తన వికెట్ పోగొట్టుకున్నాడు. రాబిన్సన్ వేస్తున్న ఓవర్‌లో మూడవ బంతిని భారీ షాట్ కొట్టాడు అయితే అది నేరుగా ఫీల్డర్ చేతిలోకి వెళ్లింది.  రాబిన్‌సన్‌ బౌలింగ్‌లో భారీ షాట్‌ ఆడబోయి సామ్‌కరన్‌ చేతికి చిక్కాడు. దాంతో భారత్‌ 97 పరుగుల వద్ద తొలి వికెట్‌ కోల్పోయింది.

  • 05 Aug 2021 04:43 PM (IST)

    కట్టుదిట్టమైన బౌలింగ్

    రెండవ రోజు మొదటి గంట గడిచిపోయింది. భారత ఓపెనర్లు గొప్పగా ఆట మొదలు పెట్టారు.ఇంగ్లాండ్ వికెట్ తీసేందుకు కట్టుదిట్టమైన బౌలింగ్ చేస్తోంది.

  • 05 Aug 2021 04:37 PM (IST)

    రెండో రోజు నిలకడగా భారత్‌

    ఇంగ్లండ్‌తో జరుగుతున్న మొదటి టెస్టులో రెండో రోజు ఆటను టీమిండియా నిలకడగా ఆరంభించింది. ప్రస్తుతం 24 ఓవర్లు ముగిసేసరికి వికెట్‌ నష్టపోకుండా 33 పరుగులు చేసింది. కేఎల్‌ రాహుల్‌ 12, రోహిత్‌ శర్మ 18 పరుగులతో క్రీజులో ఉన్నారు.

  • 05 Aug 2021 04:10 PM (IST)

    రెండో రోజు ఆట మొదలైంది...

    రెండో రోజు ఆట మొదలైంది. ఇందులో ఓపెనర్లు రోహిత్ శర్మ , కేఎల్ రాహుల్ క్రీజ్‌లో ఉన్నారు.

  • 05 Aug 2021 03:31 PM (IST)

    ఇండియా హాకీ జట్టును ప్రశంసించిన బీసీసీఐ..

    టోక్యో ఒలింపిక్స్‌లో భారత మెన్స్‌ హాకీ జట్టు సంచలన విజయం సాధించడం పట్ల దేశ ప్రజలంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 41 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్‌లో పతకం గెలవడంతో జట్టుపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ క్రమంలోనే బీసీసీఐ తన ట్విట్టర్ వేదికగా అభినందించింది. Sky is Blue indeed అంటూ ట్వీట్ చేసింది.

Published On - Aug 05,2021 3:14 PM

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu