10 వేలకుపైగా పరుగులు, 1697 వికెట్లు.. ఈ దిగ్గజ క్రికెటర్ మామూలోడు కాదు.. అతడెవరో తెలుసా!

Ravi Kiran

Ravi Kiran | Edited By: Anil kumar poka

Updated on: Aug 05, 2021 | 2:13 PM

10 వేలకుపైగా పరుగులు, 1697 వికెట్లు.. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో తనకంటూ ఓ గుర్తింపును సంపాదించాడు. ఎన్నో అమోఘమైన రికార్డులను కొల్లగొట్టాడు...

10 వేలకుపైగా పరుగులు, 1697 వికెట్లు.. ఈ దిగ్గజ క్రికెటర్ మామూలోడు కాదు.. అతడెవరో తెలుసా!
Cricketer

Follow us on

10 వేలకుపైగా పరుగులు, 1697 వికెట్లు.. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో తనకంటూ ఓ గుర్తింపును సంపాదించాడు. ఎన్నో అమోఘమైన రికార్డులను కొల్లగొట్టాడు. అనూహ్యంగా 1967వ సంవత్సరం ఆగష్టు 4న మరణించాడు. అతడెవరో కాదు ఇంగ్లాండ్ క్రికెటర్ పీటర్ స్మిత్. ఒకసారి ఈ దిగ్గజ క్రికెటర్ సృష్టించిన రికార్డుల గురించి చర్చించుకుందాం.

వాస్తవానికి, పీటర్ స్మిత్ ఇంగ్లాండ్ తరుపున కేవలం 4 టెస్ట్ మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. కానీ ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు. అంతేకాకుండా ఓ ఆసక్తికరమైన విషయమేంటంటే.. 1933 సంవత్సరంలో టెస్ట్ మ్యాచ్‌లో ఎంపికైనట్లు ఎవరో తప్పుడు సమాచారాన్ని పీటర్ స్మిత్‌కు అందించారు. అయితే అనూహ్యంగా ఈ మెసేజ్ అందిన 13 ఏళ్ల తర్వాత పీటర్ స్మిత్ ఇంగ్లాండ్ తరపున అరంగేట్రం చేశాడు. అతడు నాలుగు టెస్టులు ఆడి కేవలం మూడు వికెట్లు మాత్రమే పడగొట్టాడు.

10 వేలకు పైగా పరుగులు, 1697 వికెట్లు…

పీటర్ స్మిత్ ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌ల విషయానికొస్తే, గణాంకాలు అమోఘంగా ఉంటాయి. మొత్తం 465 మ్యాచ్‌ల్లో 17.95 సగటుతో 10142 పరుగులు చేశాడు. ఇందులో ఎనిమిది సెంచరీలు, 32 అర్ధ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక స్కోరు 163 పరుగులు. అటు బౌలింగ్ విషయానికి వస్తే.. ఏకంగా 1697 వికెట్లు తీశాడు. ఇందులో 122 సార్లు ఐదు అంతకంటే ఎక్కువ వికెట్లు పడగొట్టాడు.

Read Also: బ్రేకప్ బాధ నుంచి బయటపడాలంటే.? ఈ నాలుగు విషయాలు తప్పనిసరిగా గుర్తుంచుకోండి!

మొసలికి చిక్కిన అడవి దున్న.. కట్ చేస్తే సీన్ రివెర్స్.. చూస్తే షాక్ అవ్వాల్సిందే!

బ్రతుకున్న పామును కరకరా నమిలి మింగేసిన యువకుడు.. కారణం తెలిస్తే షాకే.!

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu