Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Relationship Tips: బ్రేకప్ బాధ నుంచి బయటపడాలంటే.? ఈ నాలుగు విషయాలు తప్పనిసరిగా గుర్తుంచుకోండి!

ప్రేమ ఎవరిపై ఎప్పుడు.? ఎలా.? పుడుతుందో ఎవ్వరికీ తెలియదు. ఒకరిపై ఇష్టం కలిగితే.. అతడు లేదా ఆమెతో ఎప్పుడూ ఉండాలనిపిస్తుంది...

Relationship Tips: బ్రేకప్ బాధ నుంచి బయటపడాలంటే.? ఈ నాలుగు విషయాలు తప్పనిసరిగా గుర్తుంచుకోండి!
Breakup
Follow us
Ravi Kiran

|

Updated on: Aug 04, 2021 | 2:04 PM

ప్రేమ ఎవరిపై ఎప్పుడు.? ఎలా.? పుడుతుందో ఎవ్వరికీ తెలియదు. ఒకరిపై ఇష్టం కలిగితే.. అతడు లేదా ఆమెతో ఎప్పుడూ ఉండాలనిపిస్తుంది. తన మాటలే వినాలని.. తనతో గడపాలని.. ఇలా ఎన్నో అనిపిస్తుంటాయి. ఇంతలా గాఢంగా ఒకరినొకరు ప్రేమించుకున్న వాళ్లు.. ఏదొక కారణంగా విడిపోతుంటారు. చాలామందికి ఆ బ్రేకప్ బాధను మిగిలిస్తుంది. కొందరికి దాని నుంచి బయటపడటం చాలా కష్టమే. ఫ్రెండ్స్‌, చుట్టాలు మన బాధను చూడలేక పలు సలహాలు ఇస్తుంటారు. సలహా ఇవ్వడం వరకు బాగానే ఉంటుంది.

కానీ ఇలాంటి పరిస్థితుల్లో వాటిని ఆచరణలో పెట్టాలంటే కొంచెం కష్టం. ప్రతీ పనిలోనూ పదేపదే ఎక్స్ గుర్తుకురావడం.. మనసు ముక్కలు కావడం జరుగుతుంటుంది. అలాగే అన్ని సరదాలను, ఆనందాలను మర్చిపోతుంటాం. ఈ జ్ఞాపకాల్లో నిమగ్నమైపోయి ఉపయోగించుకోవాల్సిన సమయాన్ని సైతం నాశనం చేసుకుంటాం. అయితే వీటి నుంచి త్వరగా మూవ్ ఆన్ అయిపోవాలి. గతం గురించి ఎక్కువగా ఆలోచించకుండా.. చేసిన తప్పుల నుంచి గుణపాఠాలు నేర్చుకుని జీవితంలో ముందుకు సాగాలి. మీ ఎక్స్‌ని మర్చిపోయి జీవితంలో ముందుకు సాగడానికి ఈ నాలుగు విషయాలను ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి.

1. ఏది జరిగినా అది మంచికే జరిగింది…

ముందుగా మొదటి నియమం ఏంటంటే.. అప్పటిదాకా ఏది జరిగినా మన మంచికే జరిగిందని నమ్మాలి. ఉదాహరణకు ఇద్దరు వ్యక్తుల మధ్య ఏర్పడిన బంధం నిజమైనది అయితే.. అది ఎప్పటికీ బ్రేక్ అవ్వదు. ఒకవేళ అది బ్రేకప్‌కు దారి తీస్తే.. ఇద్దరి వైపు తప్పులు ఉన్నట్లే. ఆ బంధాన్ని నిలబెట్టాలని చూసినా ప్రయోజనం ఉండదు. కాబట్టి ఏది జరిగినా, దానిని ఒక గుణపాఠంగా తీసుకోవాలి. మీరు చేసిన తప్పుల నుంచి నేర్చుకోవాలి. జీవితంలో ముందుకు వెళ్ళాలి.

2. మిమ్మల్ని మీరు ప్రేమించడం నేర్చుకోండి…

బ్రేకప్ తర్వాత ఇది చాలామంది చేసే పొరపాటు. విడిపోయిన అనంతరం మన గురించి మనం పట్టించుకోవడం కూడా మానేస్తాం. ఇది చాలా తప్పు. ముందు మిమ్మల్ని మీరు ప్రేమించడం నేర్చుకోండి. రిలేషన్‌షిప్‌ కంటే ముందు మీరు ఎలా ఉండేవారో గుర్తుతెచ్చుకోండి. మీ కలల్ని సహకారం చేసుకోవడంలో.. లక్ష్యాలను చేధించడంలో సమయాన్ని కేటాయించండి. తద్వారా మీ మనస్సుకు కాస్తా ప్రశాంతత కలగడమే కాకుండా.. మీలో కొత్త ఉత్సాహం వస్తుంది.

3. ఒంటరిగా ఉండొద్దు…

సాధారణంగా ఒంటరిగా ఉంటే ఆలోచనలు పరిపరి విధాలుగా ఉంటాయి. మనస్సు కూడా కంట్రోల్‌గా ఉండదు. అలాంటిది బ్రేకప్ టైంలో ఒంటరిగా ఉంటే ఇంకేమైనా ఉందా.! పూర్తిగా డిప్రెషన్‌లోకి వెళ్ళిపోతారు. చనిపోవాలనే చెడు ఆలోచనలు కూడా వస్తాయి. అందుకే ఎక్కువగా ఫ్రెండ్స్‌, కుటుంబసభ్యులు మధ్య ఉండండి. అంతేకాకుండా ఎప్పుడూ ఏదొక పని చేస్తూ మైండ్‌ను చెడు ఆలోచనల నుంచి డైవర్ట్ చేయండి.

4. బ్రేకప్ తర్వాత మీకు మంచి వ్యక్తి ఎవరైనా తారసపడితే.. సంకోచించకండి..

బ్రేకప్ తర్వాత సెకండ్ ఛాన్స్ ఇచ్చేందుకు చాలామంది సంకోచిస్తారు. మొదటి వ్యక్తితో పోలుస్తూ భయపడుతుంటారు. లేదా కొంతమంది తమకంటూ కొన్ని రూల్స్ సిద్దం చేసుకుంటారు. గుర్తుంచుకోండి, అందరూ ఒకేలా ఉండరు. ముందుగానే ఒక డెసిషన్‌కు రావడం కరెక్ట్ కాదు. అలాగే మీరు పెట్టుకున్న నియమాలు ఎవరిపైనా విధించడం మంచిది కాదు. రెండో ఛాన్స్ ఇవ్వండి. వేరొకరిని సంతోషపెట్టే విషయంలో మిమ్మల్ని మీరు గుర్తుతెచ్చుకోండి. స్ట్రాంగ్‌గా ముందుకు అడుగు వేయండి.

Also Read:

భర్త వింత అలవాటు.. రోజుకు 4 గంటలు టాయిలెట్‌లోనే.. కారణం తెలిసి భార్య షాక్.!

కుక్కను పట్టి నీళ్లలోకి లాగేసిన మొసలి.. చూస్తే షాక్ అవ్వాల్సిందే..!

ఈ చిన్నారి సౌత్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్.. అబ్బాయిల్లో విపరీతమైన ఫాలోయింగ్.. గుర్తుపట్టారా!