Tokyo Olympics 2020: తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్‌గా పాకిస్తాన్ కోడలు వద్దు. తెలుగు తేజం ముద్దు అంటున్న ఎమ్మెల్యే రాజాసింగ్
Tokyo Olympics 2020: టోక్యో ఒలింపిక్స్ లో భారత దేశానికి రెండు సార్లు వ్యక్తిగత పతకాలను అందించిన తెలుగు తేజం పీవీ సింధుపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ప్రధాని మోడీ సింధు కోసం స్పెషల్ విందుని రెడీ చేస్తే..
Tokyo Olympics 2020: టోక్యో ఒలింపిక్స్ లో భారత దేశానికి రెండు సార్లు వ్యక్తిగత పతకాలను అందించిన తెలుగు తేజం పీవీ సింధుపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ప్రధాని మోడీ సింధు కోసం స్పెషల్ విందుని రెడీ చేస్తే.. ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ నగదు బహుమతిని ప్రకటించారు. మంత్రులు, సినీ నటీనటులు సైతం సింధు పై సోషల్ మీడియాగా ప్రశంసల వర్షం కురిపించారు. తాజాగా హైదరాబాద్ లోని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సరికొత్త డిమాండ్ ని తెరమీదకు తీసుకొచ్చారు.
తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ ను మార్చమని ముఖ్యమంత్రి కేసీఆర్ కు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ అంబాసిడర్‌గా ఉన్న పాకిస్తాన్ కోడలు సానియా మీర్జాను వెంటనే తప్పించాలని .. మన పివి సింధు ను బ్రాండ్ అంబాసడర్ చేయాలని సీఎం కేసీఆర్‌కు ఆయన విజ్ఙప్తి చేశారు. పాకిస్థాన్‌కు కోడలు కనుక సానియాను అంబాసిడర్‌గా తొలగించి, ఆ స్థానంలో పీవీ సింధు ను నియమించాలని రాజాసింగ్ డిమాండ్ చేశారు. పాకిస్థాన్ క్రికెట్ ప్లేయర్ షోయబ్ మాలిక్‌ను సానియా పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. సింధు భారత దేశానికి మంచి పేరు తీసుకొచ్చింది, మన తెలంగాణ కు పేరు తెచ్చింది. ఇకనుంచి స్పోర్ట్స్ మీద దృష్టి పెట్టాలని.. తెలంగాణ నుంచి మంచి మంచి క్రీడాకారులు వెలుగులోకి వస్తారని తెలిపారు రాజా సింగ్
ఇదే అంశం పుల్వామాలో జరిగిన ఉగ్రదాడి జరిగిన సమయంలో కూడా టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జాను తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ గా తొలగించాలని డిమాండ్ వినిపించిన సంగతి తెలిసిందే..
Also Read: Tokyo Olympics 2021: ఒలింపిక్స్‌లో పతకం.. దేశవ్యాప్తంగా సంబరాలు.. మీరు దేశానికి గర్వకారణం, యూత్‌కి ఆదర్శం అంటున్న ప్రధాని