AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Business Ideas: మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్‌ అవ్వండి.. రెండు చేతులా సంపాదించుకోవచ్చు! అర్హతలు, ఆదాయం, అవకాశాలు ఇవే..!

మ్యూచువల్ ఫండ్ సెక్టార్ వేగంగా విస్తరిస్తోంది, అర్హత కలిగిన డిస్ట్రిబ్యూటర్లకు డిమాండ్ పెరిగింది. NISM సర్టిఫికేషన్ ద్వారా మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్‌గా మారవచ్చు. NISM పరీక్ష, AMFI నుండి ARN పొందడం ద్వారా మీరు డిస్ట్రిబ్యూటర్‌గా రిజిస్టర్ అవ్వగలరు. కస్టమర్ల నుండి పొందే పెట్టుబడులపై కమీషన్ల ద్వారా గణనీయమైన ఆదాయం సంపాదించవచ్చు.

Business Ideas: మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్‌ అవ్వండి.. రెండు చేతులా సంపాదించుకోవచ్చు! అర్హతలు, ఆదాయం, అవకాశాలు ఇవే..!
Gratuity
SN Pasha
|

Updated on: Nov 27, 2025 | 10:00 AM

Share

మ్యూచువల్ ఫండ్ సెక్టార్ వేగంగా అభివృద్ధి చెందుతోంది. మన దేశంలో 45కి పైగా మ్యూచువల్ ఫండ్ అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీలు ఉన్నాయి. దాదాపు 3,000 ఫండ్ పథకాలు ఉన్నాయి. వీటిలో (AUM- అసెట్ అండర్ మేనేజ్‌మెంట్) పెట్టుబడి పెట్టిన మొత్తం ఆస్తులు దాదాపు రూ.80 లక్షల కోట్లు. ఈ పరిశ్రమ చాలా వేగంగా అభివృద్ధి చెందుతోంది. షేర్లలో పెట్టుబడి పెట్టాలనుకునే వారికి మ్యూచువల్ ఫండ్స్ ఒక సులభమైన మార్గం.

మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్‌గా..

మన దేశంలో ఒకటిన్నర లక్షలకు పైగా మ్యూచువల్ ఫండ్ పంపిణీదారులు ఉన్నారు. 3,000 మందిలో ఎవరు ఏ మ్యూచువల్ ఫండ్లకు సరిపోతారో చెప్పడానికి నిపుణుల అవసరం ఉంది. తగిన శిక్షణ పొందిన వ్యక్తులకు డిమాండ్ ఉంది. అదేవిధంగా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సెక్యూరిటీస్ మార్కెట్స్ (NISM) వివిధ శిక్షణలను అందిస్తుంది. ఇది మ్యూచువల్ ఫండ్ పంపిణీదారులుగా మారాలనుకునే వారికి శిక్షణా కార్యక్రమాలను కూడా అందిస్తుంది. మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్లకు NISM-VA అనే ​​పరీక్ష ఉంటుంది. మీరు కేవలం రూ.1,500 ఫీజ్‌తో NISM వెబ్‌సైట్‌లో ఎగ్జామ్‌ కోసం నమోదు చేసుకోవచ్చు. కోర్సు మెటీరియల్ అదే వెబ్‌సైట్‌లో ఉచితంగా లభిస్తుంది. మీరు దానిని చదివి షెడ్యూల్ చేసిన రోజున పరీక్ష రాయాలి.

100 ప్రశ్నలు మల్టీపల్‌ ఛాయిస్‌ రూపంలో ఇస్తారు. సమయం 2 గంటలు. ఉత్తీర్ణత కోసం కనీసం 50 మార్కెలు సాధించాలి. మీరు ఉత్తీర్ణులైతే మీకు NISM VA సర్టిఫికేట్ లభిస్తుంది. ఇది 3 సంవత్సరాలు చెల్లుతుంది. ఆ తర్వాత మీరు మళ్ళీ పరీక్ష రాసి కొత్త సర్టిఫికేట్ పొందడానికి దానిలో ఉత్తీర్ణులవ్వాలి.

NISM సర్టిఫికేట్ పొందిన తర్వాత మ్యూచువల్ ఫండ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (MFI)లో ARN (AMFI రిజిస్ట్రేషన్ నంబర్) కోసం దరఖాస్తు చేసుకోవాలి. అవసరమైన పత్రాలు NISM సర్టిఫికేట్, పాన్, ఆధార్, క్యానిల్‌ చేసిన చెక్కు. ARN పొందడానికి రూ.3,000 ఖర్చవుతుంది. ఇది కూడా 3 సంవత్సరాలు చెల్లుతుంది. 3 సంవత్సరాల తర్వాత, మీరు కొత్త NISM సర్టిఫికేట్ తీసుకొని మళ్ళీ ARN కోసం దరఖాస్తు చేసుకోవాలి.

మ్యూచువల్ ఫండ్ కంపెనీలతో..

AMFI నుండి ARN నంబర్ పొందిన తర్వాత మీరు ఏదైనా మ్యూచువల్ ఫండ్ AMCలో నమోదు చేసుకోవచ్చు. దీని ద్వారా మీరు మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ కావచ్చు. ఆ AMCల ఫండ్ స్కీమ్‌లను అమ్మడం ద్వారా మీరు ఆదాయాన్ని సంపాదించవచ్చు. ఒకటి కంటే ఎక్కువ AMCలతో రిజిస్ట్రన్ట్‌గా మారే అవకాశం ఉంది.

ఆదాయం ఎలా..?

LIC ఏజెంట్ల మాదిరిగానే మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్లు కూడా వివిధ కమీషన్ల ద్వారా ఆదాయాన్ని సంపాదించే అవకాశం ఉంది. మ్యూచువల్ ఫండ్ కంపెనీలు తమ ఫండ్ పథకాలకు కస్టమర్ల నుండి కొంత రుసుమును వసూలు చేస్తాయి. ఈ రుసుములో కొంత భాగాన్ని పంపిణీదారునికి చెల్లిస్తారు. మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్లు ట్రైల్ కమీషన్ల నుండి అత్యధిక ఆదాయాన్ని సంపాదిస్తారు. వారు సాధారణంగా 0.10 శాతం నుండి 1.20 శాతం వరకు ట్రైల్ కమీషన్లను సంపాదిస్తారు.

ట్రైల్ కమిషన్ అంటే డిస్ట్రిబ్యూటర్ ద్వారా ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టే కస్టమర్ చేసే ప్రతి చెల్లింపుపై డిస్ట్రిబ్యూటర్‌కు చెల్లించే కమిషన్. ఈ కమిషన్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో అత్యధికం. అదనంగా కొత్త పెట్టుబడి పెట్టినప్పుడు, ఆ పెట్టుబడికి పంపిణీదారునికి కొంత కమిషన్ ఇస్తారు. మొత్తంమీద పెట్టుబడిదారుడు క్రమం తప్పకుండా పెట్టుబడి పెట్టడం కొనసాగించినంత వరకు, పంపిణీదారుడు ట్రైల్ కమిషన్‌ను అందుకుంటూనే ఉంటాడు.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Follow Us