New Bank Rules: నవంబర్ 1 నుంచి బ్యాంక్ రూల్స్ మారుతున్నాయి! తెలుసుకోకపోతే నష్టపోతారు!
కస్టమర్లకు మరింత ప్రయోజనం చేకూర్చేలా బ్యాంకులు కొన్ని కొత్త రూల్స్ తీసుకురానున్నాయి. ఇందులో భాగంగానే నవంబర్ 1 నుంచి కొన్ని కొత్త రూల్స్ అమలులోకి రాబోతున్నాయి. ఇందులో నామినేషన్ రూల్స్, సేఫ్టీ లాకర్లకు సంబంధించిన ముఖ్యమైన మార్పులు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

బ్యాంకులకు సంబంధించి కొన్ని నియమాలను సవరిస్తూ ఆర్థిక మంత్రిత్వ శాఖ ఇటీవల కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ మార్పులు నవంబర్ 1, 2025 నుండి అమల్లోకి వస్తాయి. ఇకపై కస్టమర్లకు వారి డిపాజిట్లపై ఎక్కువ కంట్రోల్ కలిగి ఉంటారు. అలాగే కస్టమర్లు తమ డబ్బు లేదా లాకర్లలో ఉంచిన ఆస్తులను ఎవరు స్వీకరించాలో నిర్ణయించుకోవచ్చు. వీటి గురించిన మరిన్ని వివరాల్లోకి వెళ్తే..
నాలుగు నామినేషన్లు
నవంబర్ 1, 2025 నుండి అమల్లోకి వచ్చే కొత్త నిబంధనల ప్రకారం, కస్టమర్లు ఇప్పుడు ఒకరి కంటే ఎక్కువ మందిని నామినేట్ చేయవచ్చు. అకౌంట్ లేదా సేఫ్టీ లాకర్లలోని ఆస్తుల కోసం ఒకేసారి నలుగురిని నామినేట్ చేయవచ్చు. లేదా సీక్వెన్షియల్ ఆర్డర్ లో కూడా నామినీలను ఎంచుకోవచ్చు. అంతేకాదు నామినీల్లో ఎవరికి ఎంత వాటా ఇవ్వాలో కూడా నిర్ణయించుకోవచ్చు.
నామినేషన్ రూల్స్
కస్టమర్లు వారి డిపాజిట్ ఖాతాలకు ఒకేసారి నలుగురు నామినీలకు యాడ్ చేసుకోవచ్చు లేదా వరుస విధానంలో నామినీలను ఎంచుకోవచ్చు. అలాగే వారికి వాటా కూడా కేటాయించొచ్చు. సేఫ్టీ లాకర్ల విషయానికొస్తే వరుస విధానంలో నామినేషన్లు అనుమతించబడతాయి. అంటే మొదటి నామినీ తర్వాత రెండవ నామినీకి ఆ తర్వాత మూడవ నామినీ.. ఇలా మాత్రమే ఆస్తి పంపిణీ చేయబడుతుంది. ఈ సీక్వెన్షియల్ నామినేషన్ కింద గరిష్టంగా నలుగురు నామినీలను నియమించుకోవచ్చు. మొదటి నామినీ మరణిస్తే, తదుపరి నామినీ యాక్టివ్ అవుతారు.
ప్రయోజనాలు ఇవే..
బ్యాంకింగ్ రంగంలో పారదర్శకతకు పెంచడం కోసమే ఈ మార్పులు చేసినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ నామినేషన్ నియమాలు అన్ని బ్యాంకులకు ఒకే విధంగా వర్తిస్తాయి. నామినేషన్ ప్రక్రియ కోసం అవసరమైన డాక్యుమెంటేషన్ ప్రాసెస్ .. త్వరలోనే జారీ చేయబడుతుంది. ఇకపోతే నామినేషన్ సౌకర్యం వ్యక్తిగత ఖాతాలకు మాత్రమే వర్తిస్తుంది, అంటే సింగిల్ లేదా జాయింట్ అకౌంట్లకు ఈ నామినేషన్ రూల్ వర్తించదు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




