TV9 Sweet Home Expo: ఇది సొంతింటి కలను నెరవేర్చుకునే సమయం.. టీవీ9 స్వీట్ హోమ్ ఎక్స్‌పో.. ఎప్పుడంటే..
హైదరాబాద్ నగరం విస్తరిస్తోంది.. మౌలిక వసతుల విస్తరణతో పాటు, రవాణా, విద్య, ఆరోగ్యం, టెక్నాలజీ రంగాల వృద్ధి — రియల్ ఎస్టేట్ మార్కెట్‌కు బలమైన పునాది వేస్తున్నాయి. ఇలాంటి తరుణంలో దశాబ్ద కాలంగా రియల్ ఎస్టేట్ కలలకు దిక్సూచిగా ఉన్న టీవీ9 స్వీట్‌హోమ్ మళ్లీ మీ ముందుకు రాబోతోంది..

హైదరాబాద్ నగరం విస్తరిస్తోంది.. మెట్రో ఫేజ్–II, AI సిటీ, ఫార్మా సిటీ, స్కిల్ యూనివర్సిటీ, ఫ్యూచర్ సిటీ వంటి కొత్త ప్రాజెక్టులు నగర అభివృద్ధికి కొత్త ఊపునిస్తున్నారు. మౌలిక వసతుల విస్తరణతో పాటు, రవాణా, విద్య, ఆరోగ్యం, టెక్నాలజీ రంగాల వృద్ధి — రియల్ ఎస్టేట్ మార్కెట్‌కు బలమైన పునాది వేస్తున్నాయి. ఇలాంటి తరుణంలో దశాబ్ద కాలంగా రియల్ ఎస్టేట్ కలలకు దిక్సూచిగా ఉన్న టీవీ9 స్వీట్‌హోమ్ మళ్లీ మీ ముందుకు రాబోతోంది.. హైదరాబాద్ నగరం హైటెక్ సిటీ వేదికగా.. జరిగే ఈ ఎక్స్‌పోకి వచ్చి మీ సందేహాలన్నీ తీర్చుకోవచ్చు.. నచ్చిన ప్రాపర్టీ సెలక్ట్ చేసుకోవచ్చు. హైదరాబాద్‌లో నవంబర్ 15, 16న జరగనున్న అతిపెద్ద రియల్ ఎస్టేట్ ఎక్స్‌పో టీవీ9 స్వీట్‌హోమ్.. మీ సొంతింటి కలను నిజం చేసుకునేందుకు అద్భుతమైన వేదిక.. ఈ ఎక్స్‌పోలో అపార్ట్‌మెంట్లు, ఓపెన్ ప్లాట్లు, విల్లాస్, ఫామ్ ల్యాండ్స్, రెసిడెన్షియల్ అండ్ కమర్షియల్ ప్రాపర్టీస్.. ఇలా ఎన్నో విషయాలపై మీకు నచ్చిన విధంగా .. మీ ఛాయిస్‌కి దగ్గట్టుగా మంచి గైడెన్స్ కూడా దొరుకుతుంది. ప్రాపర్టీస్‌కి సంబంధించిన లోన్ సౌకర్యం కూడా ఈ ఎక్స్‌పోలో అందుబాటులో ఉండనుంది..
రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో హై మోమెంటం..
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ గత కొన్ని సంవత్సరాల్లో కొత్త శిఖరాలను అధిరోహిస్తోంది. ఐటీ, ఫైనాన్స్, ఫార్మా, బయోటెక్ రంగాల దూకుడు, భూముల ధరలను గణనీయంగా పెంచింది. మల్టీనేషనల్ కంపెనీలు కార్యాలయాలను ఏర్పాటు చేసుకోవడం, మెట్రో, ఎక్స్‌ప్రెస్‌వే, ఫ్లైఓవర్ ప్రాజెక్టులు వేగంగా పూర్తవడం, రియల్ ఎస్టేట్‌కు మరింత గిరాకీ తెచ్చాయి.
స్థిరాస్తి ధరలు పరుగులు… కొనుగోలుకు ఇదే సరైన సమయం!
హైదరాబాద్‌లో స్థిరాస్తి ధరలు గతంతో పోలిస్తే రెట్టింపు అయ్యాయి. ముఖ్యంగా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, గచ్చిబౌలి, కోకాపేట్, నానక్‌రామ్‌గూడ, మియాపూర్ వంటి ప్రాంతాల్లో ప్రాపర్టీ విలువలు అధికంగా పెరిగాయి. మార్కెట్ తాత్కాలికంగా నెమ్మదించినా, నిపుణుల అంచనా ప్రకారం రాబోయే కాలంలో ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. అందువల్ల, ఇప్పుడే పెట్టుబడి పెట్టడం లేదా ఇంటి కొనుగోలు నిర్ణయం తీసుకోవడం భవిష్యత్తులో లాభదాయకం.
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అభివృద్ధి వెనుక ప్రధాన కారణాలు..
అభివృద్ధి ప్రాజెక్టుల దూకుడు: హైదరాబాద్ నగరం భవిష్యత్ మేగాసిటీగా రూపుదిద్దుకుంటోంది. మెట్రో రైల్ ఫేజ్–II, ఫార్మా సిటీ, AI సిటీ, స్కిల్ యూనివర్సిటీ, ఫ్యూచర్ సిటీ, హెల్త్ సిటీ వంటి ప్రాజెక్టులు వేగంగా అమలవుతున్నాయి. ఈ మౌలిక వృద్ధి ప్రాజెక్టులు నగర విస్తరణకు కొత్త దారులు తెరిచాయి.
ఐటీ & ఫైనాన్స్ రంగాల విస్తరణ: హైదరాబాద్ ఇప్పుడు దేశంలోని అతిపెద్ద ఐటీ హబ్‌లలో ఒకటి. మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్, టీసీఎస్, విప్రో, HSBC వంటి ప్రముఖ సంస్థలు తమ కార్యకలాపాలను విస్తరించడంతో పాటు కొత్త క్యాంపస్‌లు కూడా ఏర్పాటు చేస్తున్నాయి. ఈ విస్తరణ వల్ల నివాస అవసరాలు, కమర్షియల్ స్పేస్ డిమాండ్ గణనీయంగా పెరిగాయి.
ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వృద్ధి: ORR, రీజినల్ రింగ్ రోడ్ (RRR), ఎయిర్‌పోర్ట్ ఎక్స్‌పాంశన్, ఎక్స్‌ప్రెస్‌వేలు, ఫ్లైఓవర్లు, మెట్రో కనెక్టివిటీ వంటి ప్రాజెక్టులు రియల్ ఎస్టేట్ విలువలను మరింత పెంచుతున్నాయి.
పెట్టుబడులకు సురక్షిత గమ్యం: రాజకీయంగా స్థిరమైన వాతావరణం, పారిశ్రామిక విధానాల్లో అనుకూలత, మరియు ప్రభుత్వ ప్రోత్సాహకాలు పెట్టుబడిదారుల నమ్మకాన్ని పెంచుతున్నాయి.
ఉద్యోగ అవకాశాలు & జనాభా వృద్ధి: టెక్, ఫార్మా, బయోటెక్, ఫైనాన్స్ రంగాల్లో ఉద్యోగాలు పెరగడం వల్ల నగరంలో నివాస అవసరాలు మరింత పెరిగాయి.
అనుకూల వాతావరణం & జీవన ప్రమాణాలు: మంచి నీటి వనరులు, తగిన వాతావరణ పరిస్థితులు, భద్రత, విద్యా & ఆరోగ్య సదుపాయాల వల్ల హైదరాబాద్ జీవించడానికి మరియు పెట్టుబడి పెట్టడానికి దేశంలో అత్యుత్తమ నగరంగా నిలుస్తోంది.
TV9 SWEET HOME EXPO 2025 – మీ కలల ఇంటి కోసం సువర్ణావకాశం!..
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ సమయంలో, TV9 “Sweet Home Expo 2025” రియల్ ఎస్టేట్ కంపెనీలు – కొనుగోలుదారులను ఒకే వేదికపైకి తీసుకువస్తోంది.
నవంబర్ 15, 16, 2025, హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్, హైటెక్ సిటీ, హైదరాబాద్‌లో TV9 Sweet Home Expo 2025 జరగనుంది..
ఈ ఎగ్జిబిషన్‌లో హైదరాబాద్‌లోని ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీలు పాల్గొంటున్నాయి. వివిధ రకాల ఫ్లాట్లు, ప్రీమియం అపార్ట్‌మెంట్లు, ఓపెన్ ప్లాట్లు, విల్లాలు, రో హౌస్‌లు, ఫార్మ్ ల్యాండ్స్, ఫార్మ్ హౌస్‌లు, రెసిడెన్షియల్ & కమర్షియల్ ప్రాపర్టీలు ఒకే వేదికపై అందుబాటులో ఉంటాయి.
నో టెన్షన్.. ఎక్స్‌పో ముఖ్యాంశాలివే..
ప్రవేశం పూర్తిగా ఉచితం!
హైదరాబాద్‌లోని టాప్ రియల్ ఎస్టేట్ కంపెనీల అత్యుత్తమ ప్రాజెక్టులు
ఫ్లాట్లు, విల్లాలు, గేటెడ్ కమ్యూనిటీలు, ఓపెన్ ప్లాట్లు, ఫార్మ్ హౌస్‌లు, కమర్షియల్ ప్రాపర్టీలు — అన్ని విభాగాల్లో ఎంపికలు
హోమ్ లోన్, బ్యాంకింగ్ & ఫైనాన్స్ సంస్థల పాల్గొనడం
ప్రాపర్టీ కొనుగోలుకు ఉచిత సలహాలు & ఫైనాన్స్ గైడెన్స్
డైరెక్ట్ డెవలపర్ల నుండి కొనుగోలు చేసే ప్రత్యేక అవకాశం
స్పాట్ బుకింగ్‌లపై ప్రత్యేక ఆఫర్లు మరియు ప్రయోజనాలు
ప్రాపర్టీ లోన్ అవకాశాలు
ఈ ఎగ్జిబిషన్‌లో ప్రముఖ బ్యాంకులు – ఫైనాన్స్ సంస్థలు కూడా పాల్గొంటున్నాయి.
ఇక్కడ మీరు – ప్రాపర్టీ కొనుగోలుకు సంబంధించిన ఉచిత గైడెన్స్ పొందవచ్చు.
Loan Eligibility & Process గురించి పూర్తి సమాచారం తెలుసుకోవచ్చు.
తక్కువ వడ్డీ రేట్లతో హౌసింగ్ లోన్ ఆఫర్లను పరిశీలించవచ్చు.
ఇప్పుడు నిర్ణయం తీసుకోండి — భవిష్యత్తుకు విలువైన ఆస్తిని సొంతం చేసుకోండి!
హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ విలువలు మరింత పెరగనున్న నేపథ్యంలో, ధరలు పెరగక ముందే సరైన నిర్ణయం తీసుకోండి. ఇది పెట్టుబడిదారుల సమయం — రేపటి విలువైన ఆస్తిని ఈరోజే సొంతం చేసుకోండి!
📍 వేదిక: హాల్ #2, హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్, హైటెక్ సిటీ, హైదరాబాద్ 📅 తేదీ & సమయం: నవంబర్ 15–16, 2025 | ఉదయం 10:00 నుంచి సాయంత్రం 7:00 వరకు 🎟️ ప్రవేశం ఉచితం | పార్కింగ్ సదుపాయం కూడా ఉంది..




