Bank Holidays in June 2022: జూన్‌ నెలలో బ్యాంకు హాలీడేస్ ఇవే.. పూర్తి జాబితా మీకోసం..

Bank Holidays June 2022: జూన్, 2022లో, ఆదివారం కారణంగా దేశంలోని అన్ని బ్యాంకులు జూన్ 5, 12, 1, 26 తేదీలలో పనిచేయవు. జూన్ 11, 25 తేదీలలో దేశంలోని అన్ని బ్యాంకులు నెలలో రెండవ, నాల్గవ శనివారాల కారణంగా మూతపడనున్నాయి.

Bank Holidays in June 2022: జూన్‌ నెలలో బ్యాంకు హాలీడేస్ ఇవే.. పూర్తి జాబితా మీకోసం..
Bank Holidays June 2022
Follow us

|

Updated on: May 31, 2022 | 6:00 AM

బుధవారం నుంచి జూన్ నెల ప్రారంభం అవుతోంది. ఈ ఏడాది జూన్‌లో దేశంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు 11 రోజుల పాటు మూతపడనున్నాయి. ఈ బ్యాంక్ సెలవుల్లో(Bank Holidays) వారాంతపు సెలవులు 6 ఉన్నాయి. ప్రాంతీయ పండుగల సందర్భంగా రెండు రోజుల సెలవులు ఉన్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (Reserve Bank of India) వెబ్‌సైట్ నుంచి అందిన సమాచారం ప్రకారం, జూన్ ప్రారంభమైన వెంటనే బ్యాంకులు 2వ తేదీన మూసి ఉంటాయి. అందువల్ల, మీకు బ్యాంకులో ఏదైనా ముఖ్యమైన పని ఉంటే, బుధవారం నాటికి దాన్ని పరిష్కరించుకోవడం మంచిది. దేశంలోని అన్ని బ్యాంకుల పాలసీలు, సెలవులు రెండింటినీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్ణయిస్తుంది.

ఏ రోజుల్లో బ్యాంకులు మూసి ఉంటాయంటే?

జూన్ 2022లో, ఆదివారం కారణంగా జూన్ 5, 12, 19, 26 తేదీల్లో దేశంలోని అన్ని బ్యాంకులు మూసివేయనున్నారు. జూన్ 11, 25 తేదీలలో, దేశంలోని అన్ని బ్యాంకులు నెలలో రెండవ, నాల్గవ శనివారాల కారణంగా మూసివేయన్నారు. ఇది కాకుండా, మహారాణా ప్రతాప్ జయంతి సందర్భంగా జూన్ 2 న సిమ్లాలో బ్యాంకులు పనిచేయవు. ఇది కాకుండా, YMA డే, గురు హరగోవింద్ జయంతి, రాజా సంక్రాంతి సందర్భంగా జూన్ 15 న మిజోరం, భువనేశ్వర్, జమ్మూ, కాశ్మీర్‌లోని బ్యాంకులు పనిచేయవు. అయితే ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు, లక్నో, పాట్నా, రాంచీ, చండీగఢ్, జైపూర్, రాయ్‌పూర్, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, త్రిపురలలో బ్యాంకులు 6 రోజులు మాత్రమే మూతపడనున్నాయి.

ఇవి కూడా చదవండి

జూన్, 2022లో బ్యాంక్ సెలవులు ఈ విధంగా ఉన్నాయి..

జూన్ 2: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం, మ‌హారాణా ప్రతాప్ జ‌యంతి – తెలంగాణ‌, హిమాచ‌ల్‌ప్రదేశ్‌, హ‌ర్యానా, రాజ‌స్థాన్‌ల‌లో బ్యాంకులు పనిచేయవు.

జూన్ 3: శ్రీ గురు అర్జున్‌దేవ్ జీ అమ‌ర‌వీరుల దినోత్సవం (పంజాబ్‌)

జూన్ 5: ఆదివారం

జూన్ 11: 2వ శ‌నివారం

జూన్ 12: ఆదివారం

జూన్ 14 : గురు క‌బీర్ జ‌యంతి- ఒడిశా, హిమాచ‌ల్ ప్రదేశ్‌, చండీగ‌ఢ్‌, హ‌ర్యానా, పంజాబ్‌ల‌లో బ్యాంకులు పనిచేయవు.

జూన్ 15: వైఎంఏ డే- గురు హ‌ర‌గోవింద్ జీ జ‌యంతి – ఒడిశా, మిజోరం, జ‌మ్ముక‌శ్మీర్‌ల‌లో బ్యాంకులకు సెలవు.

జూన్ 19: ఆదివారం

జూన్ 22: ఖ‌ర్చీ పూజ (త్రిపుర‌)

జూన్ 25 : 4వ శనివారం

జూన్ 26 : ఆదివారం

బ్యాంకులు మూసివేసిన రోజున కూడా, మీరు మీ ముఖ్యమైన పనులను చేసుకోవచ్చు. వాస్తవానికి, బ్యాంకులు అన్ని ఆన్‌లైన్ సేవలు నెల పొడవునా పని చేస్తాయి. ఈ సమయంలో మీరు మీ అన్ని పనులను ఆన్‌లైన్ ద్వారా పూర్తి చేసుకోవచ్చు. బ్యాంకు సెలవు దినాల్లో బ్యాంకు శాఖలు మాత్రమే మూసివేస్తారు. బ్యాంకు ATMలు, నగదు డిపాజిట్ యంత్రాలు, పాస్‌బుక్ ప్రింటింగ్ యంత్రాలు పని చేస్తూనే ఉంటాయి. ఇది కాకుండా, అన్ని బ్యాంకుల మొబైల్ బ్యాంకింగ్, నెట్ బ్యాంకింగ్ సేవలు కూడా బ్యాంకు సెలవుల్లో పనిచేస్తాయి. కాబట్టి, మొబైల్ బ్యాంకింగ్, నెట్ బ్యాంకింగ్ సహాయంతో, మీరు ఫండ్స్ బదిలీలు వంటి అన్ని ముఖ్యమైన పనులను నిర్వహించుకోవచ్చు.

ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
26 రోజులుగా మెగాస్టార్ అదే పని మీద ఉన్నారా.? ఇంటర్వెల్ బాంగ్..
26 రోజులుగా మెగాస్టార్ అదే పని మీద ఉన్నారా.? ఇంటర్వెల్ బాంగ్..