ATM Notes: మీకు ఏటీఎంలలో చెల్లని, చిరిగిన నోట్లు వచ్చాయా..? ఇలా చేయండి..!

ATM Notes: అకౌంట్‌ నుంచి డబ్బులు కావాలంటే ముందుగా ఏటీఎం (ATM)కు వెళ్తుంటాము. బ్యాంకు (Bank)కు వెళ్లి డబ్బులు డ్రా చేసుకునే..

ATM Notes: మీకు ఏటీఎంలలో చెల్లని, చిరిగిన నోట్లు వచ్చాయా..? ఇలా చేయండి..!
Follow us
Subhash Goud

|

Updated on: Jan 24, 2022 | 5:54 AM

ATM Notes: అకౌంట్‌ నుంచి డబ్బులు కావాలంటే ముందుగా ఏటీఎం (ATM)కు వెళ్తుంటాము. బ్యాంకు (Bank)కు వెళ్లి డబ్బులు డ్రా చేసుకునే వారి సంఖ్య పూర్తిగా తగ్గిపోయింది. ప్రస్తుతం కరోనా కాలంలో బ్యాంకుకు వెళ్లే వారి సంఖ్య పూర్తిగా తగ్గిపోయింది. ఇక అవసరాలకు అనుగుణంగా ఏటీఎంలకు వెళ్లి డబ్బులను డ్రా చేసుకుంటాము. అయితే కొన్ని సార్లు ఏటీఎంల నుంచి కూడా నోట్లు చిరిగిపోయినవి కూడా వస్తుంటాయి. అలాంటి సమయంలో చాలా మంది టెన్షన్‌కు గురవుతుంటారు. ఎందుకంటే వాటిని ఎవ్వరు కూడా తీసుకోరని. ఇక ఏటీఎంల నుంచి వచ్చిన డబ్బులును ఏం చేయాలో తెలియక తికమక పడుతుంటాము. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) మార్గదర్శకాల ప్రకారం.. ఏటీఎంల నుంచి చిరిగినా లేదా మురికిగా మారిన చెల్లని పరిస్థితి ఉంటే డబ్బులను మార్పిడి చేసుకోవడం ద్వారా మంచి నోట్లను తిరిగి పొందవచ్చు. ఈ కరెన్సీని మార్చుకోవడానికి బ్యాంకులకు వెళ్లాల్సి ఉంటుంది.

ప్రతి బ్యాంకు శాఖలు ఇలాంటి నోట్లను తిరస్కరించకుండా మార్పిడి చేయాలని 2017 ఏప్రిల్‌లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఉత్తర్వులు జారీ చేసింది. నోట్లు మార్పిడి చేయడానికి ఒక బ్యాంకు ఎక్కువ సమయం తీసుకుంటే పోలీసులకు ఫిర్యాదు చేయవచ్చు. ఈ నిబంధనలు పాటించని బ్యాంకులు రూ .10,000 వరకు జరిమానా సైతం చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అయితే ఏటీఎంల నుంచి చిరిగిపోయినా , పాడైపోయిన నోట్లు వచ్చినట్లయితే వెంటనే, ఆ ఏటీఎం ఏ బ్యాంకుకు సంబంధించినదో తెలుసుకుని వెంటనే ఆ బ్యాంకు బ్రాంచ్ కు వెళ్లి లిఖితపూర్వకంగా దరఖాస్తు చేయాలి. ఎంత డబ్బు ఉపసంహరించుకున్నారన్న విషయాన్ని దరఖాస్తులో తెలుపాల్సి ఉంటుంది. విత్ డ్రా స్లిప్‌ కూడా దరఖాస్తుకు జత చేయాలి. ఒక వేళ మీ వద్ద రశీదు లేకపోతే లావాదేవీ యొక్క ఎస్‌ఎంఎస్‌ (SMS) ను చూపించాల్సి ఉంటుంది. దరఖాస్తు అందిన తరువాత సదరు బ్యాంకు మీకు ఆ చిరిగిన లేదా చెల్లని నోటు స్థానంలో కొత్త కరెన్సీ నోటును జారీ చేస్తుంది. ఈ ప్రక్రియ కొద్ది సేపట్లోనే పూర్తి అవుతుంది.

ఇవి కూడా చదవండి:

LIC Plan: ఎల్‌ఐసీ నుంచి అదిరిపోయే స్కీమ్‌.. ఇందులో చేరితో నెలనెలా పెన్షన్‌ పొందవచ్చు.. పూర్తి వివరాలు

Income Tax: మీ తల్లిదండ్రుల ద్వారా పన్ను ఆదా ప్రయోజనం పొందడం ఎలా.. సులువైన మార్గాలు..!