Ather Electric Scooter: రూ. 10 నాణేలతో.. లక్షలు విలువ చేసే ఈ-స్కూటర్ కొనేశాడు.. అదెలా సాధ్యం.. ఈ స్టోరీ చదవండి..
క్యాష్ ఇస్తారు లేదా చెక్ ఇస్తారు, లేదా కార్డు స్వైప్ చేస్తారు అదీ కాదంటే ఆన్ లైన్ లోచెల్లిస్తారు. కానీ ఆ వ్యక్తి మాత్రం విచిత్రంగా మొత్తం రూ. 10 నాణేలను చెల్లంచాడు. ఏకంగా లక్షకు పైగా మొత్తాన్ని కేవలం రూ. 10 నాణేలను చెల్లించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఈ విషయాన్ని ఏథర్ ఎనర్జీ సీఈఓ తరుణ్ మెహతా తన సోషల్ మీడియాలో షేర్ చేశారు. అయితే ఆయన ఏ మోడల్ కొనుగోలు చేసిందీ వెల్లడించలేదు.

రాజస్థాన్ లోని జైపూర్ కు చెందిన ఓ వ్యక్తి ఏథర్ కంపెనీకి చెందిన ఎలక్ట్రిక్ కొనుగోలు చేశాడు. అవును కొనుగోలు చేస్తే గొప్పేముంది. చాలా మంది కొంటున్నారుగా అనుకుంటున్నారు కదూ. అలా ఆలోచించడంలో తప్పులేదు. కానీ ఇక్కడో ప్రత్యేకత ఉంది. అతను కొనుగోలు చేసిన స్కూటర్ ఏథర్ 450. దీని ధర రూ.1,09,947- రూ. 1,44,871(ఎక్స్ షోరూం) ఉంది. ఈ మొత్తాన్ని ఎవరైనా ఎలా చెల్లిస్తారు.. క్యాష్ ఇస్తారు లేదా చెక్ ఇస్తారు, లేదా కార్డు స్వైప్ చేస్తారు అదీ కాదంటే ఆన్ లైన్ లోచెల్లిస్తారు. కానీ ఆ వ్యక్తి మాత్రం విచిత్రంగా మొత్తం రూ. 10 నాణేలను చెల్లంచాడు. ఏకంగా లక్షకు పైగా మొత్తాన్ని కేవలం రూ. 10 నాణేలను చెల్లించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఈ విషయాన్ని ఏథర్ ఎనర్జీ సీఈఓ తరుణ్ మెహతా తన సోషల్ మీడియాలో షేర్ చేశారు. అయితే ఆయన ఏ మోడల్ కొనుగోలు చేసిందీ వెల్లడించలేదు.
పోస్ట్‌లో ఏముందంటే..
సోషల్ మీడియాలో షేర్ చేసిన చిత్రంలో ఏథర్ షోరూం అధికారులు స్కూటర్ కొనుగోలు చేసిన వ్యక్తికి తాళాలు ఇస్తున్నట్లు గమనించవచ్చు. తరుణ్ మెహతా ఈ చిత్రాన్ని షేర్ చేస్తూ ఓ క్యాప్షన్ కూడా పెట్టారు. ఏథర్ కొత్త కస్టమర్ జైపూర్‌లో తన కోసం 450 సిరీస్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను కొనుగోలు చేశారని.. దీని కోసం అతను రూ. 10 నాణేలను చెల్లించారని రాసుకొచ్చారు. రూ. 10 నాణేల అనేక చిన్న ప్యాకెట్లను తీసుకొచ్చి, దాని మొత్తం ధరను చెల్లించారని వివరించారు. అయితే అతను ఏ మోడల్ ఏథర్ స్కూటర్ కొనుగోలు చేశాడో మాత్రం రాయలేదు. ఏథర్ 450 సిరీస్ లో పలు రకాల వేరియంట్లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా ఏథర్ 450 అపెక్స్, ఏథర్ 450ఎక్స్, ఏథర్ 450ఎస్ లకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ఈ మూడు మోడళ్ల ధర రూ.1.10 లక్షల నుంచి రూ. 1.45 లక్షల(జైపూర్‌లో ఎక్స్-షోరూమ్ ధర) వరకు ఉంటుంది. దీని ఆన్-రోడ్ ధర అయితే రూ.1.75 లక్షల వర కూ ఉంటుంది.
ఏథర్ లో ఫ్లిప్ కార్ట్ పెట్టుబడులు..
సింగపూర్ జీఐసీ, ఫ్లిప్‌కార్ట్ సహ వ్యవస్థాపకుడు సచిన్ బన్సాల్, బిన్నీ బన్సాల్ కూడా ఏథర్‌లో పెట్టుబడులు పెట్టారు. ప్రస్తుతం ఈ కంపెనీ మార్కెట్ విలువ 739.4 మిలియన్ డాలర్లు అని ఓ ఆన్ లైన్ నివేదిక చెబుతోంది. 2030 నాటికి భారతదేశంలో ఎలక్ట్రిక్ 2-వీలర్ వాహనాల సంఖ్య 60-70%కి చేరుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం అంచనా వేసింది. ప్రస్తుతం ఇది 4.7 శాతంగా ఉంది. ఏథర్ ఎనర్జీ స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ కావడానికి సిద్ధమవుతోందని కొన్ని మీడియా నివేదికల ద్వారా తెలుస్తోంది. దీని కోసం కంపెనీ సంభావ్య పెట్టుబడి బ్యాంకులతో కూడా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. బెంగళూరుకు చెందిన ఈ కంపెనీ షేర్ విక్రయం ద్వారా 400 మిలియన్ డాలర్లు సమీకరించేందుకు సిద్ధమవుతోంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








