Paytm – FASTAG: పేటీఎంకు మరో బిగ్ షాక్.! ఫాస్టాగ్ నుంచి పేటీఎం అవుట్..
పేటీఎంకు మరో బిగ్ షాక్ తగిలింది. ఫాస్టాగ్ నుంచి పేటీఎంను తొలగించింది ఇండియన్ హైవే మేనేజ్‌మెంట్ కంపెనీ లిమిటెడ్. ఆర్‌బీఐ ఆంక్షల నేపథ్యంలో ఐహెచ్‌సీఎల్ ఈ నిర్ణయం తీసుకుంది. తాము ప్రకటించిన 32 బ్యాంకుల నుంచే ఫాస్టాగ్‌లు తీసుకోవాలని సూచించింది. ఈ 32 అధీకృత బ్యాంకుల్లో ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్, అలహాబాద్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఐడీబీఐ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్..
పేటీఎంకు మరో బిగ్ షాక్ తగిలింది. ఫాస్టాగ్ నుంచి పేటీఎంను తొలగించింది ఇండియన్ హైవే మేనేజ్‌మెంట్ కంపెనీ లిమిటెడ్. ఆర్‌బీఐ ఆంక్షల నేపథ్యంలో ఐహెచ్‌సీఎల్ ఈ నిర్ణయం తీసుకుంది. తాము ప్రకటించిన 32 బ్యాంకుల నుంచే ఫాస్టాగ్‌లు తీసుకోవాలని సూచించింది. ఈ 32 అధీకృత బ్యాంకుల్లో ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్, అలహాబాద్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఐడీబీఐ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యస్ బ్యాంక్ సహా మరికొన్ని బ్యాంకులున్నాయి. పేటీఎం నుంచి టాప్‌అప్స్, డిపాజిట్లు స్వీకరించొద్దని IHMCL ఆదేశించింది. ఇటీవలే పేటీఎం పేమెంట్ బ్యాంక్ లావాదేవీలపై ఆంక్షలు విధించింది RBI. IHMCL తాజా నిర్ణయంతో మరో బిగ్ షాక్ తగిలినట్లయింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ఫిబ్రవరి 29 తర్వాత కొత్త అకౌంట్స్, డిపాజిట్లు, క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ జరపొద్దని ఆదేశించింది. ఇప్పటికే RBI నిర్ణయంతో పేటీఎం షేర్ 40 శాతం పడిపోగా… ఇన్వెస్టర్లకు 9600 కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. ఆర్బీఐ ఆంక్షలతో 30 కోట్ల పేటీఎం యూజర్లు గగ్గోలు పెడుతున్నారు. ఇప్పుడు ఫాస్టాగ్ నుంచి పేటీఎం అవుట్ కావడం సంచలనంగా మారింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..