Delhi Factory Blaze: ఢిల్లీ ఫ్యాక్టరీలో మంటలకు 11 మంది ఆహుతి.! ఆలస్యంగా అగ్నిమాపక దళం
ఢిల్లీలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. నగర శివారు అలీపూర్‌లోని ఓ పెయింట్ ఫ్యాక్టరీలో గురువారం సాయంత్రం మంటలు ఎగిసిపడ్డాయి. కాస్త వ్యవధిలోనే చుట్టుపక్కల ఉన్న గోడౌన్లకు విస్తరించాయి. ఈ ప్రమాదంలో పదకొండు మంది కార్మికులు సజీవ దహనమయ్యారు. ఓ కానిస్టేబుల్ సహా మరో నలుగురికి గాయాలయ్యాయి. మొత్తం 22 ఫైరింజన్లతో సిబ్బంది తీవ్రంగా శ్రమించి మంటలను అదుపుచేశారు.
ఢిల్లీలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. నగర శివారు అలీపూర్‌లోని ఓ పెయింట్ ఫ్యాక్టరీలో గురువారం సాయంత్రం మంటలు ఎగిసిపడ్డాయి. కాస్త వ్యవధిలోనే చుట్టుపక్కల ఉన్న గోడౌన్లకు విస్తరించాయి. ఈ ప్రమాదంలో పదకొండు మంది కార్మికులు సజీవ దహనమయ్యారు. ఓ కానిస్టేబుల్ సహా మరో నలుగురికి గాయాలయ్యాయి. మొత్తం 22 ఫైరింజన్లతో సిబ్బంది తీవ్రంగా శ్రమించి మంటలను అదుపుచేశారు. గురువారం రాత్రి వరకు ఏడుగురి మృతదేహాలను గుర్తించగా.. శుక్రవారం ఉదయం మరో నాలుగు మృతదేహాలు బయటపడ్డాయని అధికారులు చెప్పారు. దీంతో ఈ ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య పదకొండుకు చేరింది. మంటల్లో కాలిపోవడంతో మృతదేహాలను గుర్తించడం కష్టంగా మారిందని అధికారులు చెబుతున్నారు. ఆలిపూర్ లోని దయాల్ పూర్ మార్కెట్ ఏరియాలో ఉన్న పెయింట్ ఫ్యాక్టరీలో ఈ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. అయితే, అగ్నిప్రమాదానికి ముందు… ఫ్యాక్టరీలో భారీ పేలుడు శబ్దం వినిపించిందని స్థానికులు చెబుతున్నారు. ఫ్యాక్టరీలో నిల్వ చేసిన వివిధ రసాయనాల వల్ల పేలుడు జరిగి మంటలు ఎగిసిపడి ఉంటాయని పోలీసులు భావిస్తున్నారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాఫ్తు చేస్తున్నామని, విచారణలో అన్ని వివరాలు తెలుస్తాయని తెలిపారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

