AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

EV Charging Stations: ఎలక్ట్రిక్ వాహనదారులకు గుడ్ న్యూస్.. హైవేలపై చార్జింగ్ స్టేషన్లు..

పెట్రోల్ బంకులు ఉన్నట్లు ఈవీ చార్జింగ్ స్టేషన్లు అందుబాటులోకి వస్తే గానీ సమస్యకు పరిష్కారం రాదు. ఈ క్రమంలో ప్రముఖ కార్ల తయారీ సంస్థ హ్యూందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ దీనిపై ఫోకస్ పెట్టింది. పెట్రోల్ బంకులు ఉన్నట్లుగానే చార్జింగ్ స్టేషన్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. మన దేశంలోని ప్రధాన నగరాలతో పాటు హైవేలపై తన అల్ట్రా-హై స్పీడ్ పబ్లిక్ ఈవీ ఛార్జింగ్ నెట్‌వర్క్‌ను మరింతగా విస్తరిస్తున్నట్లు పేర్కొంది.

EV Charging Stations: ఎలక్ట్రిక్ వాహనదారులకు గుడ్ న్యూస్.. హైవేలపై చార్జింగ్ స్టేషన్లు..
Hyunda Ultra Speed Ev Charging Station
Madhu
|

Updated on: Feb 19, 2024 | 8:53 AM

Share

ఎలక్ట్రిక్ వాహనాల విషయంలో వినియోగదారులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య బ్యాటరీ చార్జింగ్. బ్యాటరీ ఫుల్ చార్జ్ అవడానికి అధిక సమయం పడుతుండటం.. బయటకు వెళ్తే.. ఆకస్మాత్తుగా చార్జింగ్ అయిపోతే అక్కడే పెట్టుకునే అవకాశం లేకపోవడం. దీంతో వారు దూర ప్రయాణాలకు ఈ వాహనాలను వినియోగించడం లేదు. ఈ క్రమంలో పెట్రోల్ బంకులు ఉన్నట్లు ఈవీ చార్జింగ్ స్టేషన్లు అందుబాటులోకి వస్తే గానీ సమస్యకు పరిష్కారం రాదు. ఈ క్రమంలో ప్రముఖ కార్ల తయారీ సంస్థ హ్యూందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ దీనిపై ఫోకస్ పెట్టింది. పెట్రోల్ బంకులు ఉన్నట్లుగానే చార్జింగ్ స్టేషన్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. మన దేశంలోని ప్రధాన నగరాలతో పాటు హైవేలపై తన అల్ట్రా-హై స్పీడ్ పబ్లిక్ ఈవీ ఛార్జింగ్ నెట్‌వర్క్‌ను మరింతగా విస్తరిస్తున్నట్లు పేర్కొంది.

ఇప్పటి వరకూ 11 స్టేషన్లు..

హ్యూందాయ్ ఇప్పటి వరకూ మొత్తం పదకొండు అల్ట్రా-ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్‌లను కలిగి ఉంది. ప్రతి ఒక్క స్టేషన్లో మూడు ఛార్జింగ్ పాయింట్‌లు ఉన్నాయి. ఎలక్ట్రిక్ వాహన దారుల ఆందోళనను తగ్గిస్తూ నగరంలో ప్రయాణంతో పాటు హైవేలపై ప్రయాణానికి అనువుగా మార్చింది.

హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జే వాన్ ర్యూ మాట్లాడుతూ తమ సంస్థను తాము ఎల్లప్పుడూ కొత్త బెంచ్‌మార్క్‌లను రూపొందించడానికి, పరిశ్రమను ఉదాహరణగా నడిపించడానికి ప్రయత్నిస్తున్నామని చెప్పారు. ‘ప్రోగ్రెస్ ఫర్ హ్యుమానిటీ’ అనే మా గ్లోబల్ విజన్‌తో సమలేఖనం చేయబడిన హ్యుందాయ్ తన కస్టమర్ అవసరాలన్నింటినీ తీర్చడానికి ఎల్లప్పుడూ కృషి చేస్తోంది. సంపూర్ణ ఎలక్ట్రిక్ వాహన పర్యావరణ వ్యవస్థను రూపొందించడంపై భారత ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా, హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ కస్టమర్ ఈవీ యాజమాన్య అనుభవాన్ని మెరుగుపరచడానికి కట్టుబడి ఉందని చెప్పారు. అందులో భాగంగానే తమ అల్ట్రా-ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్‌లను 11 స్థానాలకు విస్తరించామని వివరించారు.

ఇవి కూడా చదవండి

ఎక్కడెక్కడ ఉన్నాయంటే..

ఈ ఛార్జింగ్ స్టేషన్లు వ్యూహాత్మకంగా ముంబై, పూణే బెంగళూరు వంటి నగరాలు, అలాగే ఢిల్లీ-చండీగఢ్, ముంబై-సూరత్ వంటి ప్రధాన రహదారుల వెంట ఏర్పాటు చేశారు. ఆయా స్టేషన్లలో కేవలం హ్యుందాయ్ వాహనాలకే కాక నాన్-హ్యుందాయ్ ఈవీ యజమానులకు కూడా రెండు గంటలపాటు చార్జింగ్ పెట్టుకునే అవకాశం ఇస్తారు. ఆయా స్టేషన్ల వద్దే కాఫీ షాపుల వంటి అదనపు సౌకర్యాలు ఉన్నాయి.

హ్యుందాయ్ అల్ట్రా-ఫాస్ట్ ఛార్జర్‌లు శీఘ్ర ఛార్జింగ్ అనుభవాన్ని అందిస్తాయి. ప్రత్యేకించి హ్యుందాయ్ ఐయనిక్5వంటి మోడళ్లకు ఇది కేవలం 21 నిమిషాల్లో 10 నుంచి 80 శాతం వరకు ఛార్జ్ చేస్తుంది. ఛార్జింగ్ ధరలు సరసమైనవిగా ఉంటాయి. యూనిట్‌కు రూ.18 నుంచి ప్రారంభమవుతాయి. మైహ్యూందాయ్ యాప్ ద్వారా సౌకర్యవంతంగా యాక్సెస్ చేయవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..
పాస్‌వర్డ్ లేకుండా వైఫైని ఎలా కనెక్ట్ చేయాలి? సులభమైన ట్రిక్‌
పాస్‌వర్డ్ లేకుండా వైఫైని ఎలా కనెక్ట్ చేయాలి? సులభమైన ట్రిక్‌
జైలర్ 2లో ఆ నటుడు.. అస్సలు ఊహించలేదుగా
జైలర్ 2లో ఆ నటుడు.. అస్సలు ఊహించలేదుగా