యాదాద్రి భువనగిరి కలెక్టర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం
తెలంగాణ ఇప్పుడు భారీ వర్షాలు, వరదలతో వణికిపోతుంది. ప్రస్తుతం జనజీవనం స్తంభించిపోయింది. దీంతో అధికారులు అప్రమత్తమై, సహయక చర్యలు పర్యవేక్షిస్తున్నారు.
తెలంగాణ ఇప్పుడు భారీ వర్షాలు, వరదలతో వణికిపోతుంది. ప్రస్తుతం జనజీవనం స్తంభించిపోయింది. దీంతో అధికారులు అప్రమత్తమై, సహయక చర్యలు పర్యవేక్షిస్తున్నారు. ముంపు ప్రాంతాల్లో పర్యటనలు జరుపుతున్నారు. పంట నష్టంపై అంచనాలు వేస్తున్నారు. తాజాగా వరద ఉధృతుకి నీటమునిగిన పంట పొలాలను పరిశీలించి తిరిగి వస్తున్న యాదాద్రి భువనగిరి కలెక్టర్‌కు త్రుటిలో పెనుప్రమాదం తప్పింది. ( బెజవాడ దివ్య తేజస్విని ఎపిసోడ్‌లో సంచలన ట్విస్ట్, వాళ్ళిద్దరికీ పెళ్లి ! )
వివరాల్లోకి వెళ్తే.. యాదాద్రి జిల్లా భువనగిరి( మ)అనాజీ పురం సమీపంలో కలెక్టర్ అనిత రామచంద్రన్ కారును లారీ బలంగా ఢీ కొట్టింది. అయితే ఆ సమయంలో కలెక్టర్ కారులోనే ఉన్నా అదృష్టవశాత్తూ ఎటువంటి గాయాలు కాలేదు. వలిగొండ మండలంలో పలు గ్రామాల్లో.. అకాల వర్షం, వరదల కారణంగా నష్టపోయిన పంట పొలాలను పరిశీలించి తిరిగి భువనగిరి వస్తుండగా ఈ యాక్సిడెంట్ జరిగింది. లారీ డ్రైవర్ అతి వేగంగా వస్తూ ఎదురుగా వస్తున్న కారు ఢీ కొట్టినట్టు తెలుస్తోంది.
( గూగుల్ మరో మిస్టేక్..సారా టెండుల్కర్ అతడి భార్యట ! )