వంటలక్కతో సుమక్క

సుమక్క తెలుగు టెలివిజన్ నంబర్ వన్ యాంకర్. ఫ్రి రిలీజ్ ఫంక్షన్లు, ఆడియో ఫంక్షన్లు, సక్సెస్ మీట్‌లకు తిరుగలేని వ్యాఖ్యాత.

వంటలక్కతో సుమక్క
Follow us
Ram Naramaneni

| Edited By: Team Veegam

Updated on: Oct 20, 2020 | 11:45 AM

సుమక్క.. తెలుగు టెలివిజన్ నంబర్ వన్ యాంకర్. ఫ్రి రిలీజ్ ఫంక్షన్లు, ఆడియో ఫంక్షన్లు, సక్సెస్ మీట్‌లకు తిరుగలేని వ్యాఖ్యాత. బుల్లి తెర లేడీ సూపర్‌స్టార్‌గా వెలుగొందుతున్నారు సుమ కనకాల.  ఇక వంటలక్క..తెలుగు టెలివిజన్ స్టార్ నటి. తెలుగు రాష్ట్రాలలో వంటలక్కకు ఉన్న అభిమానుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆమె కారణంగా కార్తీక దీపం ధారావాహిక తిరుగలేని రేటింగ్‌తో దూసుకుపోతుంది. ఇలా తెలుగు బుల్లి తెరను ఏలుతోన్న ఈ ఇద్దరు క్వీన్‌లు ఒక చోట కలిస్తే..ఆగండాగండీ ఒకే షోలో కనిపిస్తే..ఆ విజువల్ ఫీస్ట్ మాములుగా ఉండదు. త్వరలోనే అందుకు సమయం కుదిరింది. ప్రస్తుతం ఆ షూటింగ్‌లోనే వీళ్లిద్దరూ పాల్గొంటున్నారు. అయితే అది ప్రత్యేక ఈవెంటా? ఏదైనా షోనా..? లేక ధారావాహికలో సుమ గెస్ట్ రోల్ చేస్తున్నారా అనే అంశం తెలియాల్సి ఉంది. ఇందుకు సంబంధించి ఓ ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన సుమ..వీరిద్దరూ కలిసి ఏం చేస్తున్నారో ఊహించండి అని పేర్కొన్నారు. ఏది ఏమైనా ఈ నటీమణులు కలిసి త్వరలో తెలుగింటి ప్రజలను అలరించేందుకు రెడీ అయ్యారు. లెట్స్ వెయిట్ అండ్ సీ.

What are these two doing ???? Keep guessing …..

Posted by Suma Kanakala on Thursday, 15 October 2020