ఎట్టకేలకు ముహూర్తం.. రేపే ప్రారంభం
రేపు ముహూర్తం.. ప్రారంభోత్సవానికి టైము కుదిరింది.. డేట్ ఫిక్సయ్యింది. అతిథి టైమిచ్చారు. ముఖ్యమంత్రి కూడా సుముఖత వ్యక్తం చేశారు. ఇంకేముంది బెజవాడ ప్రజలు చిరకాలంగా ఎదురు చూస్తున్న ఫ్లైఓవర్ ప్రారంభానికి సిద్దమైంది.
Time fixed and tomorrow inauguration: ఎట్టకేలకు ముహూర్తం కుదిరింది. రేపే ప్రారంభం కాబోతోంది. అదే చిరకాలం బెజవాడ ప్రజలతోపాటు యావత్ ఏపీ ప్రజానీకం ఎదురు చూస్తున్న కనక దుర్గమ్మ ఫ్లై ఓవర్ శుక్రవారం ప్రారంభానికి నోచుకోబోతుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రత్యక్షంగాను.. కేంద్ర రోడ్డు రవాణా శాఖా మంత్రి నితిన్ గడ్కరీ పరోక్షంగాను కనకదుర్గమ్మ ఫ్లైఓవర్‌ను ప్రజా రవాణా కోసం ప్రారంభించబోతున్నారు.
సుమారు పదేళ్ళ క్రితం ప్రతిపాదనల దశ నుంచి పదే పదే వార్తలకెక్కిన ఘనత విజయవాడ కనక దుర్గమ్మ ఫ్లైఓవర్‌ది. పలు మార్లు డిజైన్లలో మార్పులు, ఇంకొన్ని సార్లు అంఛనాల్లో హెచ్చుతగ్గులు… మరికొన్నిసార్లు రాజకీయ వివాదాలు… పదేపదే వార్తల కెక్కేది ఈ ఫ్లైఓవర్. ఎట్టకేలకు మూడు నెలల క్రితమే నిర్మాణం పూర్తి అయ్యింది. ప్రారంభోత్సవం విషయంలోను రెండు నెలలుగా అపుడా ఇపుడా అని ఎదురు చూస్తుంటే గత నెల 22వ తేదీన ముహూర్తం ఖరారైంది. నితిన్ గడ్కరీచే ఫ్లై ఓవర్ ప్రారంభిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. స్థానిక ఎంపీ, టీడీపీ నేత కేశినేని నాని సైతం ఈ విషయాన్ని ట్వీట్ చేశారు.
అయితే, సెప్టెంబర్ 22వ తేదీ దగ్గరవుతున్న క్రమంలో నితిన్ గడ్కరీ కరోనా వైరస్ బారిన పడడంతో ప్రారంభోత్సవం వాయిదా పడింది. తాజాగా ఆయన కరోనా నుంచి కోలుకోవడం.. కశ్మీర్‌లో టన్నెల్స్ పనులకు శ్రీకారం చుట్టడంతో ఆయన ఏపీ విషయంలోను టైమ్ కేటాయించారు. దీంతో అక్టోబర్ 16వ తేదీన వర్చువల్ విధానంలో ఫ్లై ఓవర్‌ను ప్రారంభించేందుకు ఆయన సమయం కేటాయించారు. ఇటు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా సుముఖత వ్యక్తం చేయడంతో కనక దుర్గమ్మ ఫ్లై ఓవర్ ప్రారంభానికి రంగం సిద్దమైంది.
Also read: 15 ఏళ్ళ అమ్మాయిపై 22 రోజులపాటు అఘాయిత్యం
Also read: ఆసియాలో అతిపొడవైన టన్నెల్: తొలి బ్లాస్టింగ్ చేసిన గడ్కరీ
Also read: సోనుసూద్‌కు అరుదైన అవకాశం.. దానికి గుర్తింపుగానే!
Also read: కరోనా వాక్సిన్… క్లినికల్ ట్రయల్స్‌లో కీలక మార్పు
Also read: సముద్రంలో బోటు గల్లంతు