AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తెలంగాణ వాతావరణంపై తాజా బులెటిన్

భారీ వర్షాలతో అతలాకుతలమైన తెలంగాణ రాష్ట్రంలో వచ్చే అయిదు రోజుల పాటు వాతావరణ ఎలా వుండబోతోందో ప్రకటించింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. హైదరాబాద్ వాతావరణ కేంద్రం తాజాగా విడుదల చేసిన వెదర్ బులెటిన్ ఆసక్తికరమైన సమాచారాన్ని అందజేసింది.

తెలంగాణ వాతావరణంపై తాజా బులెటిన్
Rajesh Sharma
|

Updated on: Oct 15, 2020 | 6:12 PM

Share

weather forecast for Telangana state: భారీ వర్షాలతో అతలాకుతలమైన తెలంగాణ రాష్ట్రంలో వచ్చే అయిదు రోజుల పాటు వాతావరణ ఎలా వుండబోతోందో ప్రకటించింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. గత సోమ, మంగళవారాల్లో కురిసిన భారీ వర్షాలు హైదరాబాద్ మహానగరంతోపాటు పలు తెలంగాణ జిల్లాల్లో బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో హైదరాబాద్ వాతావరణ కేంద్రం తాజాగా విడుదల చేసిన వెదర్ బులెటిన్ ఆసక్తికరమైన సమాచారాన్ని అందజేసింది.

అక్టోబర్ 16వ తేదీ నుంచి 21వ తేదీ వరకు తెలంగాణవ్యాప్తంగా వాతావరణం ఎలా వుండబోతోంది తెలియజేసింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. ఈ మేరకు సీనియర్ సైంటిస్టు రాజారావు వెదర్ బులెటిన్ విడుదల చేశారు. వచ్చే అయిదు రోజుల్లో తొలి మూడు రోజులు అంటే అక్టోబర్ 16, 17, 18వ తేదీల్లో తెలంగాణ వ్యాప్తంగా అక్కడక్కడ తేలకపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని బులెటిన్‌లో పేర్కొన్నారు. 19వ తేదీ నుంచి 21వ తేదీ వరకు కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు పడతాయని వివరించారు.

దక్షిణ మధ్య మహారాష్ట్ర, కొంకన్ ప్రాంతాల్లో ప్రస్తుతం తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా మధ్యస్థ ట్రోపో స్పియర్ స్థాయి వరకు ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణించి మహారాష్ట్ర తీరం మీదుగా అరేబియా సముద్రంలోకి ప్రవేశిస్తుందని రాజారావు వివరించారు. ఆ తర్వాత అల్పపీడనం అక్టోబర్ 16, 17వ తేదీల్లో మహారాష్ట్ర ఆనుకుని ఉన్న తూర్పు, ఈశాన్య అరేబియా సముద్రంలో వాయుగుండంగా బలపడే అవకాశం వుందన్నారు. క్రమేపీ పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణించి మరింత బలపడే అవకాశం కనిపిస్తోందని ఆయన వివరించారు.

ఇటు అల్పపీడన ప్రభావంతో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం 1.5 కి.మీ నుండి 3.1 కి.మీ ఎత్తు మధ్య కొనసాగుతూ తెలంగాణలో అక్కడక్కడ వర్షాలకు కారణం కానున్నది. ఇదిలా వుండగా.. అక్టోబర్ 19వ తేదీన మధ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే సంకేతాలున్నాయని రాజారావు అంఛనా వేస్తున్నారు.

Also read:    నవంబర్ 2 నుంచి ఏపీలో స్కూళ్ళు రీ-ఓపెన్

Also read: ఎట్టకేలకు ముహూర్తం.. రేపే ప్రారంభం

Also read: 15 ఏళ్ళ అమ్మాయిపై 22 రోజులపాటు అఘాయిత్యం

Also read: ఆసియాలో అతిపొడవైన టన్నెల్: తొలి బ్లాస్టింగ్ చేసిన గడ్కరీ

Also read: సోనుసూద్‌కు అరుదైన అవకాశం.. దానికి గుర్తింపుగానే!

Also read: కరోనా వాక్సిన్… క్లినికల్ ట్రయల్స్‌లో కీలక మార్పు

Also read: సముద్రంలో బోటు గల్లంతు