నవంబర్ 2 నుంచి ఏపీలో స్కూళ్ళు రీ-ఓపెన్

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలు పున:ప్రారంభం కాబోతున్నాయి. ఈ విషయాన్ని రాష్ట్ర విద్యాశాఖా మంత్రి ఆదిమూలపు సురేశ్ వెల్లడించారు. నవంబర్ రెండవ తేదీ నుంచి కరోనా జాగ్రత్తలతో పాఠశాలలు ప్రారంభించాలని నిర్ణయించినట్లు ఆయన చెప్పారు.

నవంబర్ 2 నుంచి ఏపీలో స్కూళ్ళు రీ-ఓపెన్
Follow us

|

Updated on: Oct 15, 2020 | 5:42 PM

Schools re-open from November 2nd: నవంబర్ 2వ తేదీ నుంచి పాఠశాలలు పున:ప్రారంభిస్తామని ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం తాజాగా వెలువరించిన లాక్ డౌన్ 5.0 నిబంధనల మేరకు పాఠశాలలు పూర్తిస్థాయిలో తిరిగి ప్రారంభించే విషయంలో నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. గుంటూరు, విజయనగరం జిల్లాల్లో పాఠశాలలకు వచ్చిన విద్యార్థులకు కరోనా సోకిన నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకొని స్కూళ్ళు ప్రారంభించేందుకు చర్యలు చేపట్టామని తెలిపారు.

ఒంగోలులో మీడియాతో మాట్లాడిన మంత్రి సురేశ్.. పలు అంశాలపై తన అభిప్రాయాలను పంచుకున్నారు. న్యాయవ్యవస్థపై ప్రభుత్వం పోరాడాల్సిన పరిస్థితి దాపురించిందని… అయితే రాజ్యాంగ వ్యవస్థలపై ప్రభుత్వానికి పూర్తి నమ్మకం ఉందని వ్యాఖ్యానించారు. న్యాయవ్యవస్థను తాము ప్రభావితం చేస్తున్నామని స్వయంగా ప్రతిపక్ష నేతలే చెబుతున్నారని, అది ఎవరో అందరికీ తెలుసునన్నారు.

మరోవైపు రాష్ట్రంలో దళితులపై దాడులు జరుగుతున్నాయనేది కేవలం ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణ మాత్రమేనన్నారు. గత ప్రభుత్వ హయాంలో తహసీల్దార్‌ వనజాక్షిపై దాడి చేస్తే సీఎంగా ఉన్న చంద్రబాబు ఏం చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వంలో దళితులపై దాడులు చేశారన్న ఆరోపణలు వచ్చిన పోలీసులపై కూడా చర్యలు తీసుకున్నామన్నారు. తమ ప్రభుత్వంలో ఎవరు, ఎక్కడ, ఎవరిపై దాడులు చేసినా చట్టం పరిధిలో చర్యలు తీసుకుంటామని ఆదిమూలపు సురేష్ స్పష్టం చేశారు.

Also read: ఎట్టకేలకు ముహూర్తం.. రేపే ప్రారంభం

Also read: 15 ఏళ్ళ అమ్మాయిపై 22 రోజులపాటు అఘాయిత్యం

Also read: ఆసియాలో అతిపొడవైన టన్నెల్: తొలి బ్లాస్టింగ్ చేసిన గడ్కరీ

Also read: సోనుసూద్‌కు అరుదైన అవకాశం.. దానికి గుర్తింపుగానే!

Also read: కరోనా వాక్సిన్… క్లినికల్ ట్రయల్స్‌లో కీలక మార్పు

Also read: సముద్రంలో బోటు గల్లంతు