Breaking News
  • వరద బాధితుల సహాయార్థం పెద్దఎత్తున సీఎంఆర్ఎఫ్ కి విరాళాలు: భారీ వరదల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న హైదరాబాద్ నగరవాసులకు అండగా నిలిచేందుకు పలువురు ముందుకు వచ్చారు. ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు గారి పిలుపు మేరకు తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు అందజేశారు. కష్టకాలంలో ప్రజలను ఆదుకునేందుకు ముందుకు వచ్చి విరాళాలు ఇచ్చిన ప్రతి ఒక్కరికి మంత్రి కేటీఆర్ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.
  • తిరుమల: వైభవంగా శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు. చంద్రప్రభ వాహనంపై దర్శనమిస్తున్న మలయప్ప స్వామి. కరోనా దృష్ట్యా ఏకాంతంగా వాహన సేవలు.
  • ఏపీలో కొత్తగా 3,620 కరోనా కేసులు నమోదు, 16 మంది మృతి. ఏపీలో 7,96,919కు చేరిన కరోనా కేసులు. ఏపీలో ఇప్పటి వరకు కరోనాతో 6,524 మంది మృతి. యాక్టివ్‌ కేసులు 32,257, ఇప్పటి వరకు 7,58,138 మంది డిశ్చార్జ్. ఏపీలో ఇప్పటి వరకు 73,47,776 కరోనా పరీక్షల నిర్వహణ.
  • డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్‌పై సైబర్‌ ఎటాక్‌. డేటా చోరీ యత్నం జరిగినట్టు గుర్తించిన రెడ్డీస్ ల్యాబ్. ఐదు దేశాల్లో సంస్థ కార్యకలాపాలపై ప్రభావం. భారత్‌ సహా అమెరికా, లండన్‌, బ్రెజిల్‌, రష్యాలో నిలిచిన ఉత్పత్తులు. కరోనా వ్యాక్సిన్‌ కోసం ప్రపంచ వ్యాప్తంగా ప్రయోగాలు. ఔషధ ప్రయోగశాలలను టార్గెట్‌ చేసిన సైబర్‌ నేరగాళ్లు. స్పుత్నిక్‌-వి ట్రయల్స్ కోసం డాక్టర్‌ రెడ్డీస్‌తో రష్యా ఒప్పందం. సైబర్‌ ఎటాక్‌తో భారీ నష్టం వాటిల్లిందన్న రెడ్డీస్‌ ల్యాబ్. సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేసిన రెడ్డీస్‌ ల్యాబ్‌. 24 గంటల తర్వాత ఉత్పత్తిని తిరిగి ప్రారంభిస్తామన్న రెడ్డీస్‌ ల్యాబ్.
  • హైదరాబాద్‌: నేరేడ్‌మెట్‌ అంబేద్కర్‌నగర్‌లో విషాదం. కరోనాతో వెంకటేష్‌ అనే వ్యక్తి మృతి. భర్త మృతిని తట్టుకోలేక భార్య ధనలక్ష్మి ఆత్మహత్య. బిల్డింగ్‌ పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న ధనలక్ష్మి.
  • విశాఖ చేరుకున్న అసోం రైఫిల్స్ జవాన్‌ బాబూరావు మృతదేహం. అసోం రైఫిల్స్ విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన బాబూరావు. ఖోన్సా దగ్గర ఎదురుకాల్పుల్లో బాబూరావు మృతి. బాబూరావు స్వస్థలం శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు. విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో భద్రతా దళాల నివాళులు. బాబూరావు భౌతికకాయం స్వస్థలానికి తరలింపు.
  • మహబూబాబాద్‌: హత్యకు గురైన దీక్షిత్‌ తల్లి ఆవేదన. నా కొడుకును హత్యచేసిన నిందితులను ఎన్‌కౌంటర్‌ చేయాలి. ఇలాంటి ఉన్మాదులను ఎన్‌కౌంటర్‌ చేయకపోతే.. ఏ తల్లీ ధైర్యంగా పిల్లలను బయటకు పంపే పరిస్థితి ఉండదు. పిల్లవాడని చూడకుండా కిరాతకంగా చంపినవారికి తగిన శిక్ష విధించాలి. నిందితులను ఎన్‌కౌంటర్‌ చేస్తేనే నా కుమారుడి ఆత్మ శాంతిస్తుంది. -బాలుడు దీక్షిత్‌ తల్లి వసంత.

బెజవాడ దివ్య తేజస్విని ఎపిసోడ్‌లో సంచలన ట్విస్ట్, వాళ్ళిద్దరికీ పెళ్లి !

బెజవాడ దివ్య తేజస్విని ఎపిసోడ్‌లో అనూహ్య ట్విస్ట్ చోటుచేసుకుంది‌. మృతురాలు దివ్యకు, హంతకుడు నాగేంద్రబాబుకు అంతకు ముందే పెళ్లైనట్టు తెలుస్తోంది.

Vijayawada B tech Student Murder, బెజవాడ దివ్య తేజస్విని ఎపిసోడ్‌లో సంచలన ట్విస్ట్, వాళ్ళిద్దరికీ పెళ్లి !

బెజవాడ దివ్య తేజస్విని ఎపిసోడ్‌లో అనూహ్య ట్విస్ట్ చోటుచేసుకుంది‌. మృతురాలు దివ్యకు, హంతకుడు నాగేంద్రబాబుకు అంతకు ముందే పెళ్లైనట్టు తెలుస్తోంది. ఈ విషయం మరెవరో చెప్పింది కాదు.. హాస్పిటల్‌లో చావు బతుకుల మధ్య పోరాడుతున్న నాగేంద్రబాబే స్వయంగా తన పెళ్లి గురించి అతని సోదరునితో చెప్పాడట.
దివ్యకు, నాగేంద్రకు సీక్రెట్‌గా మ్యారేజ్‌ జరిగిపోయిందట. అదే విషయం మాట్లాడటానికి నిన్న రాత్రి దివ్య వాళ్ల ఇంటికి నాగేంద్రబాబు వెళ్లాడట. అక్కడ నాగేంద్రకు, దివ్య పేరెంట్స్‌కు గొడవ జరిగిందని అతని సోదరుని మాటల ద్వారా తెలుస్తోంది. దివ్య తల్లిదండ్రులు తమ పెళ్లికి ఒప్పుకోకపోవడంతో.. ఇక తాము కలిసుండలేమనే కోపంలో నాగేంద్రబాబు ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటాడని అంటున్నారు. మరోవైపు.. వాళ్లిద్దరూ కలిసి ఉన్న ఫోటో సైతం బయటకు వచ్చింది. ఆ ఫోటోలో దివ్య మెడలో తాళిబొట్టు ఉన్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది. వాళ్లిద్దరూ అంత సన్నిహితంగా ఉండి సెల్ఫీ దిగడం.. ఆమె మెడలో తాళి ఉండటం చూస్తుంటే.. వాళ్లిద్దరికీ పెళ్లి అయ్యిందనే అనుమానం బలపడుతుందని అంటున్నారు . దివ్య, నాగేంద్రబాబులు ఏడేళ్లుగా ప్రేమించుకుంటున్నారని అంటున్నారు. వారిది డీప్‌ లవ్‌ అని చెబుతున్నారు. కొంతకాలం క్రితం వారిద్దరూ సీక్రెట్‌గా మ్యారేజ్‌ చేసుకున్నారని తెలుస్తోంది. హత్యకు ముందురోజు రాత్రి నాగేంద్రబాబు దివ్య వాళ్లింటికి వెళ్లాడని.. ఆమె పేరెంట్స్‌తో గొడవ జరిగిందని సమాచారం.

దివ్య ఇంట్లో వాళ్లు ఒప్పుకోకపోవడంతో ఇక తాము కలిసుండలేమని నాగేంద్రబాబు భావించి ఉంటాడు. ఆ అసహనంతోనే దివ్యను చంపేసి.. తానూ ఆత్మహత్య యత్నం చేసుంటాడని అంటున్నారు నాగేంద్రబాబు కుటుంబ సభ్యులు .  దివ్య బీటెక్‌ ఫైనల్‌ ఇయర్‌ స్టూడెంట్‌. నాగేంద్రబాబు పెయింటర్. దివ్య ఇంటి వెనకాలే నాగేంద్రబాబు ఇల్లు. కాలేజీ రోజుల నుంచే దివ్య తేజస్విని వెంట  నాగేంద్రబాబు తిరిగేవాడని తెలుస్తోంది. కొంతకాలానికి ఇద్దరి మధ్యా మంచి స్నేహం ఏర్పడిందని, అది ప్రేమగా మారిందని చెబుతున్నారు.

Also Read :

దింపుడుకల్లం వద్ద పిలుపుకు స్పందన, ఆస్పత్రికి తీసుకెళ్తే..

ట్రాక్టర్‌ తిరగబడి కొడుకు మరణం, బాధ తట్టుకోలేక ఆగిన తల్లి గుండె

Related Tags