Breaking News
  • వరద బాధితుల సహాయార్థం పెద్దఎత్తున సీఎంఆర్ఎఫ్ కి విరాళాలు: భారీ వరదల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న హైదరాబాద్ నగరవాసులకు అండగా నిలిచేందుకు పలువురు ముందుకు వచ్చారు. ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు గారి పిలుపు మేరకు తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు అందజేశారు. కష్టకాలంలో ప్రజలను ఆదుకునేందుకు ముందుకు వచ్చి విరాళాలు ఇచ్చిన ప్రతి ఒక్కరికి మంత్రి కేటీఆర్ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.
  • తిరుమల: వైభవంగా శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు. చంద్రప్రభ వాహనంపై దర్శనమిస్తున్న మలయప్ప స్వామి. కరోనా దృష్ట్యా ఏకాంతంగా వాహన సేవలు.
  • ఏపీలో కొత్తగా 3,620 కరోనా కేసులు నమోదు, 16 మంది మృతి. ఏపీలో 7,96,919కు చేరిన కరోనా కేసులు. ఏపీలో ఇప్పటి వరకు కరోనాతో 6,524 మంది మృతి. యాక్టివ్‌ కేసులు 32,257, ఇప్పటి వరకు 7,58,138 మంది డిశ్చార్జ్. ఏపీలో ఇప్పటి వరకు 73,47,776 కరోనా పరీక్షల నిర్వహణ.
  • డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్‌పై సైబర్‌ ఎటాక్‌. డేటా చోరీ యత్నం జరిగినట్టు గుర్తించిన రెడ్డీస్ ల్యాబ్. ఐదు దేశాల్లో సంస్థ కార్యకలాపాలపై ప్రభావం. భారత్‌ సహా అమెరికా, లండన్‌, బ్రెజిల్‌, రష్యాలో నిలిచిన ఉత్పత్తులు. కరోనా వ్యాక్సిన్‌ కోసం ప్రపంచ వ్యాప్తంగా ప్రయోగాలు. ఔషధ ప్రయోగశాలలను టార్గెట్‌ చేసిన సైబర్‌ నేరగాళ్లు. స్పుత్నిక్‌-వి ట్రయల్స్ కోసం డాక్టర్‌ రెడ్డీస్‌తో రష్యా ఒప్పందం. సైబర్‌ ఎటాక్‌తో భారీ నష్టం వాటిల్లిందన్న రెడ్డీస్‌ ల్యాబ్. సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేసిన రెడ్డీస్‌ ల్యాబ్‌. 24 గంటల తర్వాత ఉత్పత్తిని తిరిగి ప్రారంభిస్తామన్న రెడ్డీస్‌ ల్యాబ్.
  • హైదరాబాద్‌: నేరేడ్‌మెట్‌ అంబేద్కర్‌నగర్‌లో విషాదం. కరోనాతో వెంకటేష్‌ అనే వ్యక్తి మృతి. భర్త మృతిని తట్టుకోలేక భార్య ధనలక్ష్మి ఆత్మహత్య. బిల్డింగ్‌ పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న ధనలక్ష్మి.
  • విశాఖ చేరుకున్న అసోం రైఫిల్స్ జవాన్‌ బాబూరావు మృతదేహం. అసోం రైఫిల్స్ విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన బాబూరావు. ఖోన్సా దగ్గర ఎదురుకాల్పుల్లో బాబూరావు మృతి. బాబూరావు స్వస్థలం శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు. విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో భద్రతా దళాల నివాళులు. బాబూరావు భౌతికకాయం స్వస్థలానికి తరలింపు.
  • మహబూబాబాద్‌: హత్యకు గురైన దీక్షిత్‌ తల్లి ఆవేదన. నా కొడుకును హత్యచేసిన నిందితులను ఎన్‌కౌంటర్‌ చేయాలి. ఇలాంటి ఉన్మాదులను ఎన్‌కౌంటర్‌ చేయకపోతే.. ఏ తల్లీ ధైర్యంగా పిల్లలను బయటకు పంపే పరిస్థితి ఉండదు. పిల్లవాడని చూడకుండా కిరాతకంగా చంపినవారికి తగిన శిక్ష విధించాలి. నిందితులను ఎన్‌కౌంటర్‌ చేస్తేనే నా కుమారుడి ఆత్మ శాంతిస్తుంది. -బాలుడు దీక్షిత్‌ తల్లి వసంత.

ట్రాక్టర్‌ తిరగబడి కొడుకు మరణం, బాధ తట్టుకోలేక ఆగిన తల్లి గుండె

ప్రకాశం జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.  కన్నకొడుకు ప్రమాదవశాత్తూ చనిపోయి విగతజీవిగా ఉండటం చూసి తల్లి గుండె తట్టుకోలేక పోయింది.

Mother Son Died On Same Day, ట్రాక్టర్‌ తిరగబడి కొడుకు మరణం, బాధ తట్టుకోలేక ఆగిన తల్లి గుండె

ప్రకాశం జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.  కన్నకొడుకు ప్రమాదవశాత్తూ చనిపోయి విగతజీవిగా ఉండటం చూసి తల్లి గుండె తట్టుకోలేక పోయింది. కుమారుడు మృతిచెందిన కొద్దిసేపటికే గుండెపోటుతో  ప్రాణాలు విడిచింది. ఒకే రోజు తల్లి, తనయుడు.. ఇద్దరూ చనిపోవడంతో అద్దంకి మండల పరిధిలోని తిమ్మాయపాలెంలో బుధవారం విషాదఛాయలు అలుముకున్నాయి. ( తెలంగాణ : ఈ నాలుగు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం )

వివరాల్లోకి వెళ్తే..  గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్‌ తోకల వెంకటేశ్వర్లు, రాగమ్మ(60)కు ముగ్గురు కుమారులు. చిన్న కుమారుడు సుబ్బారావు(30) బుధవారం తన మిత్రుడి ట్రాక్టర్ పొలంలో దమ్ము చేస్తూ దిగబడటంతో, దానిని బయటకు తీసేందుకు మరో ట్రాక్టర్‌తో ప్రయత్నించాడు. ఈ క్రమంలో ట్రాక్టర్‌ తిరగబడి స్పాట్‌లోనే మృతిచెందాడు. స్థానికులు పొలం నుంచి సుబ్బారావు మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చారు. సుబ్బారావు మృతదేహాన్ని చూసిన తల్లి రాగమ్మ.. కుమారుడు లేడన్న బాధను తట్టుకోలేక గుండెపోటుతో మృతి చెందింది. సుబ్బారావుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఒకే ఇంటిలో తల్లి, కుమారుడు మృతి చెందటంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ( దింపుడుకల్లం వద్ద పిలుపుకు స్పందన, ఆస్పత్రికి తీసుకెళ్తే.. )

Related Tags