తెలుగులో ఆ హీరోయిన్స్ తక్కువ.. అందుకే నేనొచ్చా!

TV9 Telugu

27 April 2024

జాతి రత్నాలు సినిమాతో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది ఫరియా అబ్దుల్లా. ఇందులో ఆమె పోషించిన చిట్టీ పాత్రకు మంచి స్పందన వచ్చింది.

జాతి రత్నాలు తర్వాత చాలా సినిమాల్లో నటించిందీ హైదరాబాదీ బ్యూటీ. పలు సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేయడంతో పాటు కొన్నింటిలో క్యామియో రోల్స్ చేసింది.

ప్రస్తుతం అల్లరి నరేశ్ తో కలిసి 'ఆ ఒక్కటీ అడక్కు' అనే కామెడీ ఎంటర్ టైన్ మూవీలో నటిస్తోంది ఫరియా అబ్దుల్లా.

ఇప్పటికే అన్నిహంగులు పూర్తి చేసుకున్న ఆ ఒక్కటి అడక్కు సినిమా మే 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ప్రమోషన్లలో స్పీడ్ పెంచారు.

హీరో నరేశ్ తో పాటు హీరోయిన్ ఫరియా అబ్దుల్లా వరుసగా ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు. తమ సినిమాను జనాల్లోకి మరింతగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు.

తాజాగా ఓ ఇంటర్వూలో మాట్లాడిన ఫరియా అబ్దుల్లా.. ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో యాక్షన్ మూవీస్ చేసే హీరోయిన్లు తక్కువగా ఉన్నారంది.

నేను ఈ ఖాళీని భర్తీ చేయాలనుకుంటున్నా. యాక్షన్ తరహా చిత్రాలు నాకు బాగా సరిపోతాయనుకుంటున్నా' అని ముద్దుముద్దుగా చెప్పేసింది చిట్టీ.

ఆ ఒక్కటి అడక్కు మూవీతో పాటు ప్రస్తుతం మత్తు వదలరా 2, భగవంతుడు వంటి క్రేజీ సినిమాల్లో నటిస్తోంది ఫరియా అబ్దుల్లా.