- Telugu News Photo Gallery Following these remedies, eye inflammation and watery problems can be check in Summer
Eye Tips: వేసవి కాలం కళ్ళు మంటలా.. ఇలా చేస్తే చిటికెలో ఉపశమనం పొందవచ్చు..
వేసవి కాలం ఎండలు మండిపోతున్నాయి. అడుగు బయటపెట్టాలంటే అనేక రెమిడీస్ ఫాలో కావాల్సిందే. అయితే కళ్లకు సంబంధించి ప్రధానంగా అనేక సూచనలు తీసుకోవాలి. ఎండాకాలంలో కళ్ల నుంచి నీరు కారణం అనేది ప్రధానమైన సమస్య. సాధారణంగా సర్వేంద్రియానాం నయనం ప్రధానం అంటారు. అలాంటి కంటికి శ్రద్ద తీసుకోవాలంటే ఈ రెమిడీస్ ఫాలో కావల్సిందే.
Updated on: Apr 27, 2024 | 9:34 PM

వేసవి కాలం ఎండలు మండిపోతున్నాయి. అడుగు బయటపెట్టాలంటే అనేక రెమిడీస్ ఫాలో కావాల్సిందే. అయితే కళ్లకు సంబంధించి ప్రధానంగా అనేక సూచనలు తీసుకోవాలి.

ఎండాకాలంలో కళ్ల నుంచి నీరు కారణం అనేది ప్రధానమైన సమస్య. సాధారణంగా సర్వేంద్రియానాం నయనం ప్రధానం అంటారు. అలాంటి కంటికి శ్రద్ద తీసుకోవాలంటే ఈ రెమిడీస్ ఫాలో కావల్సిందే.

పాలలో కాని కలబంద రసంలో కానీ దూదిని ముంచి పదిహేను నిమిషాల పాటు కళ్ళపై పెట్టుకుంటే కళ్ళ అలసట తగ్గుతుంది. గంధం చెక్కని అరగదీసి కళ్ళ మీద రాసుకుంటే కళ్ళలోని ఎరుపు తగ్గుతుంది.

దూర ప్రయాణాలు చేసే వారు, తరచూ బయట తిరిగే వారు ఉంటారు. ఈ వేసవి కాలంలో దుమ్ము, ధూళి కళ్ళలో పడుతూ ఉంటుంది. కళ్ళు మంటగా వుంటే చల్లటి నీటితో కళ్ళు శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా చేయడం వల్ల కళ్ళకు కాస్త ఉపశమనం కలిగి హాయినిస్తుంది.

అలాగే రాత్రి నిద్ర పోయే ముందు నాలుగైదు తేనె చుక్కలు, నువ్వుల నూనె నాలుగైదు చుక్కలు వేసి రెండింటిని బాగా కలిపి కళ్ళలో వేసుకుంటే ఉదయానికి కళ్ళు నిర్మలంగా, స్వచ్ఛంగా ఉంటాయి. ఇలా చేయడం వల్ల కళ్ళ లోని దుమ్ముకణాలు, మలినాలను తీసివేయడంలో సహాయపడుతుంది.




