కల్కి కొత్త రిలీజ్ డేట్.. టెన్షన్‌లో ప్రభాస్ ఫ్యాన్స్
TV9 Telugu
27 April 2024
సలార్ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ నటిస్తోన్న చిత్రం కల్కి 2898 AD. దీపికా పదుకొణె హీరోయిన్ గా నటిస్తోంది.
నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తోన్నీ ఈ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ లో మరో బాలీవుడ్ బ్యూటీ దిషా పటానీ ఓ స్పెషల్ సాంగ్ లో సందడి చేయనుంది.
అలాగే బిగ్ బీ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ , రాజేంద్ర ప్రసాద్, పశుపతి వంటి దిగ్గజ నటులు కల్కి మూవీలో కనిపించనున్నారు.
ఇప్పటకే షూటింగ్ పూర్తి చేసుకున్న కల్కి సినిమా మే 9న విడుదల కావాల్సి ఉంది. అయితే సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో సినిమా రిలీజ్ వాయిదా పడింది.
తాజాగా ప్రభాస్ సినిమా కొత్త రిలీజ్ డేట్ ను అధికారికంగా ప్రకటించింది చిత్ర బృందం. జూన్ 27న సినిమాను విడుదల చేయనున్నట్లు ఇందులో పేర్కొంది.
అయితే కల్కి కొత్త రిలీజ్ డేట్ పై ప్రభాస్ ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే ఈ సమయానికి దాదాపు స్కూళ్లు, కాలేజీలు ఓపెన్ అవుతాయి.
దీని ప్రభావం కల్కి సినిమా కలెక్షన్లపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశముందని ప్రభాస్ ఫ్యాన్స్ తెగ టెన్షన్ పడుతున్నారు.
అయితే అదేమీ జరగదని, ప్రభాస్ పాన్ ఇండియా ఇమేజ్, నాగ్ అశ్విన్ ట్రాక్ రికార్డు కల్కి సినిమాలో బ్లాక్ బస్టర్ హిట్ దిశగా నడిపిస్తాయంటున్నారు మరికొందరు.
ఇక్కడ క్లిక్ చేయండి..