Weekly Horoscope: ఆ రాశి వారికి ఆదాయానికి లోటుండదు.. 12 రాశుల వారికి వారఫలాలు ఇలా..

వార ఫలాలు (ఏప్రిల్ 28 నుంచి మే 4, 2024 వరకు): వారం మధ్య నుంచి గురు గ్రహం కూడా ధన స్థానంలోకి వస్తున్నందువల్ల మేష రాశి వారికి వృత్తి, ఉద్యోగాలలో అంచనాలకు మించిన ధన లాభముంటుంది. వృషభ రాశి వారికి ఆదాయ వృద్ధితో పాటు ఖర్చులు పెరిగే అవ కాశం కూడా ఉంది. లాభ స్థానంలో ఉన్న శుక్ర, రవుల కారణంగా మిథున రాశి వారి ఆదాయానికి ఏమాత్రం లోటుండదు. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి వారఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

Weekly Horoscope: ఆ రాశి వారికి ఆదాయానికి లోటుండదు.. 12 రాశుల వారికి వారఫలాలు ఇలా..
Weekly Horoscope April 28th May 04 2024
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Janardhan Veluru

Updated on: Apr 28, 2024 | 5:01 AM

వార ఫలాలు (ఏప్రిల్ 28 నుంచి మే 4, 2024 వరకు): వారం మధ్య నుంచి గురు గ్రహం కూడా ధన స్థానంలోకి వస్తున్నందువల్ల మేష రాశి వారికి వృత్తి, ఉద్యోగాలలో అంచనాలకు మించిన ధన లాభముంటుంది. వృషభ రాశి వారికి ఆదాయ వృద్ధితో పాటు ఖర్చులు పెరిగే అవ కాశం కూడా ఉంది. లాభ స్థానంలో ఉన్న శుక్ర, రవుల కారణంగా మిథున రాశి వారి ఆదాయానికి ఏమాత్రం లోటుండదు. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి వారఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

గ్రహాల అనుకూలత ఎక్కువగా ఉంది. వారం మధ్య నుంచి గురు గ్రహం కూడా ధన స్థానంలోకి వస్తున్నందువల్ల వృత్తి, ఉద్యోగాలలో అంచనాలకు మించిన ధన లాభముంటుంది. ముఖ్యంగా వృత్తి జీవితంలో ఊహించని ధన లాభముంటుంది. వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతాయి. ఏ ప్రయత్నమైనా సత్ఫలితాలను ఇస్తుంది. సామాజికంగా పలుకుబడి, గౌరవమర్యాదలు పెరుగు తాయి. విలాసాల మీదా, స్నేహితుల మీదా ఖర్చులు పెట్టడం ఎక్కువవుతుంది. ప్రయాణాల వల్ల ఆర్థిక ప్రయోజనాలుంటాయి. ఉన్నతస్థాయి వ్యక్తులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి. వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. భరణి నక్షత్రం వారికి ఆకస్మిక ధన లాభ సూచన లున్నాయి. అనారోగ్యం నుంచి కోలుకుంటారు. కుటుంబంలో సుఖ సంతోషాలకు లోటుండదు.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

ప్రస్తుతం కుజుడు లాభ స్థానంలో, వారం మధ్య నుంచి గురువు ఇదే రాశిలో సంచారం చేస్తున్నం దువల్ల ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది. ఆదాయ వృద్ధితో పాటు ఖర్చులు పెరిగే అవకాశం కూడా ఉంది. అయితే, ఆర్థిక సమస్యల నుంచి చాలావరకు బయటపడతారు. గృహ, వాహన సౌకర్యాల మీదదృష్టి పెడతారు. ముఖ్యమైన వ్యవహారాలు పూర్తి చేయడానికి సమయం అనుకూలంగా ఉంది. శత్రు, రోగ భయం తగ్గుతుంది. ఆదాయ మార్గాలు బాగా విస్తరిస్తాయి. కుటుంబ వ్యవహారాల్లో జీవిత భాగస్వామి సలహాలు తీసుకోవడం మంచిది. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందివస్తాయి. పిల్లలు కొద్ది శ్రమతో ఘన విజయాలు సాధిస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో స్థిరత్వం లభిస్తుంది. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. రోహిణి నక్షత్రం వారు ఆశించిన శుభవార్తలు వింటారు.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

లాభ స్థానంలో ఉన్న శుక్ర, రవుల కారణంగా ఆదాయానికి ఏమాత్రం లోటుండదు. సామాజికంగా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. బంధుమిత్రుల నుంచి అవసరమైన సహాయ సహకారాలుంటాయి. ఉద్యోగంలో మాటకు విలువ పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో అనుకూలతలు పెరుగుతాయి. జీతభత్యాలు, హోదాల విషయంలో శుభవార్తలు వింటారు. వ్యాపారంలో సానుకూల వాతావరణం ఉంటుంది. రావలసిన సొమ్ము సకాలంలో చేతికి అందుతుంది. కుటుంబంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. వ్యాపారాలు ఆశాజన కంగా, లాభసాటిగా సాగిపోతాయి. ఇష్టమైన ఆలయాలను సందర్శిస్తారు. నిరుద్యోగులకు ఆఫర్లు పెరుగు తాయి. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. పునర్వసు నక్షత్రం వారికి ఆకస్మిక ధన లాభం పడుతుంది.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

ఉద్యోగ స్థానంలో రవి, శుక్రులు ఉండడం, వారం మధ్య నుంచి గురువు లాభ స్థానంలోకి ప్రవేశిం చడం వల్ల దాదాపు పట్టిందల్లా బంగారం అవుతుంది. అనేక మార్గాల్లో ఆదాయం కలిసి వస్తుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. జీవిత భాగస్వామి నుంచి మంచి సలహాలు, సూచనలు లభి స్తాయి. ఉద్యోగ జీవితం ఉత్సాహంగా సాగిపోతుంది. వృత్తి రంగం బిజీ అయిపోతుంది. వ్యాపారాలు ఆశాజనకంగా ముందుకు సాగుతాయి. బంధుమిత్రులతో సఖ్యత పెరుగుతుంది. లాభ స్థానం బల పడుతున్న కారణంగా మనుసులోని కోరికలు కొన్ని నెరవేరుతాయి. ఒక ముఖ్యమైన వ్యక్తిగత సమస్య పరిష్కారమవుతుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. పిల్లలు ఆశించిన స్థాయిలో పురో గతి సాధిస్తారు. పుష్యమి నక్షత్రం వారికి ఒకటి రెండు శుభ పరిణామాలు అనుభవానికి వస్తాయి.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

నవమ స్థానంలో రాశ్యధిపతి రవి ఉచ్ఛలో ఉండడం, వారం మధ్య నుంచి గురువు దశమ స్థానం లోకి రావడంవల్ల ఉద్యోగ జీవితంలో జీతభత్యాలు, హోదా పెరగడానికి బాగా అవకాశముంది. బుధ గ్రహం అనుకూలత వల్ల వ్యక్తిగత సమస్యలను తగ్గించుకుంటారు. ఇతరులతో సంబంధ బాంధవ్యాలు బలపడతాయి. కొత్త ప్రయత్నాలు, కొత్త కార్యక్రమాలు చేపట్టడం వల్ల ఆశించిన ప్రయోజనాలు సిద్ధిస్తాయి. పెండింగ్ పనులను పట్టుదలగా పూర్తి చేస్తారు. కుటుంబ పరిస్థితులు అనుకూలంగా మారతాయి. మనసులోని కోరికలు చాలావరకు నెరవేరుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం పెరుగుతుంది. వ్యాపారాలు లాభాల బాటపడతాయి. ఆహార, విహారాల్లో కాస్తంత జాగ్ర త్తగా ఉండడం మంచిది. పుబ్బా నక్షత్రం వారికి తప్పకుండా అధికార యోగం పడుతుంది.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

వారం మధ్య నుంచి గురువు భాగ్య స్థానంలో సంచారం ప్రారంభిస్తున్నందువల్ల అన్ని విషయా ల్లోనూ బాగా కలిసి వస్తుంది. అనేక సమస్యలు, ఇబ్బందులు పరిష్కారమవుతాయి. జీవితం చాలావరకు ఉత్సాహంగా, ఉల్లాసంగా, అనుకూలంగా సాగిపోతుంది. దాదాపు ఏడాది పాటు ఆరో గ్యానికి, ఆదాయానికి లోటు ఉండదు. ఆర్థిక పరిస్థితి చాలావరకు మెరుగుపడుతుంది. ఆర్థిక ప్రయత్నాలన్నీ సఫలం అవుతాయి. కుటుంబ పరిస్థితుల చక్కబడతాయి. నిరుద్యోగులకు విదే శాల నుంచి కూడా మంచి ఆఫర్లు అంది వస్తాయి. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం పెరుగుతుంది. అధి కారులు ఎక్కువగా ఆధారపడతారు. వ్యాపారాలు బాగా అనుకూలంగా ఉంటాయి. హస్తా నక్షత్రం వారికి ప్రభుత్వ మూలక ధన లాభం ఉంటుంది. పిల్లల నుంచి ఆశించిన శుభ వార్త వింటారు.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

ముఖ్యమైన గ్రహాలన్నీ అనుకూలంగా ఉండడంతో పాటు, రాశినాథుడైన శుక్రుడు సప్తమంలో ఉన్నందువల్ల వారమంతా బాగా అనుకూలంగా గడిచిపోతుంది. చిన్నా చితకా సమస్యలు పరి ష్కారమవుతాయి. వృత్తి, ఉద్యోగాలలో బరువు బాధ్యతలు పెరిగినప్పటికీ, ప్రతిఫలాలు కూడా సంతృప్తికరంగా ఉంటాయి. ఆదాయం బాగా పెరుగుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్టు వేగంగా పూర్తి చేస్తారు. బంధుమిత్రుల వల్ల ఆశించిన ప్రయోజనాలు పొందుతారు. తోబుట్టువులతో వివాదాలు సమసిపోతాయి. ప్రయాణాల వల్ల లాభముంటుంది. వ్యాపారాలు ఆర్థికంగా కొత్త పుంతలు తొక్కుతాయి. నిరుద్యోగులకు అవకాశాలు పెరుగుతాయి. కుటుంబ జీవితం చాలావరకు హ్యాపీగా సాగిపోతుంది. విశాఖ నక్షత్రం వారికి సామాజికంగా గౌరవ మర్యాదలు పెరుగుతాయి.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

ఈ రాశివారికి వారం మధ్య నుంచి చాలా బాగుంటుంది. వారం మధ్యలు సప్తమ స్థానంలో గురువు ప్రవేశం వల్ల ఏ మప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. అర్ధాష్టమ శని వల్ల ఇంత వరకూ పడుతున్న కొన్ని కష్టనష్టాల నుంచి విముక్తి లభిస్తుంది. వ్యక్తిగత, కుటుంబ సమస్యల నుంచి చాలావరకు బయటపడతారు. ఆర్థికంగా ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా విజయాలు సాధిస్తారు. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా సాగిపోతాయి. ఆస్తి వివాదం పరిష్కార దిశగా సాగుతుంది. అదనపు ఆదాయ అవకాశాలు వృద్ధి చెందుతాయి. వృత్తి, ఉద్యోగాలు ఆశాజనకంగా ముందుకు సాగుతాయి. వ్యాపా రాల పరిస్థితి మెరుగుపడుతుంది. అనూరాధ నక్షత్రం వారికి మంచి అదృష్టం పడుతుంది.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాడ 1)

పంచమ స్థానంలో శుక్ర, రవుల సంచారం వల్ల ఈ రాశివారికి తప్పకుండా రాజయోగం పడు తుంది. ముఖ్యంగా మనసులోని ఒకటి రెండు కోరికలు నెరవేరుతాయి. ఆర్థిక ప్రయత్నాలు, అద నపు ఆదాయ ప్రయత్నాలు తప్పకుండా విజయవంతం అవుతాయి. ఏ రంగంలో ఉన్నవారికైనా ఆర్థిక, వ్యక్తిగత పురోగతి ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపా రాలు లాభాల బాటపడతాయి. వ్యక్తిగత, కుటుంబ జీవితానికి సంబంధించి ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు తప్పకుండా సత్ఫలితాలనిస్తాయి. ఆస్తి వివాదాల్లో ఆచితూచి వ్యవహరించడం మంచిది. నిరుద్యోగులకు ఆశించిన శుభవార్తలు అందుతాయి. పిల్లలకు విజయాలు సాధిస్తారు. దాంపత్య జీవితం సాఫీగా సాగిపోతుంది. పూర్వాషాఢ వారికి ఎదురు చూస్తున్న శుభవార్త అందుతుంది.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

ధన స్థానంలో బలంగా ఉన్న ధనాధిపతి శని కారణంగా ఆదాయానికి లోటుండదు. అవసరాలకు సరిపడ డబ్బు అందుతూ ఉంటుంది. ఆర్థిక సమస్యలు క్రమంగా తగ్గిపోతాయి. వారం మధ్యలో పంచమ స్థానంలోకి గురువు రాబోతున్నందువల్ల అప్పటి నుంచి ఏడాది పాటు వృత్తి, ఉద్యోగాల్లో అందలాలు ఎక్కుతూ ఉంటారు. కెరీర్ పరంగా ముందుకు దూసుకుపోతారు. సమాజంలో మంచి పరిచయాలు ఏర్పడతాయి. వృత్తి, ఉద్యోగాల్లో మీ ప్రతిభా పాటవాలకు గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాలు ప్రోత్సాహరంగా సాగిపోతాయి. ఆహార, విహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఆధ్యా త్మిక కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటారు. దాంపత్యంలో అన్యోన్యత పెరుగుతుంది. పిల్లల నుంచి ఆశించిన శుభవార్తలు వింటారు. ఉత్తరాషాఢ వారికి ఆకస్మిక అధికార లాభానికి అవకాశం ఉంది.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

ధన స్థానంలో కుజుడు, తృతీయ స్థానంలో రవి వల్ల జీవితం బాగా బిజీ అయిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో క్షణం కూడా తీరిక లేని పరిస్థితి ఏర్పడు తుంది. ఉద్యోగంలో బరువు బాధ్యతలు, లక్ష్యాలు పెరుగుతాయి. ఇంటా బయటా కాస్తంత ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గానే ఉంటుంది కానీ, ఖర్చులు బాగా పెరిగే అవకాశముంది. ఉద్యోగులు, నిరుద్యోగులు విదేశాల నుంచి ఆశించిన సమాచారం వింటారు.ముఖ్యమైన పనుల్ని అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. వృత్తుల్లో ఉన్నవారికి శ్రమాధిక్యంత ఉంటుంది కానీ, ఆదాయపరంగా అనుకూల వాతావరణం కనిపిస్తోంది. కుటుంబ పరిస్థితులు సర్దుమణుగుతాయి. ఆరోగ్యం చాలావరకు పరవా లేదనిపిస్తుంది. పూర్వాభాద్ర నక్షత్రం వారు అనుకోకుండా ఒకటి రెండు శుభ వార్తలు వింటారు.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

ధన స్థానంలో ఉన్న ఉచ్ఛ రవి, శుక్ర గ్రహాలు ఆర్థిక పరిస్థితిని బాగా మెరుగుపరిచే అవకాశం ఉంది. ముఖ్య అవసరాలు తీరడమే కాకుండా, ఇతరులకు ఆర్థికంగా సహాయం చేయడానికి కూడా వీలు పడుతుంది. సొంత రాశిలో కుజ సంచారం వల్ల ఆశించిన స్థాయిలో వ్యక్తిగత పురోభి వృద్ధికి అవకాశం ఉంటుంది. మీరు చేపట్టిన మార్పుల కారణంగా వృత్తి, వ్యాపారాలు లాభాల బాటపడతాయి. డాక్టర్లు, లాయర్లు తదితర వృత్తుల వారికి బాగా డిమాండు పెరుగుతుంది. ఉద్యో గంలో అధికారులు నుంచి ఆశించిన ఆదరణ, ప్రోత్సాహం లభిస్తాయి. ఆర్థిక ప్రయత్నాలన్నీ సత్ఫ లితాలనిస్తాయి. కొందరు మిత్రుల సహాయంతో ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేస్తారు. ఆధ్యా త్మిక చింతన బాగా పెరుగుతుంది. ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి అరుదైన గౌరవాలు లభిస్తాయి.

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే