ప్రేమపై చిన్నప్పటినుంచే నమ్మకముంది

TV9 Telugu

27 April 2024

త్వరలోనే అదితి రావ్‌ హైదరీ హీరామండీ ది డైమండ్‌ బజార్‌ సిరీస్‌తో మే 1 నుంచి ప్రేక్షకుల ముందుకు రానుంది. 

దీంతో సిరీస్‌బృందం వరుస ప్రమోషన్లు ఇస్తూ బిజీగా ఉంది. అయితే తాజాగా ఓ ఆంగ్లమీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

ఈ సిరీస్‌లో నాది మృదుస్వభావం కలిగిన పాత్ర. విడిగా  కూడా నేను అలానే ఉంటాను. చిన్నప్పటినుంచి ఇంట్లో నాకు పూర్తి స్వేచ్ఛనిచ్చారు.

దేనికోసం ఫైట్ చేయాల్సిన అవసరం రాలేదు. నా తల్లిదండ్రులు కూడా ప్రతీ విషయంలోనూ సపోర్ట్‌ చేశారు.  ప్రేమపై చిన్ననప్పటినుంచి నమ్మకమేర్పడింది.

విశ్వాసం ఉంటే దేన్నైనా సాధించగలం. మహిళలు చాలా విషయాల్లో సర్దుకుపోతుంటారు. నేను దేని గురించైనా ధైర్యంగా మాట్లాడతాను.

‘హీరామండీ’లో పాత్రలు ప్రేక్షకులను మెప్పిస్తాయి. సంజయ్‌లీలా బన్సాలీ స్త్రీలను చూపించే విధానం చాలా ప్రత్యేకంగా ఉంటుంది.

వాళ్లు ఎంత ప్రేమ చూపిస్తారో అంత ప్రతీకారం తీర్చుకోగలరు. అన్ని కోణాల్లోనూ చూపించడం ఆయనకు మాత్రమే సాధ్యం’ అని చెప్పారు.

ఈ సిరీస్‌లో అదితిరావ్‌ బిబ్బోజాన్‌ పాత్రలో నటించారు. వేశ్య వృత్తితో సమాంతర వ్యవస్థను నడుపుతున్న కొంతమంది మహిళల జీవిత కథే ఈ సిరీస్‌.