AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vande Bharat: వందేభారత్, వందే మెట్రో మధ్య తేడాలివే.. పూర్తి వివరాలు ఇవిగో..

వందే భారత్ రైళ్లు విజయవంతం కావడంతో అదే జోష్ లో రైల్వే శాఖ త్వరలో వందే మెట్రో రైళ్లను ప్రవేశపెట్టనుంది. జులైలో కొన్ని రూట్లలో ప్రయోగాత్మకంగా నడపనుంది. కలర్ లో తేడా తప్ప ఇవి చూసేందుకు అచ్చం వందే భారత్‌ లాగానే ఉన్నాయి. మరి ఈ రెండింటి మధ్య ఉన్న తేడాలు ఏంటో చూసినట్లయితే.

Vande Bharat: వందేభారత్, వందే మెట్రో మధ్య తేడాలివే.. పూర్తి వివరాలు ఇవిగో..
Vande Bharat
Ravi Kiran
|

Updated on: May 03, 2024 | 1:33 PM

Share

వందే భారత్ రైళ్లు విజయవంతం కావడంతో అదే జోష్ లో రైల్వే శాఖ త్వరలో వందే మెట్రో రైళ్లను ప్రవేశపెట్టనుంది. జులైలో కొన్ని రూట్లలో ప్రయోగాత్మకంగా నడపనుంది. కలర్ లో తేడా తప్ప ఇవి చూసేందుకు అచ్చం వందే భారత్‌ లాగానే ఉన్నాయి. మరి ఈ రెండింటి మధ్య ఉన్న తేడాలు ఏంటో చూసినట్లయితే.. వందే భారత్ ఎక్స్ ప్రెస్ లు దూర ప్రాంతాల మధ్య పరుగులు తీస్తున్నాయి. సుమారు వెయ్యి కిలోమీటర్ల దూరంలోని నగరాలకు ప్రయాణిస్తున్నాయి. కానీ వందే మెట్రోలు తక్కువ దూరానికి ఉద్దేశించినవి. అంటే సుమారు 100 కిలోమీటర్ల నుంచి 250 కిలోమీటర్ల దూరంలోని ప్రాంతాల మధ్య షటిల్ సర్వీస్ లాగా రాకపోకలు సాగించనున్నాయి. అంటే ఇవి మినీ వందే భారత్ లు అన్నమాట. సమీప పట్టణాల్లో పనిచేసే ఉద్యోగులు, చదువుకొనే విద్యార్థులకు వందే మెట్రోల వల్ల ఎక్కువగా లాభం జరగనుంది. దేశంలో సబర్బన్ రైలు ప్రయాణ అనుభూతిని మెరుగుపరిచేందుకు రైల్వే శాఖ వీటిని ప్రవేశపెడుతోంది. 124 నగరాలు, పట్టణాల్లో వందే మెట్రోలను ప్రారంభించనుంది.

వందే భారత్ లాగానే వందే మెట్రోలలో కూడా కనీసం 12 కోచ్ లు ఉంటాయి. ప్రయాణికుల రద్దీని బట్టి 16 కోచ్ ల దాకా పెంచనున్నారు. సీట్ల సంఖ్యలో తేడా ఉండనుంది. వందే భారత్ ఎక్స్‌ప్రోస్‌లో అందరికీ సౌకర్యవంతమైన సీటింగ్ సదుపాయం ఉంది. అదే వందే మెట్రోలలో కేవలం 100 మంది కూర్చొనేందుకే సీట్లు ఉండనున్నాయి. మరో 180 మంది ప్రయాణికులు నిలబడేందుకు చోటు వుంటుంది. వందేభారత్ రైళ్లు చాలా వేగవంతమైనవి. గంటకు గరిష్ఠంగా 183 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లగలవు. కానీ వందే మెట్రోలు కొంత తక్కువ వేగంతో ప్రయాణిస్తాయి. గంటకు 130 కిలోమీటర్ల టాప్ స్పీడ్ వరకే వెళ్లగలవు. ఫ్రీక్వెన్సీ పరంగా చూస్తే వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లు రోజుకు ఒకటి లేదా రెండు ట్రిప్పులు నడుస్తాయి. కానీ వందే మెట్రోలు షటిల్ సర్వీస్ లాగా రోజుకు నాలుగు లేదా ఐదు ట్రిప్పులు వేస్తాయి. వందే మెట్రోలను తిరుపతి–చెన్నై, ఢిల్లీ–రేవారి, ఆగ్రా–మథుర, లక్నో–కాన్పూర్ , భువనేశ్వర్–బాలాసోర్ మధ్య నడపనున్నారు.

ఇంట్లో ఈ మొక్కను పెంచుకోండి.. మీ అదృష్టం పంట పండినట్టే..!
ఇంట్లో ఈ మొక్కను పెంచుకోండి.. మీ అదృష్టం పంట పండినట్టే..!
ఆ సాంగ్ తర్వాత నా జీవితమే మారిపోయింది..
ఆ సాంగ్ తర్వాత నా జీవితమే మారిపోయింది..
ఆ స్క్రిప్ట్ విని మహేష్‌తో సినిమా చేయకపోవడం మంచిదనుకున్నా..
ఆ స్క్రిప్ట్ విని మహేష్‌తో సినిమా చేయకపోవడం మంచిదనుకున్నా..
డాక్టర్ల గజిబిజి రాత మెడికల్ షాపు వాళ్లకు ఎలా అర్థమవుతుంది..?
డాక్టర్ల గజిబిజి రాత మెడికల్ షాపు వాళ్లకు ఎలా అర్థమవుతుంది..?
టీమిండియా ప్లేయింగ్ XI ఫిక్స్.. 2 ఏళ్ల తర్వాత తోపు రీఎంట్రీ
టీమిండియా ప్లేయింగ్ XI ఫిక్స్.. 2 ఏళ్ల తర్వాత తోపు రీఎంట్రీ
ఇంట్లోనే స్వచ్ఛమైన నెయ్యి తయారీకి సూపర్‌ ట్రిక్‌.. ఇలా చేశారంటే..
ఇంట్లోనే స్వచ్ఛమైన నెయ్యి తయారీకి సూపర్‌ ట్రిక్‌.. ఇలా చేశారంటే..
మొన్నటి వరకు స్టార్ హీరోయిన్..ఇప్పుడు IPS ఆఫీసర్
మొన్నటి వరకు స్టార్ హీరోయిన్..ఇప్పుడు IPS ఆఫీసర్
అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లల్లో కొత్త రూల్స్.. ఆ టికెట్లు ఉండవ
అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లల్లో కొత్త రూల్స్.. ఆ టికెట్లు ఉండవ
మేడారం మహా జాతరకు బస్ ఛార్జీలు ఖరారు.. ఇలా చేస్తే ఇంటికే ‘బంగారం’
మేడారం మహా జాతరకు బస్ ఛార్జీలు ఖరారు.. ఇలా చేస్తే ఇంటికే ‘బంగారం’
4 కారణాల వల్లే కోటాను కోట్లు పోగొట్టుకున్నా..!
4 కారణాల వల్లే కోటాను కోట్లు పోగొట్టుకున్నా..!