డ్రైనేజీ పనులు చేస్తుండగా కదులుతూ కనిపించి వింత ఆకారం.. భయం.. భయంగా.! వెళ్లి చూస్తే..
ఈ మధ్యకాలంలో సరీసృపాలు ప్రతీసారి జనావాసాల్లోకి వస్తుండటం మనం చూస్తూనే ఉన్నాం. ఇళ్లలోని ఫ్రిడ్జ్‌ల దగ్గర, ఇంటర్నెట్ సెంటర్లలో గ్లాస్ డోర్ల మధ్య, ఏసీల్లో.. ఇలా ఊహించని విధంగా విషసర్పాలు.. మన ఆవాసాలలోకి వచ్చి భయభ్రాంతులకు గురి చేస్తుంటాయి. అందుకు సంబంధించిన వీడియోలు..

ఈ మధ్యకాలంలో సరీసృపాలు ప్రతీసారి జనావాసాల్లోకి వస్తుండటం మనం చూస్తూనే ఉన్నాం. ఇళ్లలోని ఫ్రిడ్జ్‌ల దగ్గర, ఇంటర్నెట్ సెంటర్లలో గ్లాస్ డోర్ల మధ్య, ఏసీల్లో.. ఇలా ఊహించని విధంగా విషసర్పాలు.. మన ఆవాసాలలోకి వచ్చి భయభ్రాంతులకు గురి చేస్తుంటాయి. అందుకు సంబంధించిన వీడియోలు తరచూ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. తెగ చక్కర్లు కొడుతుంటాయి. ఇటీవల కొందరు వ్యక్తులు రోడ్డు పక్కన కాలువ దగ్గర పనులు చేస్తుండగా.. ఓ వింత ఆకారం కదులుతూ కనిపించింది. వారు భయం.. భయంగానే వెళ్లి చూడగా.. షాకింగ్ దృశ్యం వారి కంట పడింది. లోపల ఓ భారీ సైజ్ కింగ్ కోబ్రా ఉండటాన్ని గుర్తించారు. వెంటనే స్నేక్ క్యాచర్లకు సమాచారం అందించారు.
వారంతా అతి కష్టం మీద ఆ పొడవాటి నాగుపామును బయటకు తీశారు. అత్యంత పొడవు ఉన్న ఆ పామును చూసి జనాలు దెబ్బకు దడుసుకున్నారు. పాము తలను పట్టుకుని.. చాకచక్యంగా దాన్ని బంధించడంతో స్థానికులు హమ్మయ్యా.! అంటూ ఊపిరి పీల్చుకున్నారు. కాగా, ఈ వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో తెగ వైరల్ అవుతోంది. దీనిని చూసిన నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు. ‘ఇంత పెద్ద కింగ్ కోబ్రానా’ అంటూ ఒకరు కామెంట్ చేయగా.. ‘స్నేక్ క్యాచర్లకు హ్యాట్సాఫ్ చెప్పాలంటూ’ మరొకరు కామెంట్ చేశారు. లేట్ ఎందుకు మీరూ వీడియోపై ఓ లుక్కేయండి.
The size of this cobra pic.twitter.com/0Hmhv9qFfV
— Science girl (@gunsnrosesgirl3) April 25, 2024
