AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మండుతున్న ఎండలు.. వందేళ్ల రికార్డు బ్రేక్

మండుతున్న ఎండలు.. వందేళ్ల రికార్డు బ్రేక్

Phani CH
|

Updated on: May 02, 2024 | 10:08 PM

Share

దేశవ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో తీవ్ర వడగాల్పులతో ప్రజలు మృత్యువాత పడుతున్నారు. పలు ప్రాంతాల్లో భానుడు చండ్ర నిప్పులు కురిపిస్తూ రికార్డులు తిరగరాస్తున్నాడు. 1921 తర్వాత అంటే 103 ఏళ్ల తర్వాత ఏప్రిల్‌లో అత్యధిక ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటి నమోదయ్యాయి. ఈ మధ్యకాలంలో ఎన్నడూ ఏప్రిల్ నెలలో 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కాలేదు. ఈ ఏడాది మాత్రం ఏప్రిల్ తొలి వారం నుంచే ఉగ్రరూపం ప్రదర్శిస్తున్న సూరీడు..

దేశవ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో తీవ్ర వడగాల్పులతో ప్రజలు మృత్యువాత పడుతున్నారు. పలు ప్రాంతాల్లో భానుడు చండ్ర నిప్పులు కురిపిస్తూ రికార్డులు తిరగరాస్తున్నాడు. 1921 తర్వాత అంటే 103 ఏళ్ల తర్వాత ఏప్రిల్‌లో అత్యధిక ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటి నమోదయ్యాయి. ఈ మధ్యకాలంలో ఎన్నడూ ఏప్రిల్ నెలలో 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కాలేదు. ఈ ఏడాది మాత్రం ఏప్రిల్ తొలి వారం నుంచే ఉగ్రరూపం ప్రదర్శిస్తున్న సూరీడు.. రోజురోజుకు మరింతగా మండిపోతున్నాడు. ఫలితంగా 45 డిగ్రీల ఉష్ణోగ్రత సర్వసాధారంగా మారిపోయింది. అంతేకాదు, వచ్చే ఐదు రోజుల్లో దేశంలోని పలు ప్రాంతాల్లో వాతావరణం మరింత వేడెక్కుతుందని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీచేసింది. తూర్పు, దక్షిణ భారతదేశంలో అధిక తీవ్రతతో వడగాలులు వీస్తాయని హెచ్చరించింది. మే నెలలోనూ భానుడి ప్రతాపం కొనసాగుతుందని తెలిపింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఇంటర్నెట్‌ సెంటర్‌లో నాగజెర్రి బుసలు.. అది చూసి స్థానికులు అరుపులు

దేశంలోనే తొలిసారి దళితుడికి జగద్గురు బిరుదు

ఉక్రెయిన్‌లోని అత్యంత సుందర భవనాల్లో ఒకదానిపై దాడి

ఆహా.. ఇది కదా సంస్కారమంటే.. కట్టిపడేస్తున్న చిన్నారి వీడియో

ప్రేయసితో కలిసి లాడ్జ్‌లో స్టే చేసిన యువకుడు.. బాత్‌రూమ్‌లో ??